Ashwathama Twitter Review : నాగశౌర్య అశ్వథ్థామ గా అదరగొట్టేశాడట!

Update: 2020-01-31 02:39 GMT

నాగశౌర్య.. టాలీవుడ్ యువహీరోల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. నటుడిగా కెరీర్ ను మొదట నిదానంగా మొదలు పెట్టి.. హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేసి.. నిరూపించుకుని.. మెల్లగా స్టార్ ఇమేజ్ వైపు అడుగులు వేస్తున్నారు. 'ఛలో' సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగశౌర్య మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకోసంలవర్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్ సస్పెన్స్ కథతో ముందుకురావడానికి సిద్ధం అయిపోయారు.

ఈ క్రమంలో తానే కథారచయితగా మారి.. యూనిక్ సబ్జెక్ట్ తో 'అశ్వథ్థామ' గా ఈరోజు జనవరి 31న మన ముందుకు వస్తున్నారు. మేహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేశారు. యువ దర్శకుడు రమణ తేజ ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

అమ్మాయిల మీద జరుగుతున్నా అఘాయిత్యాలను అడ్డుకునే వాడిగా ట్రైలర్ లు , టీజర్ల లో ఇప్పటికే సినిమా పై అంచనాలు పెంచేశారు నాగశౌర్య. 'అశ్వథ్థామ' మూవీ ఇప్పటికే యుఎస్‌లో ప్రీమియర్ షోలు పడటంతో ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు నెటిజన్లు.

మాస్ లుక్ తో నాగశౌర్య ఆదరగోట్టేశారని నెటిజన్లు చెబుతున్నారు. ఇక అయన కెరీర్ లోనే ఈ సినిమా పెద్ద హిట్ అని ట్వీట్ లు చేస్తున్నారు. కమర్షియల్ గా సినిమా బాగా వచ్చిందంటూ కితాబు ఇస్తున్నారు. సినిమాలో సంగీతం.. నేపధ్య సంగీతం చాలా బావున్నాయంటూ సినిమా పై పాజిటివ్ టాక్ తో రివ్యూలు పెడుతున్నారు.

'ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు.. వేట కుక్కలాగా వెంటపడే జాలర్లు.. శకుని లాంటి ఒక ముసలోడు.. వీళ్లందర్నీ ఒకేస్టేజ్ మీద ఆడిస్తున్న ఆ సూత్రధారి ఎవరు'? అంటూ ట్రైలర్‌తో విలన్ ఎవరా? అన్న ఆసక్తి కలిగించిన దర్శకుడు ఈ చిత్రంలో విలన్ క్యారక్టరైజేషన్‌ బాగా ప్రజెంట్ చేశారని చెబుతున్నారు. జీబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అంటున్నారు. పోస్ట్ ఇంట్రవల్‌లో విలన్ ఇంట్రో ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా ఉందని చెబుతున్నారు. అయితే పాటలు.. క్లైమాక్స్ సినిమాకి కొంత వరకూ సరిగా రాలేదని రివ్యూ ఇస్తున్నారు. ఇక సినిమాలో అందరినీ ఆశ్చర్య పరిచేలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్‌తో సినిమా ప్రారంభం అవ్వడం థ్రిల్ ఇచ్చిందని పవన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

ఇంకొద్ది సేపట్లో మన దగ్గర కూడా సినిమా విడుదల అవుతుంది. తరువాత ఎలా ఉందొ ఎలానూ తెలిసిపోతుంది.. ఈలోపు యూఎస్ లో సినిమా చూసిన మనవారి రివ్యూలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి మరి! 







Tags:    

Similar News