దాదాపుగా 25 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు అర్చన!

విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు అలనాటి తార అర్చన.. నిరీక్షణ, లేడీస్‌ టైలర్‌, మట్టి మనుషులు, భారత్ బంద్ మొదలుగు చిత్రాలలో ఆమె నటించారు.

Update: 2020-11-14 14:59 GMT

విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు అలనాటి తార అర్చన.. నిరీక్షణ, లేడీస్‌ టైలర్‌, మట్టి మనుషులు, భారత్ బంద్ మొదలుగు చిత్రాలలో ఆమె నటించారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాల్, ఇంగ్లిష్ భాషల్లో కూడా నటించారు ఆర్చన.. ఆమె నటనకి గాను వరుసగా రెండుసార్లు(1989 లో, 1988 లో) జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటికి ఆ రికార్డు ఆమె పేరు పైనే ఉండడం విశేషం.

అయితే చాలా కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న అర్చన దాదాపుగా పాతికేళ్ల తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోకి తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు అర్చన.. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గ్లామర్ చిత్రాల్లో నటిస్తున్నసమయంలో నీరిక్షణ లాంటి సినిమాని చేయడం ఓ సాహసమేనని అన్నారు అర్చన.. ఇక తన కలర్‌ గురించి, సినిమా పరిశ్రమలోని కొందరు తనని రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చారు.

ఇటీవల కాలంలో రిలీజైన మహానటి, జనతా గ్యారేజ్ సినిమాలు తనకి బాగా ఆకట్టుకున్నాయని అన్నారు.. అంతేకాకుండా తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు అర్చన.. తానూ పాతికేళ్ల తర్వాత ఓ సినిమాలో నటిస్తున్నట్టుగా వెల్లడించారు. అయితే అలాంటి కథ ఇప్పటివరకూ ఏ భాషలో కూడా రాలేదని చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా ఏంటి అనే విషయాన్నీ మాత్రం చెప్పలేదు. 

Tags:    

Similar News