చిత్రం: దేవ్
నటీనటులు: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్,రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రేణుక, విజ్ఞేష్ కాంత్, వంశీ కృష్ణ, అమృత శ్రీనివాసన్ తదితరులు
సంగీతం: హారీస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ: ఆర్. వెలరాజ్
ఎడిటింగ్: అంథోనీ ఎల్ రూబెన్
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్
దర్శకత్వం: రజత్ రవిశంకర్
బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
విడుదల: 14/02/2019
టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరోల లో కార్తీ ఒకడు. గత ఏడాది 'చిన్న బాబు' అనే సినిమాతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తి హిట్ అందుకోలేకపోయాడు. ఈసారి ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు కార్తీ. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రజత్ రవి శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఇవాళ అనగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఒకపక్క రకుల్ ప్రీత్ తెలుగులో హీరోయిన్ గా కనిపించి సంవత్సరం దాటింది. మరోవైపు కార్తీ కూడా 'దేవ్' సినిమాతో కచ్చితంగా తెలుగులో మంచి హిట్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా.
కథ:
దేవ్ (కార్తి) ఉక్రెయిన్ లో నివసించే ఒక భారతీయుడు. అతనికి ఫోటోగ్రఫీ అన్నా సాహసాలు అన్నా చాలా ఇష్టం. ఫేస్బుక్ లో మేఘన (రకుల్ ప్రీత్ సింగ్) ను చూసి వెంటనే ప్రేమలో పడతాడు. అయితే మేఘన దేవ్ కి చాలా భిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ బిజినెస్ పైన దృష్టి ఉంచి మేఘన అసలు ప్రేమ పెళ్లి గురించి ఆలోచించే టైమ్ లేకుండా బిజీగా గడుపుతూ ఉంటుంది. కానీ దేవి మాత్రం ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించని మేఘన దేవ్ తో ప్రేమలో పడిందా? అంత తలబిరుసు ఉండే మేఘన ను దేవ్ ఎలా మార్చాడు అనేది కథ. వీరిద్దరి కథ సుఖాంతమైందా లేదా అనేది సినిమా కథ.
నటీనటులు :
ఈ సినిమాకు కార్తీ నటన ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. తన అద్భుతమైన నటనతో కార్తీక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాడు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ వస్తున్న కార్తీ ఈ సినిమాలో కూడా తన అద్భుతమైన నటన ను ప్రదర్శించాడు. కార్తీ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారుతుంది. తన పాత్ర లో బోలెడు వేరియేషన్లు ఉన్నప్పటికీ రకుల్ ప్రీత్ సునాయాసంగా తన పాత్రను పండించింది. ఈ సినిమాలో అందంగా కనిపించడమే కాక తన నటనతో ఆకట్టుకుంది. రకుల్ , కార్తీ మధ్య కెమిస్ట్రీ బాగా పండటం సినిమాకు ప్లస్ అయ్యింది. ఎప్పటిలాగానే ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రమ్యకృష్ణ కూడా పాత్రలో ఒదిగిపోయి బాగా నటించారు. ప్రకాష్ రాజ్ మరియు రమ్య కృష్ణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపిస్తారు. వంశీకృష్ణ నటన పర్వాలేదనిపించింది. ఆర్ జె విగ్నేష్ కాంత్ మరియు అమృత మధ్య సీన్లు చాలా బాగా వచ్చాయి, కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తాయి. రేణుక కూడా తనకున్న స్కోప్ లో బాగానే నటించింది.
సాంకేతిక వర్గం:
ఈ కథకు స్టోరీ లైన్ వీక్ గా ఉండడం ఒక మైనస్ పాయింట్ గా మారింది. దర్శకుడు రవి శంకర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెర పైన బాగానే చూపించారు కానీ ఏదో వెలితి ఉన్న భావన కలుగుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగా వచ్చింది కానీ సెకండాఫ్ లో మాత్రం ఎక్కడా ఆ ఎనర్జీ కనబడదు. కథ ఇంకొంచెం సాలిడ్ గా ఉండి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. లోకేషన్ లు మరియు సినిమా పరంగా కానీ క్వాలిటీ విషయంలో నిర్మాతలు కాంప్రమైజ్ అవ్వలేదు అనే విషయం తెలుస్తోంది. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం బాగా సెట్ అయింది. పాటలు పెద్దగా బాగాలేకపోయినా నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగా వచ్చింది. హరీష్ జయరాజ్ సంగీతం వల్ల కొన్ని సీన్ ల లోని ఎమోషన్ బాగా ఎలివేట్ అయింది అంటే అతిశయోక్తి కాదు. ఆర్ వెలరాజ్ కెమెరా యాంగిల్స్ ఆకట్టుకుంటాయి. ఆంటోని రూబెన్ ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది.
బాలలు:
ఫస్ట్ హాఫ్
నటీనటులు
లోకేషన్లు
బలహీనతలు:
సెకండ్ హాఫ్
నెరేషన్
చివరి మాట:
ఈ చిత్రంలో పెద్ద పెద్దగా చెప్పుకోదగ్గ కథ ఏమీ లేదు కానీ స్నేహం మరియు ప్రేమ గురించి దర్శకుడు బాగా తెరకెక్కించాడు. మొదటి హాఫ్ మొత్తం ఎటువంటి ట్విస్ట్ లు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతుంది. కొన్ని హాస్య సన్నివేశాలతో మొదటి హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ డల్ గా ఉండడంవల్ల కొంత బోర్ అనిపించినప్పటికీ 'దేవ్' ని ఒక చూడదగ్గ సినిమా గా పరిగణించవచ్చు.
బాటమ్ లైన్:
'దేవ్' ఎదో పర్వాలేదు అనిపించాడు.