Aadi: ఉగాదికి మొదలుకానున్న ఆది మూవీ

Aadi: 'ప్రేమ కావాలి' సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్.

Update: 2021-03-22 16:02 GMT

ఆది న్యూ మూవీ (ఫొటో ట్విట్టర్)

Aadi: 'ప్రేమ కావాలి' సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కసిగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. జయాపజయాల తావులేకుండా వెరైటీ కథలతో రాణి్స్తున్నాడు. ఇటీవలే 'శశి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ యంగ్ హీరో తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొంటూ షూటింగ్ తాలూకు వివరాలు ప్రకటించారు మేకర్స్.

భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న కొత్త సినిమాలో హీరోగా ఆది నటించబోతున్నాడు. ఈ సినిమాకి దర్శకత్వంతోపాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఆయనే అందిస్తుండటం విశేషం. ఇందులో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్, స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నారని మేకర్స్ అంటున్నారు. శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తున్నాడు. గుడివాడ యుగంధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాకేత్ కొమండూరి సంగీతం అందిస్తున్నాడు.

ఈ ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 13వ తేదీన సినిమా షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే సినిమా పూర్తి వివరాలతో పాటు ఆదితో రోమాన్స్ చేసే హీరోయిన్ ఎవరనేది వెల్లడిస్తామని చిత్రయూనిట్ పేర్కొంది.

Tags:    

Similar News