Ananya Nagalla: 'కమిట్మెంట్ బట్టే రెమ్యునరేషన్ ఉంటుందా'.? అనన్య షాకింగ్ ఆన్సర్..
Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్.. ఈ అంశం సినిమా ఇండస్ట్రీని ఎంతలా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్.. ఈ అంశం సినిమా ఇండస్ట్రీని ఎంతలా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో అవకాశాలు రావాలంటే హీరోయిన్లు దర్శక, నిర్మాతలతో కాంప్రమైజ్ అవ్వాలనే ఓ వాదన బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు ఇలాంటి కల్చర్ ఉందని తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. కొందరు హీరోయిన్లు బహిరంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా అందాల తార అనన్య నాగళ్లకు కూడా ఇలాంటి ఓ ప్రశ్నే ఎదురైంది. ప్రస్తుతం పొట్టేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది అనన్య. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్ అడుగుతారని టాక్ ఉంది కదా మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా'?అని ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానం చెప్పింది.
ఈ సమస్య వేరే రంగాల్లో ఉన్న కూడా ఉంటుంది కానీ సినిమా వాళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అనన్య ప్రశ్నించింది. ఇక సినిమా ఛాన్స్ ఇచ్చే ముందే హీరోయిన్స్‌ని కమిట్మెంట్ అడుగుతారంటా కదా అంటూ సదరు విలేకరీ అడిగిన ప్రశ్నకు అనన్య కాసింత అసహనానికి గురైంది. మీరు తెలుసుకోకుండా వందశాతం ఉంటుందని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించింది. అవకాశం రావడం కంటే ముందే కమిట్మెంట్ అనేది టాలీవుడ్లో లేదు. ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్ అనేది సమానంగా ఉంటాయి. మీరు ఎక్స్ పీరియన్స్ చేయకుండా ఎలా అడుగుతున్నారు? నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవు’ అని తేల్చి చెప్పేసింది.
ఇక అక్కడితో అగని ఆ యాంకర్.. ‘‘కమిట్మెంట్ను బట్టే పారితోషికం ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది’’ అని అడగ్గా.. ‘మీరు విన్న మాటలు చెబుతున్నారు. కానీ, నేను ఆ ఫీల్డ్‌లోనే ఉన్నా. మీరు అనుకున్నది ఇక్కడ లేదు’’ అని తేల్చి చేప్పేసింది. దీంతో అనన్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనన్య కెరీర్ విషయానికొస్తే వకీల్‌సాబ్, మల్లేశం వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ప్రస్తుతం పొట్టేల్ సినిమాలో నటిస్తోంది.