Animal Movie Review: యానిమల్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Animal Movie Review: యానిమల్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
నటీనటులు: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, శక్తి కపూర్ తదితరులు
దర్శకుడు : సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని
సంగీతం: JAM8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, హర్షవర్ధన్ రామేశ్వర్, అషిమ్ కెమ్సన్
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
ఎడిటర్: సందీప్ రెడ్డి వంగ
రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్ లో సందీప్ రెడ్డి వంగ తీసిన మూవీ అనిమల్.. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలయ్యి థియేటర్ లలో సందడి చేస్తుంది.. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే అంచనాలను పెంచేయటం తో పాటు ఆడియన్స్ లో మరింత హైప్ క్రియేట్ చేసింది.. మరి అనిమల్ మూవీ ఇప్పుడు ఆ అంచనాలు అందుకుందా... లేదా...?
సందీప్ రెడ్డి వంగ అరుణ్ రెడ్డి , కబీర్ సింగ్ హిట్లతో ఇక్కడ టాలీవుడ్ అక్కడ బాలీవుడ్ లో ఫోకస్ అయ్యాడు.. ఇప్పుడు రన్బీర్ తో ఆ ఫోకస్ ని మరింత పెంచేందుకు అనిమల్ తో గేమ్ మొదలు పెట్టాడంటున్నారు... మరి ఈ గేమ్ లో సందీప్ విన్ అయ్యాడా...? లేదా ...?
అనిమల్ మూవీ కథ విషయానికి తండ్రి, కొడుకుల ఎమోషనల్ డ్రామానే ఆనిమల్ అంటున్నారు... రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్)కి తన తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) అంటే పిచ్చి ప్రేమ నే మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పాలి. ఇక టాప్ వన్ బిజినెస్ మెన్ అయిన బల్బీర్ సింగ్ భారతదేశంలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్వహిస్తుంటాడు. ఆ బిజీ లైఫ్ లో కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేక పోవటం తో తండ్రి కొడుకు మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరం కాస్త కొడుకుని బోర్డింగ్ స్కూల్‌కు పంపటం. ఆ తర్వాత రణ్ విజయ్ సింగ్, గీతాంజలి (రష్మిక)తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతాడు. ఆ తరువాత , బల్బీర్ పై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకుని, ఇండియాకి తిరిగి రావడం . అసలు బల్బీర్ సింగ్ ను చంపాలనుకుంది ఎవరు.. ? అలానే తన తండ్రి శత్రువులపై రణ్ విజయ్ సింగ్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ?, అందుకోసం విజయ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ?అసలు ఫైనల్ గా ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
ఇక రణబీర్ కపూర్ తన పాత్ర కు తగ్గట్టు డిఫెరెంట్ వేరియేషన్స్ లో పాతుకు పోయాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో రణబీర్ తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా బాగా నటించాడు అని చెప్పుకోవాలి .అలానే తండ్రి గా నటించిన అనిల్ కపూర్ నటన సూపర్ గా ఉందంటున్నారు . ఇక సెకండ్ హాఫ్ లో రివీల్ అయిన బాబీ డియోల్ పాత్ర కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యిందంటున్నారు.
ఇక హీరోయిన్ గా రష్మిక మందన్నా సూపర్ అని చెప్పుకోవాలి. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె సెటిల్డ్ గా నటించి మెప్పించింది, మరో హీరోయిన్ తృప్తి డిమ్రి గ్లామర్ సినిమాకి ప్లస్ అయ్యింది. అలానే చారు శంకర్, శక్తి కపూర్ మరియు బబ్లూ పృథ్వీ రాజ్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర మేరకు పర్లేదనిపించారు.
రణబీర్ తో సందీప్ తీసిన అనిమల్ మూవీ కథ కథనం బాగున్నా అక్కడక్కడ కొన్ని సీన్లు మరింత సాగదీతగా ఉన్నాయంటున్నారు.. అలానే మ్యూజిక్ , ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్ని పర్లేదంటున్నారు ఇక ఫైనల్ గా సందీప్ రెడ్డి వంగ చేసిన అనిమల్ థియేటర్లలోగర్జిస్తుందంటున్నారు.