పవన్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు!

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తూ పోటి నుంచి తప్పుకుంటున్నట్లుగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ నిర్ణయం పైన తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2020-11-27 12:11 GMT

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తూ పోటి నుంచి తప్పుకుంటున్నట్లుగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ నిర్ణయం పైన తీవ్ర విమర్శలు చేశారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ నిర్ణయం నన్న తీవ్రంగా నిరాశపరిచింది. మీరు ఓ లీడర్, ఇంకో పార్టీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు. 2014లో NDAతో పొత్తు పెట్టుకొని మోడీని పొగిడాడు. ఇక 2019లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని మోడీని తిట్టారు. ఇప్పుడు బీజేపీకి మద్దతిస్తూ పోటి నుంచి తప్పుకున్నారు. అభిమానులకి, కార్యకర్తలకి బీజేపీకి ఓటెయ్యాలని చెబితే ఇక జనసేన ఎందుకని ప్రశ్నించారు. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనాని రాజకీయాల పైన ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ విష‌యం చెప్తున్నందుకు తనని క్ష‌మించండి అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు.

Tags:    

Similar News