Abhishek Bachchan: అభిషేక్ నిజంగానే ఆమెతో డేటింగ్‌లో ఉన్నాడా.. ఇంతకీ ఎవరీ నిమ్రత్ కౌర్?
Abhishek Bachchan Divorce News Buzz: అభిషేక్ బచ్చన్ నటి నిమ్రత్ కౌర్‌తో డేటింగ్‌లో ఉన్నాడని.. ఈ కారణంగానే ఈ జంట విడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
Abhishek Bachchan Divorce News Buzz: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు, అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో అటు అభిషేక్, ఇటు ఐశ్వర్య వ్యవహరించిన తీరు కూడా ఈ వార్తలకు బలం చేకూర్చాయి.
అభిషేక్ బచ్చన్ నటి నిమ్రత్ కౌర్‌తో డేటింగ్‌లో ఉన్నాడని.. ఈ కారణంగానే ఈ జంట విడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరీ నిమ్రత్ కౌర్ అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఆమె ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటీ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
42 ఏళ్ల నిమ్రత్ కౌర్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన నిమ్రత్ ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం సినిమాలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నిమ్రత్ 2006లో వచ్చిన వన్ నైట్ విత్ ది కింగ్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆమెకు గుర్తింపును ఇవ్వలేకపోయింది. అయితే 2012లో విడుదలైన ‘పెడ్లర్స్’ సినిమా ఈ నటికి పాపులారిటీని తెచ్చిపెట్టింది.
ఇక అభిషేక్‌తో కలిసి ‘దస్‌వి’ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహం మొదలైందనే చర్చ నడుస్తోంది. కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, పలు హాలీవుడ్ సినిమాల్లోనూ నిమ్రత్ నటించారు. ఇదిలా ఉంటే అభిషేక్ బచ్చన్ కంటే ముందు, నిమ్రత్ భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రితో ప్రేమయానంలో ఉందని పుకార్లు వచ్చాయి. అయితే దీనిపై వీరిద్దరిలో ఎవరూ స్పందించలేదు.