Lady Killer: రూ. 45 కోట్లు పెడితే.. వచ్చింది జస్ట్ 60 వేలు.. ఓటీటీలన్నీ రిజెక్ట్ చేశాయి

Lady Killer: రూ. 45కోట్లు ఖర్చు పెట్టి భారీ ఎత్తున నిర్మిస్తే..కనీసం రూ. 60వేలు కూడా వెనక్కి రాబట్టలేకపోయిన ది లేడీ కిల్లర్ మూవీ..బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలన్నీ రిజక్ట్ చేస్తే.. యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యింది. అయినా ఆదరణ దక్కకపోవడం గమనార్హం.

Update: 2024-10-28 02:47 GMT

Lady Killer: ఒక సినిమా నిర్మించాలంటే మామూలు విషయం కాదు. భారీ బడ్జెట్ అవసరం. అందులోనూ టాప్ హీరోలతో సినిమాలంటే..మినిమం ఉండాల్సిందే. భారీ మొత్తంలో ఖర్చు పెట్టి సినిమా నిర్మిస్తే..ఆ స్థాయిలో కలెక్షన్లు రాబడితేనే మంచి గుర్తింపు ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాలు ఎన్నో అంచనా మధ్య రిలీజై బోల్తా కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

సినిమాకు తొలి షో తర్వాత ప్లాట్ టాక్ వచ్చిందంటే.. ఆ థియేట్ వైపు ప్రేక్షకుడు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఉంటుంది. అందుకు పెద్ద స్టార్.. చిన్న స్టార్ అనే తేడా ఉండదు. బొమ్మ పడిన తర్వాత హిట్ టాక్ వచ్చిందంటే జనాలు థియేటర్ ముందు క్యూ కడతారు. లేదంటే ప్లాప్ సినిమానే కదా ఓటీటీలో రాకపోతుందా..అప్పుడు చూద్దాంలే అంటూ లైట్ తీసుకుంటారు.

తాజాగా ఈమధ్యే బాలీవుడ్ హాట్ ఆటమ్ బాంబ్ మలైకా అరోరా బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ నటించిన లేడీ కిల్లర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను 45కోట్లు పెట్టి నిర్మించారు. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఎంతో తెలుస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అక్షరాలా 60వేలు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి ఆటతోనే ప్లాట్ టాక్ సంపాదించుకుంది. దీంతో జనాలు థియేటర్ కి వెళ్లలేదు.

అంతేకాదు ఈ మూవీని కొనుగోలు చేసేందుకు ఏ ఓటీటీ కూడా ముందుకురాలేదు. దీంతో డైరెక్టుగా యూట్యూబ్ లోనే రిలీజ్ చేశారు. ఈ మూవీని యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి తీసుకువచ్చినా ఆదరణ మాత్రం లభించలేదు. ఫలితంగా నెటిజన్ల నుంచి దారుణమైన కామెంట్స్ వచ్చాయి. ఒక నెలలో 2.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. తీస్తే ఇలాంటి సినిమాల జాబితా చాలా ఉంది. అసలు లెక్కలు తీస్తే బాక్సాఫీస్ లెక్కల్లో బొక్కలు చాలానే బయటపడతాయి. ఈ మధ్యే ఓ తెలుగు సినిమా విడుదలయ్యింది. ఆ మూవీ బడ్జెట్ 5కోట్లు. కానీ కలెక్షన్స్ ఏమాత్రం రాలేదని ఓపెన్ గానే చెప్పారు సదరు నిర్మాతలు.


Tags:    

Similar News