Ante Sundaraniki Movie Review: 'అంటే..సుందరానికీ' మూవీ రివ్యూ.. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే?
Ante Sundaraniki Movie Review: ‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ.. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే?
Ante Sundaraniki Review:
చిత్రం: అంటే సుందరానికి
నటీనటులు: నాని, నజ్రియ నజిం, నరేష్, రోహిణి, నదియా, హర్ష వర్ధన్, అషగం పెరుమాళ్, నిక్కి తంబోలి, పృథ్వీ రాజ్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: రవి తేజ గిరిజాల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేది: 10/06/2022
ఈ మధ్యనే "శ్యామ్ సింగారాయి" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు "అంటే సుందరానికి" సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "బ్రోచేవారెవరురా" ఫేమ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం బ్యూటీ నజ్రియ నజిం హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులో నజ్రియా కి ఇదే మొదటి సినిమా. టీజర్ మరియు ట్రైలర్ల తోనే ఒక రేంజ్ లో ఆకట్టుకున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా జూన్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..
కథ:
సుందర్ (నాని) మరియు లీల (నజ్రియా) చిన్నప్పట్నుంచి చాలా మంచి స్నేహితులు. కాని వారిద్దరూ వేరు వేరు సాంప్రదాయాల మధ్య పెరిగారు. వారిద్దరి మతాలు కూడా వేరు. లీలా అంటే సుందర్ కి ఎప్పటినుంచో చాలా ఇష్టం ఉంది కానీ అది బయటికి చెప్పడానికి భయ పడుతూ ఉండేవాడు. ఇక కాలంతోపాటే వారి స్నేహం ప్రేమగా మారింది. కానీ వారు విభిన్న కులాలకు సంబంధించిన వారు కావడంతో వారి ప్రేమ విషయాన్ని వారి కుటుంబ సభ్యులతో చెప్పడానికి భయపడతారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు కుటుంబాలని కలపడానికి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటి? అది ఎంతవరకు వర్కవుట్ అయింది? చివరికి వీరిద్దరి కథ ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
నాని ఈ సినిమాకి వెన్నెముక గా చెప్పుకోవచ్చు. కామెడీ సన్నివేశాలతో పాటు నాని ఎమోషన్ సన్నివేశాలలో కూడా తన నటనతో ప్రేక్షకులను చాలా బాగా అలరించారు. తన పాత్రలో ఉన్న చిన్న చిన్న డీటైల్స్ ను కూడా వేరియేషన్స్ ను కూడా నాని చాలా బాగా చూపించారు. నజ్రియా నటన కూడా ఈ సినిమాకి చాలా బాగా ప్లస్సయింది. తన పాత్రకి నజ్రియా పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. నాని తో తన కెమిస్ట్రీ కూడా సినిమాకి బాగానే ప్లస్ అయింది. నరేష్ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. రోహిణి కూడా నాని తల్లి పాత్రలో బాగానే నటించారు. నదియా మరియు పెరుమాళ్ కూడా నజ్రియా తల్లిదండ్రుల లాగా బాగానే నటించారు. నిక్కి తంబోలి కూడా తన పాత్రలో బాగానే నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం:
రొమాంటిక్ కామెడీ సినిమాలు అంటేనే కథ కొత్తగా ఉండాలి లేదా స్క్రీన్ ప్లే లో అయినా కొత్తదనం ఉండాలి. కొన్ని చోట్ల కథ సింపుల్ గానే అనిపించినప్పటికీ వివేక్ ఆత్రేయ తన స్టైల్ ఆఫ్ నెరేషన్ తో కథను చాలా బాగా మలిచారు. తన ముందు సినిమాల లాగానే ఈ సినిమాను కూడా ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు వివేక్ ఆత్రేయ. ముఖ్యంగా చాలా పాత్రల విషయంలో డైరెక్టర్ డీటైలింగ్ బాగుంటుంది. సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. వివేక్ సాగర్ సంగీతం కూడా చాలా బాగుంది. మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణ విలువలు కూడా సినిమాకి బాగానే ప్లస్ అయ్యాయి.
బలాలు:
నటీనటులు
ఎంటర్టైన్మెంట్
కామెడీ సన్నివేశాలు
నేపథ్య సంగీతం
బలహీనతలు:
కొన్ని స్లో సన్నివేశాలు
సెకెండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉండటం
పాటలు
చివరి మాట:
సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల ఇంట్రడక్షన్, కథ ఎస్టాబ్లిష్ చేయడం, కామెడీ సన్నివేశాలతో అయిపోతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లోని లోని కొన్ని సన్నివేశాలు మాత్రం కొంచెం బోరింగ్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా నాని కుటుంబ సభ్యులతో వచ్చే సన్నివేశాలు కొంచెం విభిన్నంగా తీర్చిదిద్దారు. ఇంటర్వల్ సన్నివేశం సినిమాపై ఆసక్తి పెంచుతుంది. ఇక ఈ సినిమా ఇంటర్వల్ తర్వాత మళ్లీ బాగానే సాగతుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీట వేశారు చిత్ర డైరెక్టర్. క్లైమాక్స్ ను కూడా హడావిడిగా కాకుండా అన్ని పాత్రలకు ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు.
బాటమ్ లైన్:
"అంటే సుందరానికి" అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉంది.