Suman: సుమన్ మరణించారంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ ఛానల్స్ పై హీరో ఆగ్రహం..
Hero Suman: సీనియర్ హీరో సుమన్ ఆరోగ్యం బాగాలేదని, ఆయన మరణించారని వార్తలు సోషల్‌మీడియాలో షికారు చేస్తున్నాయి.
Hero Suman: సీనియర్ హీరో సుమన్ ఆరోగ్యం బాగాలేదని, ఆయన మరణించారని వార్తలు సోషల్‌మీడియాలో షికారు చేస్తున్నాయి. తాజాగా దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు సుమన్. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్లో భాగంగా బెంగుళూరులో ఉన్న సుమన్ తన సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకుని ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్ని అవాస్తవమని.. అలాంటి రూమర్స్ ప్రసారం చేస్తున్న సదరు యూట్యూబ్ ఛానల్స్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తన గురించి నిరాధరమైన వార్తలు ప్రసారం చేసినందకు ఆ యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు సుమన్ తెలిపారు.