ప్రైవేట్ టీచర్లను, లెక్చరర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ దీక్ష
విజయవాడ: స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లో నేడు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ మరియూ ఇతర సిబ్బందికి గత మూడు నెలల నుండి పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే
- ఇవ్వాలి ఎవరిని తొలగించవద్దు సంక్షేమానికి ఒక ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.
- ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన ఫలితంగా గత మూడు నెలల నుంచి జీతాలు రాక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వాటి లో పనిచేస్తున్న టీచర్లు సిబ్బంది, ఇప్పటికీ అరటి పళ్ళు, కూరగాయలు అమ్ముకునే దయనీయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
- ఈ అవకాశం కూడా లేని టీచర్లు మొన్న అనంతపురంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు నిన్న శ్రీకాకుళం జిల్లా కళాశాలలు కేశవరావు ఆత్మహత్య చేసుకున్నారు.
- ఈ ఆత్మహత్యలు వెంటనే నివారించాలి పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు ఇవ్వాలని టీచర్ కు సిబ్బందికి నెలకు పది వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలి అనంతరం కూడా ఎవరిని తొలగించకుండా చర్యలు తీసుకోవాలి సంక్షేమానికి ఒక బోర్డును ఏర్పాటు చేయాలని దీక్ష చేపట్టారు.
- ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు,టి.ప్రవీణ్ కుమార్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కోటి.బాబు, నాయకులు ఏసుబాబు నాయకులు కృష్ణ,నిజాం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ దీక్ష సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది.