ఏపీలో మరో 706 కరోనా పాజిటివ్ కేసులు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.
- గడిచిన 24 గంటల్లో 706 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
- 302 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 11,554.
- ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 180.
- ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4987కి చేరింది.
- ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 6387 మంది చికిత్స పొందుతున్నారు.
పాత సచివాలయం కూల్చివేత ను సవాల్ చేస్తూ ధాఖలైన పిటిషన్లు పై నేడు తుది తీర్పు..
పాత సచివాలయం కూల్చివేత ను సవాల్ చేస్తూ ధాఖలైన పిటిషన్లు పై నేడు హై కోర్టు తుది తీర్పును ఇవ్వనుంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయాన్ని కూల్చి కొత్త సెక్రటేరియట్ కట్టాలని ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రొఫెసర విశ్వేశ్వర రావు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. మార్చి 10 న్యాయస్థానంలో సుదీర్ఘంగా కొనసాగిన విచారణలో తీర్పు ను రిజర్వ్ చేయగా నేడు తుది తీర్పు ను వెల్లడించునున్నారు.
తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి..
- రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా రాష్ట్రం ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు.
- ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు.
- రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కరోనా నిర్ధారిత పరీక్షలను పెంచాలని ఐసీఎంఆర్ చెబుతోందని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణలో కేంద్ర బృందం పర్యటనలో మార్పులు
- తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో జీజీహెచ్ మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంది.
- అడుగు బయట పెట్టలంటేనే ప్రజలు జంకుతున్నారు.
- హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర పర్యవేక్షక బృందం ఆదివారం నగరానికి చేరుకుంది.
- పూర్తి వివరాలుతెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి షాక్.. కొత్త నిబంధనలు ఫాలో కావాల్సిందే
- తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేవారికి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.
- తెలంగాణలోని నల్గొండ జిల్లా చెక్ పోస్ట్ మీదుగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే చెక్ పోస్ట్ దగ్గర అనుమతిస్తారు.
- ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నల్గొండ జిల్లా మీదుగా వెళ్లే అన్ని వాహనాలను సాయంత్రం 7.00 తర్వాత ఆంధ్రా బోర్డర్ లో నిలిపివేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ వెల్లడించారు.
తెలంగాణ:
👉►హైదరాబాద్‌లో కేంద్ర బృందం పర్యటన..
👉♦తెలంగాణలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణ..
👉♦నేడు ఉదయం 7 గంటల నుంచి 9 వరకు ఏదైనా కంటైన్‌మెంట్ క్లస్టర్ పరిశీలన..
👉♦అనంతరం టీఎస్ సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ..
👉♦గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్న కేంద్ర బృందం..
👉♦తర్వాత టిమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్న కేంద్ర బృందం..
ఆంధ్రప్రదేశ్:
👉►అమరావతి: నేడు ఎంస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు విడుదల..
👉♦క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడనున్న సీఎం జగన్..
👉♦లాక్‌డౌన్‌తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న MSMEలు గట్టెక్కేందుకు.. తిరిగి కంపెనీలు ప్రారంభమయ్యేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
👉♦గత ప్రభుత్వం చెల్లించని బకాయిలను నేరుగా ఎంఎస్‌ఎంఈల ఖాతాల్లో జమ..
👉♦రీస్టార్ట్ కార్యక్రమం ద్వారా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్న ప్రభుత్వం..
👉►తూర్పుగోదావరి: నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి అనిల్‌కుమార్ పర్యటన..
👉♦పోలవరం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలను సందర్శించనున్న మంత్రి అనిల్..
👉♦అనంతరం రంపచోడవరం ఐటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం.
ప్రైవేట్ టీచర్లను, లెక్చరర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ దీక్ష
విజయవాడ: స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లో నేడు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ మరియూ ఇతర సిబ్బందికి గత మూడు నెలల నుండి పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే
- ఇవ్వాలి ఎవరిని తొలగించవద్దు సంక్షేమానికి ఒక ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.
- ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన ఫలితంగా గత మూడు నెలల నుంచి జీతాలు రాక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వాటి లో పనిచేస్తున్న టీచర్లు సిబ్బంది, ఇప్పటికీ అరటి పళ్ళు, కూరగాయలు అమ్ముకునే దయనీయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
- ఈ అవకాశం కూడా లేని టీచర్లు మొన్న అనంతపురంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు నిన్న శ్రీకాకుళం జిల్లా కళాశాలలు కేశవరావు ఆత్మహత్య చేసుకున్నారు.
- ఈ ఆత్మహత్యలు వెంటనే నివారించాలి పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు ఇవ్వాలని టీచర్ కు సిబ్బందికి నెలకు పది వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలి అనంతరం కూడా ఎవరిని తొలగించకుండా చర్యలు తీసుకోవాలి సంక్షేమానికి ఒక బోర్డును ఏర్పాటు చేయాలని దీక్ష చేపట్టారు.
- ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు,టి.ప్రవీణ్ కుమార్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కోటి.బాబు, నాయకులు ఏసుబాబు నాయకులు కృష్ణ,నిజాం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ దీక్ష సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు దువ్వాడ శంకుస్థాపన
సంతబొమ్మాళి : మండలంలోని హనుమంతు నాయుడు పేట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలైన గ్రామ సచివాలయం,రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లీనిక్ సెంటర్లను ఆదివారం శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ దువ్వాడ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
- అనంతరం ఇటీవల మరణించిన వారి పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు.
- ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల వసంత రెడ్డి, పిలక రవి కుమార్ రెడ్డి, సుగ్గు రామిరెడ్డి, నక్క భీమారావు, సంతబొమ్మాళి మండల వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి 16 మంది అరెస్టు
చీడికాడ: చీడికాడ మండలం అర్జునగిరి శివారు ప్రాంతంలోని కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.
- పందేలు నిర్వహిస్తున్న 16 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు కోడి పుంజులు, రూ.11,500 నగదు, 12 సెల్ఫోన్లు, ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
- నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మండలంలో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.