A1 Express Review: ఏ1 ఎక్స్‌ప్రెస్ మూవీ రివ్యూ

A1 Express Review: యువ హీరో సందీప్‌ కిష‌న్ 25వ చిత్రంగా వచ్చిన చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. తెలుగలో తొలి హీకీ సినిమా ఇది.

Update: 2021-03-05 11:45 GMT

ఏ1 ఎక్స్‌ప్రెస్ మూవీ

A1 Express Review: యువ హీరో సందీప్‌ కిష‌న్ 25వ చిత్రంగా వచ్చిన చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. టాలీవుడ్‌లో తొలి హీకీ సినిమా ఇది. పోస్టర్లు, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో..సినిమాపై హైప్ బాగానే క్రియోట్ అయింది. ఈ చిత్రం కోసం సందీప్ కిషన్ సిక్స్‌ప్యాక్ బాడీలో కనిపించేకు చాలానే కష్టపడ్డాడు. అలాగే హాకీలోనూ శిక్ష‌ణ తీసుకున్నాడు. మరి 'ఏ1 ఎక్స్‌ప్రెస్' దూసుకెళ్లిందా...ఆర్డినరిలా ఆగిపోయిందా..రివ్యూలో చూద్దాం..

క‌థ:

చిట్టిబాబు హాకీ గ్రౌండ్ యానాంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. స‌ముద్రం ప‌క్క‌నే ఉన్న ఆ గ్రౌండ్‌ ను ఓ విదేశీ కంపెనీ ఆక్రమించుకోవాలనుకుంటుంది. క్రీడాశాఖ మంత్రి అయిన రావు ర‌మేష్ (రావు ర‌మేష్‌) అండ‌తో దానిని సొంతం చేసుకునేందుకు ప్లాన్ చేస్తుంది. సందీప్‌నాయుడు అలియాస్ సంజు(సందీప్‌ కిషన్‌) త‌ను ఇష్టపడిన అమ్మాయి లావ‌ణ్య (లావ‌ణ్య త్రిపాఠి) కోసం త‌ర‌చూగా ఆ గ్రౌండ్‌కి వెళ్తుంటాడు. ఈ క్రమంలో హాకీ ఆడాల్సి వస్తుంది. లావణ్య కోసం హాకీ ఆడిన క్ర‌మంలో సందీప్ నాయుడు గురించి ఎలాంటి విష‌యాలు తెలిశాయి? చిట్టిబాబు గ్రౌండ్‌ని కాపాడ‌టం కోసం హీరో ఏం చేశాడు? అతని గ‌తం ఏమిటి? ఇవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

A1 Express Movie Review

ఎలా ఉంది:

సినిమాలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో ఏ1 ఎక్స్‌ప్రెస్ టీం సక్సెస్ అయ్యారు. అయితే, అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికే చాలా స‌మ‌యం తీసుకున్నాడు డైరెక్టర్. ప్ర‌థ‌మార్ధం అంతా హీరోహీరోయిన్ల మ‌ధ్య లవ్, ఫ్యామిలీ నేప‌థ్యంలోని కామెడీ స‌న్నివేశాల‌తోనే లాగించాడు.

హీరో హాకీ స్టిక్ ప‌ట్టుకున్నాకే అస‌లు మ్యాటర్ మొద‌ల‌వుతుంది. ఇంటర్వెల్‌కి ముందు సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. సెకాండాఫ్‌లో హీరో ఫ్లాష్ బ్యాక్, ఆట‌ల్లో రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగే సీన్స్ సినిమాకి చాలా కీలకం. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌ల‌తో చేపించిన సన్నివేశాలకే సినిమాకు చాలా ముఖ్యమైనవి కాబట్టి ద‌ర్శ‌కుడు మరింత బలంగా రాసుకోవాల్సింది. ఇక క్లైమాక్స్ ను కూడా ఆట నేప‌థ్యంలోనే ముగించాడు. సినిమాటిక్‌గా అనిపించినా బోర్ కొట్టించదు. కాకపోతే త‌మిళ సినిమా ఆధారంగా తీసిన సినిమా కాబట్టి.. స్టోరీ‌, స్ర్కీన్ ప్లే విష‌యంలో మ‌రింతగా కష్టపడాల్సింది. చాలా సీన్స్ ప్రేక్ష‌కుడి ఆలోచనలకు త‌గ్గ‌ట్టుగానే సాగుతుంటాయి.

ఎవ‌రెలా చేశారంటే:

సందీప్‌ కిష‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. సిక్స్‌ప్యాక్ బాడీతో స్లిమ్‌గా త‌యారై ఈ సినిమాలో కనిపించాడు. హాకీలోనూ శిక్ష‌ణ తీసుకున్నాడు కాబట్టి ఆటలోనూ తన దూకుడు చూపించాడు. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి సంద‌డి చేసేది కేవలం ఫస్టాప్‌లోనే. సెకాండాప్‌లో ఆమె పాత్ర‌ని పూర్తిగా ప‌క్క‌న‌ పెట్టేసిన‌ట్లు అనిపిస్తుంది. పొలిటికల్ లీడర్ గా రావు ర‌మేష్ ఎనర్జిటిక్ పాత్ర‌లో క‌నిపించారు. ఫస్టాప్‌లోనూ, సెకాండాప్‌లో లోక‌ల్ మీడియాకి వార్నింగ్ ఇవ్వ‌డం, క్లైమాక్స్ లో ఆయ‌న న‌ట‌న ప్రేక్ష‌కుల‌తో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తుంది.

ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కాసేపే క‌నిపించినా సినిమాకు వారు చాలా కీలకం. ముర‌ళీశ‌ర్మ‌, అభిజిత్‌, స‌త్య‌, పోసాని త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. మ్యూజిక్, కెమెరా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. డైరెక్టర్ డెన్నిస్‌కి ఇది మొదటి చిత్రం. ఫస్టాప్ లో వ‌చ్చే సీన్స్ పైనా, భావోద్వేగాల‌పైనా డైరెక్టర్ మ‌రింత‌గా దృష్టి పెట్టి ఉంటే సినిమా మరోలా ఉండేది. మొత్తానికి ఏ1 ఎక్స్‌ప్రెస్ ఆర్డినరి బండిలానే సాగింది.

Full View


Tags:    

Similar News