Devara Twitter Review: కొరటాల, ఎన్టీఆర్ కాంబో దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు? దేవర ట్విట్టర్ రివ్యూ..
Devara Twitter Review: దేవర సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేసిన దేవర సినిమా 6 ఏళ్ల తర్వాత సోలో సినిమాగా రిలీజ్ అయింది.
Devara Twitter Review: దేవర సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేసిన దేవర సినిమా 6 ఏళ్ల తర్వాత సోలో సినిమాగా రిలీజ్ అయింది. తొలిసారి తెలుగు సినీ పరిశ్రమలోకి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అడుగుపెట్టింది. కొరటాల శివ రూపొందించిన ఈ సినిమాపై అన్ని వర్గాల దృష్టి పడింది. ఎందుకంటే ఆచార్య డిజాస్టర్ తర్వాత దేవర రావడంతో.. నెటిజన్ల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రంపై ట్విట్టర్‌లో రివ్వూలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా రివ్యూ ఎలా ఉందో ఓసారి చూద్దాం..
వివాదాస్పద క్రిటిక్ ఉమేర్ సంధూ దేవర సినిమాపై తొలి ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్, జాన్వీ కపూర్ అందం, సైఫ్ ఖాన్ నెగిటివ్ రోల్స్‌పై కామెంట్ చేశారు.
ఈ సినిమాను లాస్ ఎంజెలెస్‌లోని ఈజిప్టియన్ థియేటర్‌లో సెప్టెంబర్ 26న సాయంత్రం 6.30 గంటలకు ప్రదర్శించారు. ఆ తర్వాత 27వతేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
ఇక నిర్మాత నాగవంశీ కూడా ఓ ట్వీట్ చేశారు. తారక్ అన్నా చాలా గ్యాప్ తర్వాత మంచి ఎమోషనల్ మాస్ కంటెంట్‌తో వచ్చాడు. భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాం. ఎలాంటి ఫ్యాన్ వార్ క్రియేట్ చేయవద్దు అంటూ మెసేజ్ ఇచ్చారు.
ఎన్టీర్ నట విశ్వరూపం..
'దేవర'లో ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ లేనివిధంగా తనలోని అసలైన నటనను చూపించాడనే టాక్ వస్తోంది. ఈ విశ్వరూపం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోందంట. ఎన్టీఆర్‌కు సరిసమానంగా విలన్ పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడనే టాక్ వస్తోంది. ఫైటింగ్ సన్నివేశాల్లో ఇద్దరూ బీభత్సం చేశారని అంటున్నారు. జాన్వీ కపూర్ అందానికి ఫిదా కాని వారు ఉండరని అంటున్నారు. ఆమె పాత్ర కొద్దిసేపే ఉందని చెబుతున్నారు.