Cinema Industry: కొడుకు కోసం సినిమా కథలు దొంగతనం చేస్తున్న తండ్రి
*యువ రైటర్ల కథలు దొంగతనం చేస్తున్న ఇండస్ట్రీ వ్యక్తి
Cinema Industry: ఇండస్ట్రీలో కొంచెం గ్రౌండ్ ఉన్న ఒక వ్యక్తి తన కొడుకుని ఈమధ్యనే సినిమాల్లోకి లాంచ్ చేశారు. ఈ మధ్యనే హీరోగా మారి మంచి హిట్టు కూడా అందుకున్నాడు ఈ యువ హీరో. అయితే కొడుకు కెరీర్ విషయంలో అతి జాగ్రత్త ఎక్కువగా ఉన్న ఈ తండ్రి తన కొడుకు కోసం వచ్చే ప్రతి కథని ముందు తానే వింటారట.
పెద్ద డైరెక్టర్లు ఇలా ముందు తండ్రికి కథ వినిపించడానికి ముందుకు రాకపోయినప్పటికీ యువ రైటర్లు, డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్లు మాత్రం ముందుగా ఈయన వద్దకు వచ్చిన కథలు చెప్పటం మొదలు పెట్టారట. కానీ ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది.
ఆ తండ్రి వీళ్ళు చెప్పే కథలని స్క్రిప్ట్ గా మార్చి వేరే డైరెక్టర్లను పెట్టి సినిమాలు తీస్తున్నారు. దాదాపు అన్ని సినిమాలకి ఎవరో ఒకరు వచ్చి ఇది నా కథ అని మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యువ రైటర్లు మరియు డైరెక్టర్లు ఇప్పుడు ఈ తండ్రి వద్దకు రావడానికి కూడా భయపడుతున్నారట.
పెద్ద కొడుకు విషయంలో అలా జరగనప్పటికీ ఈ తండ్రి చిన్న కొడుకు విషయంలో మాత్రం ఇలాంటి పుకార్లు చాలాసార్లు వినిపించాయి. కథని దొంగతనం చేసే బదులు కథ చెప్పిన వారిని డైరెక్టర్లుగా మార్చి సినిమా తీస్తే బాగుంటుంది కదా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.