ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. శర్వానంద్‌కి కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

Sharwanand Engagement: టాలీవుడ్ నటుడు శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడవుతున్నాడు.

Update: 2023-01-26 08:08 GMT

ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. శర్వానంద్‌కి కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

Sharwanand Engagement: టాలీవుడ్ నటుడు శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడవుతున్నాడు. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో త్వరలోనే మూడు ముళ్లు వేయనున్నారు. తాజాగా ఈయన నిశ్చితార్ధం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఇక శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫోటో బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా అని ఆరాతీయగా..రక్షితా రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం.

Tags:    

Similar News