Actor Sudeep adopts government schools in Karnataka: హాట్సాఫ్ సుదీప్ ...నాలుగు స్కూళ్లను దత్తత తీసుకున్నాడు!

Actor Sudeep adopts government schools in Karnataka: ఒకపక్కా సినిమాలు చేసుకుంటూనే మరోపక్కా సామాజిక సేవల్లో పాల్గొంటున్నారు కొందరు హీరోలు..ఇక కరోనా సమయంలో అయితే సినీ కార్మికుల కోసం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసింది.

Update: 2020-07-15 08:40 GMT
sudeep

 Actor Sudeep adopts government schools in Karnataka: ఒకపక్కా సినిమాలు చేసుకుంటూనే మరోపక్కా సామాజిక సేవల్లో పాల్గొంటున్నారు కొందరు హీరోలు..ఇక కరోనా సమయంలో అయితే సినీ కార్మికుల కోసం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి, సహాయనిధిలకి కోట్లు, లక్షల్లో విరాళాలు అందించారు. కొందరు సెలబ్రిటీలు అయితే గ్రామాల్ని సైతం దత్తత తీసుకొని అక్కడ కావాల్సిన వాటిని ఏర్పాటు చేస్తున్నారు..అందులో భాగంగానే కన్నడ హీరో కిచ్చా సుదీప్ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాల్లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 4 ప్రభుత్వ పాఠశాలలను సుదీప్ దత్తత తీసుకున్నాడు..

ఆ ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా, స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతో పాటుగా వారికి డిజిటల్ క్లాస్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాలంటీర్స్ టీంతో కలిసి ప్లాన్ చేశాడు సుదీప్.. దత్తత తీసుకున్న స్కూళ్లున్న ప్రాంతాలు, అక్కడున్న వసతులు, ఇతర అంశాలను స్టడీ చేసేందుకు ఇప్పటికే వాలంటీర్లను ఆయా ప్రాంతాలకు పంపిచాడు సుదీప్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనిలో ఉన్నాడు సుదీప్.. ఇప్పటికే సినిమాల ద్వారా సూపర్ హీరో అనిపించుకున్న సుదీప్.. ఇప్పుడు ఇలా సామాజిక సేవలు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు..

కన్నడ భాషలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుదీప్ .. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ సైరా సినిమాలో నటించి మెప్పించాడు.. ఈ సినిమా తర్వాత సుదీప్ ఫాంటోమ్‌, కిట్టీ-కోటిగొబ్బ 3, బిల్లా రంగా భాషా, థగ్స్ ఆఫ్ మాల్గుడి చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

Tags:    

Similar News