Wayanad Landslide: మోహన్ లాల్ నిజంగానే రియల్ హీరో.. ఏం చేశారో తెలిస్తే మీరూ ఇదే అంటారు..!
Wayanad Landslide: హీరో అంటే సినిమాల్లో కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తారు.
Wayanad Landslide: హీరో అంటే సినిమాల్లో కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తారు. అలాంటిది నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్నారు కేరళ నటుడు మోహన్‌లాల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మోహన్‌లాల్‌పై ఇలాంటి ప్రశసంలే కురుస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏం చేశారనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఇలటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వయనాడ్‌లో వరద బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రకృతి వైపరీత్యాన్ని కొండ చెరియలు విరిగిపడ్డాయి, ఇళ్లు, చెట్లు నేల మట్టాయి. వేలాది మంది సర్వస్వం కోల్పోయారు. దీంతో వీరిని అండగా నిలిచేందుకు ఆర్మీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్మీతో కలిసి రెస్యూ ఆపరేషన్‌లో భాగమయ్యారు హీరో మోహన్‌లాల్. స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఇప్పటికే సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం అందించిన మోహన్‌లాల్, తాజాగా స్వయంగా రంగంలోకి దిగారు. కోజికోడ్ నుంచి రోడ్డుమార్గంలో వయనాడ్‌కి వచ్చిన మోహన్‌లాల్… ఆర్మీ బేస్ క్యాంప్‌లో సైనికులను కలిశారు. ఆ తర్వాత ఆర్మీతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాత్కాలిక బ్రిడ్జ్‌ల నిర్మాణం, బాధితులకు సహాయం చేయడంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ.. దేశంలో జరిగిన ఘోర విపత్తుల్లో వయనాడ్ విధ్వంసం ఒకటన్నారు. సంఘటన స్థలానికి వచ్చి చూస్తే ఏ స్థాయిలో నష్టం జరిగిందో అర్ధమైందన్నారు.
మోహన్ లాల్ స్వయంగా రంగంలోకి దిగి వరదా బాధితులకు అండగా నిలవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగానే మోహన్ లాల్ రియల్ హీరో అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.