నిను వీడని నీడను నేనే : రివ్యూ ..

Update: 2019-07-12 10:40 GMT

సినిమా : నిను వీడని నీడను నేనే 

నటినటులు : సందీప్‌కిషన్, అనన్యాసింగ్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, పూర్ణిమా భాగ్యరాజ్ తదితరులు

ఛాయాగ్రహణం : పీకే వర్మ

సంగీతం: తమన్

నిర్మాతలు: సందీప్‌కిషన్, దయా పన్నెం, విజి సుబ్రహ్మణియన్

దర్శకత్వం: కార్తిక్‌రాజు

వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత హీరో సందీప్ కిషన్ కి ఆశించిన విజయాలు మాత్రం రాలేదు . దీనితో మొదటిసారిగా ఓ ద్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆయనే ఓ నిర్మాతగా వ్యవహరించి "నిను వీడని నీడను నేనే" అంటూ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . మరి ఈ సినిమాతో అయిన సందీప్ హిట్టు కొట్టాడో లేదో మన రివ్యూ లో చూద్దాం ..

కథ: -

అర్జున్( సందీప్ కిషన్ ) మరియు దివ్య ( అనన్యా సింగ్ ) ప్రేమించుకుంటారు . వారి ప్రేమకు పెద్దలు ఒకే చెప్పకపోవడంతో బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటారు . ఇలా గడుస్తున్న కొద్ది రోజులకు ఓ రాత్రి బయట పార్టీకి వెళ్లి వస్తు ఉండగా అనుకోకుండా ఆక్సిడెంట్ జరుగుతుంది .ఇందులో ఎవరికి ఏమి కాదు . కానీ ఇంటికి వచ్చాకా అద్దంలో వారి మొఖం చూసుకుంటే అందులో మరొకరు కనిపిస్తూ ఉంటారు . ఇంతకి అ ఇద్దరు ఎవరు ? వీరి లోకి ఎందుకు వచ్చారు అన్నది మిగలిన కథ ..

ఎలా ఉంది అంటే :-

ఇప్పటివరకు చాలా రకాల హర్రర్ సినిమాలో వచ్చాయి . కానీ ఇదోరకం హర్రర్ మూవీ .. ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది . కానీ దానిని తెరపైన చూపించడంలో మాత్రం కాస్తా తడపడ్డాడు అనే చెప్పాలి .. కానీ ట్విస్ట్ లతో సినిమాపై అక్కడక్కడ ఆసక్తిని రేకెత్తించాడు .. సినిమా మొదటి భాగాన్ని చాలా క్యురాసీటితో నడిపించి ఇంటర్వెల్ బ్లాంక్ లో ఓ ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తిని రేకెత్తించాడు . కానీ మొదటి భాగం ఉన్నంత ఫీలింగ్ ని మాత్రం రెండవ భాగంలో కొనసాగించలేకపోయాడు . రెండవ భాగం కూడా కొంచం స్లో నరేషన్ లో సాగడం మరో బలహీనతగా చెప్పుకోవచ్చు ..

నటినటులు : -

చాలా కాలం తర్వాత సందీప్ కిషన్ యాక్టింగ్ లో మేచురిటి కనిపించింది . కొంచం లావుగా ఈ సినిమాలో సందీప్ కనిపించాడు . సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా అతని నటనతో ఒకే అనిపించాడు .. ఇక హీరోయిన్ అనన్యా సింగ్ కి పెద్ద స్కోప్ ఉన్నా పాత్ర దక్కలేదు . ఇక వెన్నెల కిశోర్ తన నటనతో సినిమాకి బలం అయ్యాడు . పూర్ణిమ భాగ్యరాజ్ , పోసాని , మురళీశర్మ పాత్రల మేరకు బాగా రాణించారు ..

సాంకేతిక వర్గం : -

సినిమాలో సాంకేతిక వర్గం ముఖ్యపాత్రనే వహించిందనే చెప్పాలి. తమన్ తన మ్యూజిక్ మరియు నేపధ్య సంగీతంతో మెప్పించాడు .కొన్ని హర్రర్ సన్నివేశాల్లో బీజీఎం తో బయపెట్టాడనే చెప్పాలి . పీ.కే వర్మ సినిమాటోగ్రఫీ బాగుంది . ప్రతి ఫ్రేమ్ చాలా చక్కగా చూపించాడు . ఎడిటర్ ప్రవీణ్ తన కత్తెరకి ఇంకాస్తా పని చెప్తే బాగుండేది ..

బాటమ్ లైన్ :  అద్దం చెప్పే కథ .. 

Tags:    

Similar News