Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 29 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-06-28 23:30 GMT

ఈరోజు సోమవారం, 29 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, నవమి (రా.10:12 వరకు), హస్త నక్షత్రం (ఉ.07:14 వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు


Live Updates
2020-06-29 16:20 GMT

 ♦♦ విజయవాడ ♦♦

- ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యునిగా ధ్రువీకరణ పత్రం అందుకున్న డొక్కా మణిక్య వరప్రసాద్‌

- ఇటీవల శాసనసభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాణిక్య వరప్రసాద్‌

- దీంతో శాసనమండలిలో 10 కి చేరిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక సభ్యుల సంఖ్య.

2020-06-29 15:56 GMT

♦ కరోనా తో మరో పోలీస్ అధికారి మృతి.

* ఎస్ ఆర్ నగర్ ట్రాఫిస్ ఏఎస్ఐ సమీరుద్దీన్ మరణం.

* ఇవ్వాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు మృతిచెందినట్లు వైద్యుల వెల్లడి.

* టోలిచౌకి లో ఉంటున్న ఎస్ఐ కి ఈనెల 19న కరోనా పరీక్షలు 20వ తేదీన పాజిటివ్గా నిర్ధారణ.

* కొరొనా పాజిటివ్ నిర్దారణ అయినరోజే ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ ఇవ్వాళ మృతి.

2020-06-29 15:55 GMT

@ కొమరం భీమ్ జిల్లా

 - లింగపూర్ ఎస్సై వెంకటేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ..

- అక్రమ కలప దందాతో సంబంధం ఉందనే అరోపణలపై సస్పెండ్ చేసిన కరీంనగర్ డిఐజీ ప్రమోద్ కుమార్


2020-06-29 15:50 GMT

@టిక్ టాక్ ని నిషేధించిన భారత్!


- భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ తో సహా 59 చైనా మొబైల్ యప్స్ ని నిషేదిస్తున్నట్టుగా ప్రకటించింది. టిక్ టాక్, యూసీ బ్రౌజర్ లతో పాటుగా మొదలగు యాప్స్ ని బ్యాన్ చేస్తునట్టుగా వెల్లడించింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్టుగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

2020-06-29 15:18 GMT

తూర్పు గోదావరి జిల్లా- అమలాపురం ♦♦

- అల్లవరం మం బోడసకుర్రు లోని ఏపీటిట్కో భవన సముదాయంలో కోవిడ్ కేర్ సెంటర్, క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు

- కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా బోడసకుర్రు లోని భవన సముదాయాన్ని 1400 పడకలు గా ఏర్పాటు

- కోవిడ్ కేర్ సెంటర్  ఆధునిక సౌకర్యాలతోఏర్పాటు

- కోనసీమలోని అన్ని ప్రాంతాల్లోని కరోనా అనుమానితులను ఈ సెంటర్ కి తరలిస్తాం

@ అమలాపురం ఆర్డీవో భవాని శంకర్

2020-06-29 15:16 GMT

- తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన.

- సీఎస్ తో భేటీ అనంతరం పర్యటనను ముగించిన లవ్ అగర్వాల్ బృందం.

* గచ్చిబౌలీ లోని TIMS, గాంధీ ఆసుపత్రి, దోమల్ గూడాలోని దోభీ గల్లీ -కంటేన్ మెంట్ ఏరియాను సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను కేంద్ర బృందం పరిశీలన.

* రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై కేంద్ర బృందం ముందు వైద్య శాఖ అధికారులు డిటేల్డ్ ప్రజెంటేషన్.

* రాష్ట్రంలో సర్వైలెన్స్ , కంటేన్ మెంట్ చర్యలు , ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరెస్ నివారణ చర్యల పై కేంద్ర బృందానికి వివరణ.

* రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసామని తెలిపిన టి-వైద్యశాఖ.

* వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపిన సీఎస్.

* కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేసింది- సీఎస్.

* ఇతర రాష్ట్రాల క్షేత్ర స్థాయి పర్యటనల అనుభవాన్ని పంచుకుంది- సీఎస్.

* రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు , వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం , కాంటాక్ట్ ట్రేసింగ్- క్లినికల్ మెనేజ్ మెంట్ పై సూచనలు చేసింది.

* కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.-సీఎస్

2020-06-29 15:16 GMT

♦ తూర్పుగోదావరి -రాజమండ్రి ♦♦

- జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

- జిల్లాలో నిన్న ఉ.9నుంచి నేటి ఉ.9 గంటల వరకూ కొత్తగా 87 కరోనా పాజిటీవ్ కేసులు

- జిల్లాలో 1337కు చేరుకున్న పాజిటీవ్ కేసుల సంఖ్య

- వీటిలో యాక్టీవ్ పాజిటీవ్ కేసుల సంఖ్య 880

- ఇంతవరకూ డిశ్చార్జి అయిన వారు 435

- హోం ఐసోలేషన్ లో వున్నవారు 139మంది

- జిల్లాలో పిఠాపురం , ఉప్పలగుప్తంలలో కొత్తగా రెండు కరోనా మరణాలు

- జిల్లాలో 227 కంటైన్మెంట్ క్లస్టర్లు..

- వీటిలో 151 యాక్టీవ్ క్లస్టర్లు

- జిల్లాలో ఒక లక్షా 5537 కరోనా నిర్ధారణ టెస్ట్ లు

- ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలు 98,394

- ఈరోజు వచ్చిన కేసులలో అత్యధికంగా

- కాకినాడ టౌన్, రూరల్ లలో 40,

- రాజమండ్రి టౌన్,రూరల్ లలో 17 పాజిటీవ్ కేసులు నమోదు

- పెద్దాపురంలో 13, సామార్లకోటలో 2, కాట్రేనికోన లో 3, అమలాపురం , శంఖవరంలలో రెండేసి వంతున పాజిటీవ్ నమోదు.

- ( తూర్పుగోదావరి డిఎంహెచ్ఓ జారీ చేసిన వివరాలు సమాచార శాఖ ద్వారా మీడియా కు రిలీజ్ చేసినవి)

2020-06-29 15:13 GMT

తిరుపతి♦♦

- తిరుమలలో నోహారన్ జోన్ ప్రకటించాలని వాహనదారులకు ఎస్పీ వినతి

- నేటి నుంచి అమలు చేయాలని పోస్టర్ విడుదల

- శబ్దకాలుష్యం పలు రకాల సమస్యలకు కారణంగా మారుతోంది.

- ప్రజలు,వాహనదారులు స్వచ్చందంగా హారన్ రహిత ప్రయాణాలు సాగించండి.. ఎస్పీ రమేష్ రెడ్డి

2020-06-29 14:19 GMT

***అనంతపురం***

- ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడిన ఇద్దరు దొంగలు అరెస్ట్.

- తూర్పుగోదావరి కి చెందిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను అరెస్టు చేసిన హిందూపురం పోలీసులు

- కొంతకాలంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల టార్గెట్గా మోసం.

- కేంద్ర ప్రభుత్వ పథకాలు పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న నిందితులు.

- హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, హిందూపురం ఇంచార్జ్, ఎమ్మెల్సీ అహ్మద్ ఇక్బాల్ కి ఫోన్ కాల్స్.

- ఒక్కొక్కరి తో రూ. 1.25 లక్షల చొప్పున ఏడు మంది తో నిందితుల అకౌంట్లు లోకి జమ.

- మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు.

- నిందితుల అరెస్టు.. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన పోలీసులు.

- గతం లోను పలువురు ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టించిన దుండగులు

2020-06-29 14:18 GMT

- ఆదిలాబాద్ జిల్లా బీమ్ పూర్ మండలం వడూర్ లోని పెన్ గంగానదిలో నాటు పడవ అదుపు తప్పి బోల్తా..

- సురక్షితంగా బయటపడిన నలుగురు వ్యక్తులు..

- నాటు పడవ ‌మునుగడంతో నీటిలో మునిగిపోయిన ద్విచక్ర వాహనం..

Tags:    

Similar News