800 Movie Review: 800 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

800 Movie Review: మధుర్ మిట్టల్ హీరోగా ఎం ఎస్ శ్రీపతి తెరకెక్కించిన మూవీ 800 ... శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆదారంగా వచ్చింది 800 మూవీ..

Update: 2023-10-06 08:18 GMT

800 Movie Review: 800 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

800 Movie Review: 

నటీనటులు: మధుర్ మిట్టల్

నాజర్

మహిమా నంబియార్ నరైన్ శరత్ లోహితస్వా మరియు ఇతరులు

దర్శకుడు : ఎం ఎస్ శ్రీపతి

నిర్మాత: వివేక్ రంగాచారి

సంగీతం: జిబ్రాన్

మధుర్ మిట్టల్ హీరోగా ఎం ఎస్ శ్రీపతి తెరకెక్కించిన మూవీ 800 ... శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆదారంగా వచ్చింది 800 మూవీ.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ లో ట్రెండ్ చేసిందో లేక చతికిలపడిందో చూద్దాం.

ఇక 800 మూవీ కథ విషయానికి వస్తే ..1940 కి ముందే క్రికెట్ పుట్టిన సమయంలో అప్పుడే అనేక దేశాలకి ఆంగ్లేయుల చేత విస్తరిస్తూ వస్తున్నా సమయంలో తమిళనాడుకి చెందిన కొందరు వలసదారులు శ్రీలంకలో స్థిరపడతారు. అలా స్థిరపడిన వారిలో ముత్తయ్య మురళీధరన్ కుటుంబం కూడా ఒకటి. అలా శ్రీలంకలో కూడా విస్తరించిన ఈ క్రికెట్ ని చిన్న నాటి నుంచి చూస్తూ ఆసక్తి పెంచుకుంటాడు ముత్తయ్య మురళీధరన్(మధుర్ మిట్టల్) .. ఆలా ఇష్టాన్ని పెంచుకున్న ముత్తయ్య అసలు క్రికెట్ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు? అలానే ముత్తయ్య సరిగ్గా 800 వికెట్ల తోనే ఎందుకు రిటైర్ అయ్యారు... ఇక తమిళనాడులో పుట్టిన వ్యక్తి శ్రీలంక కి ఎందుకు కట్టుబడి ఉన్నాడు.. అలానే తన జీవితంలో తనకి ఎదురైనా సంఘటనల ఆధారంగా తెరకెక్కింది 800 మూవీ .

ఇక 800 మూవీలో ముత్తయ్య పాత్రలో కనిపించిన మధుర్ మిట్టల్ సినిమాకే ప్లస్ అయ్యాడు . ముత్తయ్య పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పవచ్చు అలానే ఎమోషన్స్ ని అన్ని రకాల హావా భావాలను కూడా చక్కగా డెలివర్ చేశారు. అలనే తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనుకునే విధానం, పర్శనల్ లైఫ్ లో మురళీధరన్ కి ఎదురయ్యే సంఘటనలతో తను పడిన వ్యధ తో ప్రతి ఒక్కరిని కదిలించాడు,, ముత్తయ్య పాత్రకు మధుర్ మిట్టల్ ఒదిగిపోతే ఇక నాజర్, అరుళ్ దాస్ మహిమా నంబియార్ తదితరులు తమ పాత్ర మేరకు పర్లేదనిపిస్తున్నారు.

ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అంటే ఓ స్పోర్ట్స్ పర్శన్ యెక్క జీవిత చరిత్ర , తన ప్రొఫిషినల్ లైఫ్ లో ఎదుర్కొన్న సవాళ్లు అలానే వాటిని ఎలా ప్రెజెంట్ చేశారు అనేవి ఉంటాయి కానీ ఈ సినిమాలో చాల వరకు ఆ సన్నివేశాలు మిస్ అయ్యాయనే చెప్పుకోవాలి.. ఎందుకంటే ముత్తయ్య క్రికెట్ లైఫ్ కి సంబంధించి చాలా సీన్స్ ఉంటాయి కానీ అవేవి అంత ఇంట్రస్ట్ గా అనిపించలేదంటున్నారు ..ఇక స్క్రీన్ ప్లే డైరెక్షన్, మ్యూజిక్ ,బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ అన్ని కూడా ఇంకా బెటర్ గా చేస్తే బాగుండేది అనే మాటలే వినిపిస్తున్నాయి.. ఫైనల్ గా శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ని సూపర్ బయోపిక్ చూస్తున్నాం అనే ఫీల్ అయితే రాలేదంటున్నారు . 

Tags:    

Similar News