Jani Master: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో 10 ముఖ్యాంశాలు
Jani Master: సెప్టెంబర్ 20న ఆయనను ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.
Jani Master: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలున్నాయి. తన వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ పై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 20న ఆయనను ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో 10 ముఖ్యాంశాలు
1. నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ డ్యాన్స్ లో శిక్షణ పొందారు. 2000 సంవత్సరంలో ఆయన హైద్రాబాద్ కు వచ్చారు. ఇక్కడే ఉంటూ ఏడేళ్లు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. 2009లో ఆయనకు కొరియోగ్రాఫర్ గా అవకాశం వచ్చింది.
2. తెలుగులో పలు టీవీ చానల్స్ డ్యాన్స్ షోలు నిర్వహించాయి. ఈ షోలకు జానీ మాస్టర్ జడ్జిగా వ్యవహరించారు. ఈ షోలో ఉత్తరాదికి చెందిన బాలిక పాల్గొంది. ఈ షో ను ఆమె మధ్యలోనే బయటకు వెళ్లింది. అయితే ఆ సమయంలోనే ఆమెతో జానీ మాస్టర్ కు పరిచయం ఏర్పడింది.
3. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇస్తామని బాధితురాలికి జానీ మాస్టర్ మేనేజర్ నుంచి 2019లో ఫోన్ వచ్చింది. దీంతో ఆమె అతని వద్ద అసిస్టెంట్ గా చేరింది.
4. ముంబైలో షూటింగ్ కోసం ఆమెతో పాటు మరో ఇద్దరు మేల్ కొరియోగ్రాఫర్లను కూడా తీసుకెళ్లారు. హోటల్ కు వెళ్లే ముందు ఆధార్ కార్డు, ఇతర పత్రాలు తీసుకున్నారు. వీటిని తిరిగి ఇచ్చేందుకు బాధితురాలి గదికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే అవకాశాలు దక్కవని బెదిరించారు. అంతేకాదు తన వద్ద అసిస్టెంట్ గా కూడా తీసేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
5. షూటింగ్ కోసం ఔట్ డోర్లకు వెళ్లిన సమయంలో హోటల్ గదుల్లో, వ్యానిటీ వాహనాల్లో ఆమెపై లైంగికదాడికి దిగారు.
6. లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో కొంతకాలం ఆమె ఇంటికే పరిమితమైంది.
7. కుటుంబ ఆర్ధిక పరిస్థితులతో తిరిగి షూటింగ్ లకు వెళ్లాల్సి వచ్చింది.
8. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె ఇల్లు మారింది. కొత్త ఇంటికి వెళ్లి ఆమెపై లైంగికదాడికి దిగారు.
9. ఈ వేధింపులు ఎక్కువకావడంతో ఆమె అతని టీమ్ నుంచి బయటకు వచ్చింది. స్వంతంగా కొరియోగ్రాఫర్ గా పనిచేస్తోంది. అయితే ఆమెకు అవకాశాలు రాకుండా జానీ మాస్టర్ అడ్డుకున్నారు.
10. ఈ విషయమై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు రాయదుర్గం పోలీసులు.