'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' రివ్యూ

బుల్లితెర యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతూ.. తెరక్కెక్కిన మూవీ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’.

Update: 2021-01-29 10:30 GMT

బుల్లితెర యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతూ.. తెరక్కెక్కిన మూవీ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత పరిణామాలు కారణంగా ఈ సినిమా దాదాపు ఏడాది పాటు వాయిదా పడింది. కాగా.. ఈ మూవీ జనవరి 29 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌, చిత్రంలోని పాటలకు అదిరిపోయే రెస్ఫాన్స్ వచ్చింది. నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్.. వెండి తెరపై హీరోగా ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.

కథ

వైజాగ్‌లో ఓ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదివే అల్లరి స్టూడెంట్‌ అర్జున్‌(ప్రదీప్‌ మాచిరాజు). చదువంటే అసలు ఇష్టం ఉండదు కానీ బాక్సింగ్‌ అంటే ప్రాణం. అదే కాలేజీలో కొత్తగా జాయిన్‌ అయిన విద్యార్థిని అక్షర(అమృతా అయ్యర్‌). అమృతకి, అర్జున్‌కి ఒకరంటే ఒకరికి అసలు నచ్చరు. అనుకోకుండా వీరిద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ వీరిద్దరికి ఓ పెద్ద సమస్య ఎదురువుతోంది. ఆ సమస్యకు పరిష్కారమేంటో స్వామిజీ(శుభలేక సుధాకర్‌) చెప్తాడు. దీంతో వీరిద్దరు ఇష్టంలేకున్నా 30 రోజుల్లో ప్రేమించుకోవాల్సి వస్తోంది. అసలు వీరిద్దరికి ఎదురైన సమస్య ఏంటి? అసలు వీరి జీవితాలకు, స్వామిజికి సంబంధం ఏంటి? అనేదే అసలు కథ.

ఎవరెలా చేశారంటే

బుల్లితెరపై యాంకర్‌గా ప్రదీప్ అదరగొడతాడనే దాంట్లో సందేహం లేదు‌. కామెడీ పంచ్‌లతో, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో ఎన్నో షోలను సక్స్ స్ చేశాడు. సినిమాలోనూ కూడా అదే కామెడీతో నవ్వించాడు‌. అర్జున్‌ అను అల్లరి విద్యార్థి పాత్రలో జీవించేశాడు. ప్రదీప్ కీ హీరోగా తొలి సినిమాయే అయినా.. గతంలో పలు సినిమాల్లో చేసిన అనుభవం ఉంది. ఈ మూవీలో నటిచాడు కాదు జీవించాడు. ఈ సినిమాలో తనదైనశైలీలో నవ్విస్తూనే.. అవసరం ఉన్న చోట ఎమోషనల్‌ సీన్లను కూడా అవలీలగా చేసేశాడు. హీరోయిన్ అమృత అక్షర అనే యువతి పాత్రలో జీవించేసింది. లవ్ సీన్స్ తోపాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రతీ సీన్‌లో ప్రదీప్‌తో సరిసమానంగా నటించింది. ఇక పోసాని కృష్ణమురళి, హేమల అద్భుతంగా నటిచారు. వైవా హర్ష తనదైన మార్క్ కామెడీతో అందరిని అలరించాడు. హైపర్‌ ఆది, మహేశ్‌, సుశులేఖ సుధాకర్‌ తమ పాత్రలపరిధి మేర నటించారు.

దర్శకుడు మున్నా పునర్జన్మల కథ ఎంచుకోని మంచి ప్రయత్నమే చేశాడు. కానీ, ఆ కథని వెండితెరపై చూపించడంతో తడబడ్డాడు. ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకునే విధండా ఉండవు. సిరియస్‌ కథ అయినా.. కామెడీతో నడిపించేప్రయత్నం చేసి కాస్త విఫలమయ్యాడు. ప్రథమార్థం ఒక్క ఇంటర్వెల్ సన్నీవేశం మినహా ఇతర సీన్స్ అంతగా ఆకట్టుకోవు. ద్వీతీయార్థంలో భావోద్వేగాలతో నడపాలని భావించినట్లు ఉన్నాడు. ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అవ్వరు. సాగదీత సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు ప్లాస్ పాయింట్. అనూప్ పాటలు చాల బాగున్నాయి. ముఖ్యంగా నీలి నీలి ఆకాశం పాట ఎంత గొప్పగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'  తెలుసుకోవాలంటే ఓపిక, సహనం చాలా అవసరం.


Tags:    

Similar News