Dating App: సినీనటి గీతాంజలి ఫిర్యాదుపై కొనసాగుతోన్న దర్యాప్తు
Dating App: సినీనటి గీతాంజలి ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోంది.
Dating App: సినీనటి గీతాంజలి ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోంది. తన ఫోటోను డేటింగ్ యాప్‌లో పెట్టారంటూ నిన్న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు గీతాంజలి. తన ఫోటో యాప్‌లో పెట్టడంతో పాటు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు గీతాంజలి మీడియాతో మాట్లాడుతూ.. 'సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో నా ఫోటో పెట్టినట్లు తెలిసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సెలబ్రిటీల ఫోటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. మరో అమ్మాయికి ఇలాంటి ఘటన జరగకూడదు' అని పేర్కొంది.