Jr NTR: నేనూ నా పిల్లల విషయంలో అలాగే ఉంటా.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Jr NTR: ట్రిపులార్ తర్వాత 'దేవర' సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
Jr NTR: ట్రిపులార్ తర్వాత 'దేవర' సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రికార్డు కలెక్షన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహకందని విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా సుమారు రూ. 182 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కూడా దేవర కలెక్షన్లన్స్ క్రమంగా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం బరిలో మరో పెద్ద సినిమా లేకపోవడం, దసరా సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో దేవర కలెక్షన్లు మరింత కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సక్సెస్‌ను ఎన్టీఆర్ ఎంజాయి చేస్తున్నారు. అమెరికా లాస్ ఎంజెల్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తన చిన్నారుల భవిష్యత్తు గురించి తొలిసారి ఆయన స్పందించారు. తన అభిప్రాయాలు పిల్లలపై రుద్దనని తెలిపారు. అలా చేయడం కరెక్ట్ కూడా కాదన్న ఎన్టీఆర్.. ఇప్పుడున్న రోజుల్లో ఎవరి ఆలోచనలు వారికుంటున్నాయని, వాళ్ల కెరీర్ గురించి వాళ్లు ఆలోచించుకునే వాతావరణాన్ని మనం కల్పించాలని చెప్పుకొచ్చారు. అంతేకానీ.. ఇది చెయ్.. అది చెయ్.. అంటూ వాళ్ల ఆలోచనలకు అడ్డు చెప్పకూడదంటూ ఎన్టీఆర్ తెలిపారు.
ఎన్టీఆర్ ఇంకా మాట్లాడుతూ.. 'అభయ్, భార్గవ్ ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. వయసు పరంగా వాళ్లు చాలా చిన్నపిల్లలు. ప్రస్తుతం చదువుకుంటున్నారు. భవిష్యత్‌లో కూడా వాళ్లను ‘సినిమాల్లోకి రండి.. యాక్టింగ్ నేర్చుకోండి..’ అని బలవంతపెట్టను. నాకు ప్రేరణ నా తల్లిదండ్రులే. వాళ్లెప్పుడు నన్ను ఆ విధంగా ట్రీట్ చేయలేదు. ‘వాడేదో సాధించాలనుకుంటున్నాడు.. చేయనీ..’ అని మానాన నన్ను వదిలేశారు. నేనూ నా పిల్లల విషయంలో అలాగే ఉంటా. అయితే.. నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసు. నన్ను వాళ్లు నటుడిగా చూస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ల నాన్నలాగే వాళ్లూ హీరోలం కావాలని కోరుకుంటారు. అది ఎలాగూ జరుగుతుంది.’ అంటూ మనసులో మాట బయట పట్టేశారు ఎన్టీఆర్.