మొక్కజొన్నలు మాటున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం
నెల్లూరు జిల్లా: ఉదయగిరి మండలం శకునాల పల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 70 బస్తాలు రేషన్ బియ్యం 67 బస్తాలు మొక్కజొన్నలు స్వాధీనం చేసుకున్న ఉదయగిరి పోలీసులు సీఐ సత్యనారాయణ ఎస్సై జ్యోతి.
మాస్క్ ధరించకపోతే జరిమానా తప్పదు: ఆత్మకూర్ ఎస్ఐ
ఆత్మకూరు: పట్టణంలోని గౌడ్ సెంటర్ నందు పట్టణ ఎస్ ఐ నాగేంద్ర ప్రసాద్ ద్విచక్రవాహనాలపై, ఆటోలపై ప్రయాణిస్తున్న వారిని తనిఖీ చేశారు.
- మాస్కులు ధరించని పౌరులకు జరిమానాలు విధించారు. ఎస్ ఐ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలని భౌతిక దూరం పాటించాలని తెలిపారు.
- పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్యా కరోన వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు భాధ్యతగా పాటుపడాలని అన్నారు.
కాపు నేస్తం దరఖాస్తు గడువు పొడిగింపు
మండపేట: మండలంలోని ఏడిద సీతానగరం గ్రామంలో కాపు నేస్తంకు సంబంధించి ఇంకా అర్హులై ఉండి, ఇంతవరకు దరఖాస్తు చేసుకోని లబ్ధిదారులు ఎవరైనా ఉంటే జులై 24 లోపు వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోనవలెనని పంచాయితీ కార్యదర్శి యం. శ్రీనివాస్ తెలియజేశారు.
- ఈ మేరకు వాలంటీర్లకు సూచన చేసి ఎవరైనా అర్హులై ఉంటే వెంటనే గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ కు దరఖాస్తులు ఇవ్వాల్సినదిగా ఆదేశించారు.
ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతి
తుని: జంట పట్టణాలైన తుని పాయకరావుపేట లో గల ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉపాది ఏమైనా ఉంటే కల్పించండి సారు అంటూ తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు ప్రత్యేక వినతిపత్రం అందజేశారు.
- పరిస్థితుల్లో స్కూల్లు తెరవక ఇంటిలో పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్లో తమకేదైన చిన్నపాటి అవకాశాలు ఉంటే కల్పించి తద్వారా జీతభత్యాలు ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
55 లీటర్ల నాటుసారా స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్
కోరుకొండ: కోరుకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఎక్సైజ్ సీఐ వీరబాబు తన సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో సారా కేంద్రాలపై దాడులు చేశారు.
- ఈ దాడుల్లో 55 లీటర్ల సారాతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసి.. ఐదు బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు.. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ చెప్పారు.
పట్టణాల నుండి గ్రామాలకు విస్తరిస్తున్న కరోనా
అట్లూరు: పట్టణాల నుండి పల్లెలకు కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూ ఉంది.
- తాజాగా మండల పరిధిలోని వలసపాలెంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
- పాజిటివ్ వచ్చిన వ్యక్తిని 108లో కడప కోవిడ్ ఆసుపత్రికి తరలించారు.
- ప్రైమరీ కాంటాక్ట్ అయిన 24 మందిని క్వారెంటైన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
- పంచాయితీ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలో శానిటేషన్ నిర్వహించారు.
కర్నూలు, కృష్ణా జిల్లాల్లో కరోనా మరణమృదంగం...
అనంతపురం : కర్నూలు, కృష్ణా జిల్లాల్లో కరోనా మరణమృదంగం... 24 గంటల్లో 12 మంది బలి కొంది.ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.
- గడచిన 24 గంటల వ్యవధిలో 12 మంది మృత్యువాత పడ్డారు.
- కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.
- దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 169కి పెరిగింది.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులను కల్పించండి: జాయింట్ కలెక్టర్ పద్మావతి
గార్లదిన్నె: మండల పరిధిలోని కల్లూరు గ్రామమునందు రెండో సచివాలయం నందు ఆకస్మికంగా జాయింట్ కలెక్టర్ పద్మావతి గ్రామ వార్డు వాలంటీర్లను ఉపాధి హామీ పనుల గురించి అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానంతో జాబ్ కార్డు లేని వ్యక్తులకు వెంటనే జాబ్ కార్డులను అందజేసి పనులు కల్పించాలని ఆమె తహసీల్లార్ భరత్ కుమార్ తో కలిసి వార్డు వాలంటరీలకు తెలియజేయడం జరిగింది.
అలాగే ఉపాధి హామీ పనులపై వార్డు వాలంటీర్లు వార్డులోని ప్రజానీకానికి తెలియజేయాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు ప్రభాకర మరియు నౌకర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.