Nagababu On Akkineni Amala : అక్కినేని అమల అంటే నాకు అందుకే గౌరవం : నాగబాబు
Nagababu On Akkineni Amala : తాజా పరిస్థితులపైన తన యౌట్యుబ్ ఛానల్ లో ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు సినీ నటుడు నాగబాబు.. తాజాగా
Nagababu On Akkineni Amala : తాజా పరిస్థితులపైన తన యౌట్యుబ్ ఛానల్ లో ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు సినీ నటుడు నాగబాబు.. తాజాగా అక్కినేని అమల పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియస్తూ ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను నాగబాబు వెల్లడించారు. ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. " అక్కినేని అమల గారు అంటే చాలా గౌరవం.. ఎందుకంటే... ఈ ప్రపంచంలో మనుషుల కోసం మనుషులు పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు.. కానీ నోరు లేని మూగజీవులు కోసం అవి పడే వ్యధ కోసం పనిచేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.. ఆ తక్కువ మందిలో అక్కినేని అమల గారు ఒకరు..
నోరు లేని మూగజీవులు కోసం ఆమె ఎంతో సేవ చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. బ్లూ క్రాస్ అనే సంస్థని పెట్టి చాలా మూగజీవులకి సేవ చేశారు. వాటి బాగోగులు చూసి వాటికి ఓ తల్లిలాగా చూసుకుంటున్నారు.. అందుకే ఆ విషయంలో అమల గారు అంటే నాకు చాలా గౌరవం.. " అని అన్నారు నాగబాబు.. ఇక ఇలాగే మరెన్ని మంచి పనులు చేస్తూ మరిన్ని మూగజీవులకు సేవ చేయాలనీ కోరుకుంటున్నట్టు ఆమె మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నాగబాబు.. ఇక ఇదే వీడియోలో ఓ పాము రోడ్డు పైకి వస్తే తానూ దానిని ఎవరు కొట్టకుండా చూసుకుకొని అక్కినేని అమల గారికి ఫోన్ చేసి బ్లూ క్రాస్ సంస్థకి దానిని అప్పగించినట్టుగా నాగబాబు వెల్లడించారు.
ఇక అమల విషయానికి వచ్చేసరికి చినబాబు, శివ, ప్రేమ యుద్ధం, రాజా విక్రమార్క మొదలగు చిత్రాలలో నటించారు. ఇక హీరో నాగార్జునతో ప్రేమలో 1993లో వివాహం చేసుకున్నారు. వీరికి 1994లో అఖిల్ జన్మించాడు.