Mamta Mohandas: కచ్చితంగా ఒక తోడు ఉండాల్సిన అవసరం లేదు.. మమతా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Mamta Mohandas: యమదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది అందాల తార మమతా మోహన్‌ దాస్‌.

Update: 2024-06-13 15:00 GMT

Mamta Mohandas: కచ్చితంగా ఒక తోడు ఉండాల్సిన అవసరం లేదు.. మమతా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Mamta Mohandas: యమదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది అందాల తార మమతా మోహన్‌ దాస్‌. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రకారును మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత పలు వరుస ఆఫర్లు తగ్గించుకున్న ఈ చిన్నది ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు.

ఇక చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీ మరోసారి ప్రేక్షకులను పకలరించేందుకు సిద్ధమవుతోంది. విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కిన 'మహారాజా' సినిమాలో నటించిందీ చిన్నది. జూన్‌ 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉందీ బ్యూటీ. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన వ్యక్తిగత జీవితానికి, డేటింగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసిందీ బ్యూటీ.

ఈ విషయమై మమతా మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న సమయంలో ఒకరితో ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చిన బ్యూటీ.. కానీ, తమబంధం ఎక్కువ రోజులు నిలవలేదని చెప్పుకొచ్చారు. జీవితంలో బంధం అనేది ఉండాలని, కానీ ఒత్తిడితో కూడిన బంధాన్ని కోరుకోవడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసిందీ బ్యూటీ. జీవితానికి కచ్చితంగా ఒకతోడు అవసరం అని భావించడం లేదని చెప్పుకొచ్చిందీ చిన్నది. తాను ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేనని తెలిపింది.

ఇక మంచి జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాన బ్యూటీ.. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయని చెప్పుకొచ్చింది. ఇక కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. మలయాళీ చిత్రపరిశ్రమలోనూ తనకు మంచి గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న బ్యూటీ.. తాను పోషించిన ఎన్నో పాత్రలకు అగ్ర నటీనటుల నుంచి ప్రశంసలు వచ్చాయని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News