Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-31 00:46 GMT
Live Updates - Page 3
2020-08-31 10:15 GMT

వరంగల్ అర్బన్.:


ఏసీబీ ట్రాప్....


రూ. 2వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ జ్యోతి, సీనియర్ అసిస్టెంట్ రహిష్ పాషా..


యాకయ్య అనే వ్యక్తి నుండి జిఎస్టి క్లీయరెన్సు సర్టిఫికెట్ కోసం రూ.5వేలు లంచం డిమాండ్...


హనుమకొండ హంటర్ రోడ్ లోని కార్యాలయంలో రూ.2వేలు లంచం డబ్బు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన cto, సీనియర్ అసిస్టెంట్....


విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు.


2020-08-31 10:14 GMT

జీఎస్టీపై 10 రాష్ట్రాల ఆర్దిక మంత్రులతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్దిక మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు.


అనంతరం మీడియాతో జీఎస్టీపై ఐదు గంటలకు మాట్లాడనున్నారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాజస్థాన్, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్, పాండిచ్చేరి, ఒడిస్సా, తెలంగాణ ఆర్థిక మంత్రులు జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను చర్చించనున్నారు.


2020-08-31 10:14 GMT

నేడు రిటైర్మెంట్ కానున్న టీఎన్జీవో అధ్యక్షుడు కారెం.రవీందర్ రెడ్డి.


ప్రస్తుతం టీఎన్జీవో అధ్యక్షుడు గా ఉన్న కారెం రవీందర్ రెడ్డి.


ప్రభుత్వం పదవీవిరమణ వయస్సు పెంపు పై ఏ నిర్ణయం తీసుకోకపోవడం తో నేటితో ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్మెంట్ అవుతున్నారు.


టిన్జీవో నూతన అధ్యక్షుడిగా మామిల్ల రాజేందర్ ని ఎన్నుకోనున్నారు.


రాజేందర్ స్థానంలో కొత్త జనరల్ సెక్రెటరీ ఎన్నికపై ఉత్కంఠ.


సాయంత్రం 5 గంటలకు టిఎన్జీవో నూతన అధ్యక్షుడి మామిల్ల రాజేందర్ ని ప్రకటించనున్నారు.


2020-08-31 10:13 GMT

బండి సంజయ్....


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.


- రాష్ట్రంలో హిందు పండుగలు జరుపుకోవాలంటే పోలీసులు అనుమతి తప్పనిసరి అయింది.


- మోహర్రం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తే పోలీసులు , ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు.


- నిమజ్జనాలకు అనుమతి ఇవ్వని పోలీసులు మోహర్రం ర్యాలీకి ఎలా అనుమతి ఇస్తారు.


- గణేష్ వేడుకలపై ప్రభుత్వనికి శిత్తశుద్ది లేదు. గతంలో వేలకొలది మండపాలు ఏర్పాటు చేసేవారు.


- కరోన సాకుతో ప్రభుత్వం గణేష్ మండపాలకు పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వలేదు.


- మండపాల నిర్వాహకుల పై పోలీసులు అక్రమ కేసులు బనయించి బెదిరిస్తున్నారు.


- దేవాలయాల్లో , కమ్యూనిటీ నివాసల్లో గణేష్ వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరం.


- గణేష్ విగ్రహాల తయారీదారులు రోడ్డున పడ్డారు.


2020-08-31 10:12 GMT

జోగులాంబ గద్వాల జిల్లా :


గద్వాల జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, సంపత్ కుమార్..


హాస్పిటల్ లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు.


బట్టి కామెంట్స్....


గద్వాల జిల్లా ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పోస్టులు ఖాళీలు ఉండడం దారుణం.


గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో 49 మంది డాక్టర్లు శాంక్షన్ ఉండగా 35 మంది ఖాళీ పోస్టులు ఉన్నాయి...


అరకొర డాక్టర్లతో కరోనా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు.


ప్రతి ఆస్పటల్ లో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల నిద్రపోతున్నారా..


పేద ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారు సీఎం.


తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది పేద ప్రజల కోసమా లేక కేసీఆర్ కుటుంబం కోసమా అని మండిపడ్డారు..


కరోనా పేషెంట్ లకు అన్నం పెట్టడానికి కూడా చేతకాని ప్రభుత్వం సిగ్గుచేటు..


తెలంగాణ రాష్ట్రానికి మూడు లక్షల కోట్లు అప్పు తెచ్చారు.. కనీసం కరోనా పేషెంట్ లకు అన్నం పెట్టలేని దుర్మార్గపు పాలన చేస్తున్నారు.


2020-08-31 08:43 GMT

Mahabubnagar updates: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..

మహబూబ్ నగర్...

-ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

-భట్టి విక్రమార్క కామెంట్స్,..

-ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్రంలోని అన్ని ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత వేధిస్తుంది..

-పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం వేతనాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.

-మిగులు బడ్జెట్ పేరుతో ప్రజలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుంది.

-ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో లేని విధంగా ప్రభుత్వాసుపత్రులు.

-ప్రస్తుత కరోనా సమయంలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

-కాంట్రాక్టు వైద్య సిబ్బందికి గత ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

-రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను ఉత్సవ విగ్రహంలా మార్చిన కేసీఆర్..

-అరకొర వైద్య సదుపాయాలతో రాష్ట్రంలో మృతుల సంఖ్య వేలకు చేరింది.

-ఉమ్మడి పాలమూరు జిల్లాలో వైద్య సిబ్బంది కొరతతో వైద్యం పడకేసింది..

-బట్టి విక్రమార్క...

2020-08-31 08:39 GMT

Hyderabad updates: సోమాజీగూడా ప్రెస్ క్లబ్....మంద కృష్ణ మాదిగ..

-సోమాజీగూడా ప్రెస్ క్లబ్....

-మంద కృష్ణ మాదిగ..

-పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో దళిత యువతి కి న్యాయం జరగాలి.

-విషయం తెలుసుకుని నేను దిగ్భ్రాంతికి గురయ్యను.

-బాధిత యువతితో చర్చించకుండా ఎలాంటి ప్రకటన చేయకూడదని స్పందించలేదు

-సీసీస్ పోలీసులతో మాట్లాడి దర్యాప్తులో పురోగతి గురించి తెలుసుకున్నాము.

-యువతి ని అడిగినప్పుడు కొందరు పేర్లు చెప్పింది.

-139మంది పై పెట్టిన కేసులో 30శాతం అత్యాచారం చేసినట్లు చెప్పింది. మిగిలిన కొంతమంది వేదించినట్లు చెప్పింది.

-ఫిర్యాదులో రాసిన వారిలో కొందరి పేర్లకు ఈమెకు సంబంధం లేదని తెలిసింది.

-డాలర్ బాబు అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తి ఈమెతో కేసులు పెట్టించాడు ఈమెను అత్యాచారం చేయడానికి కూడా ప్రయత్నించాడు.

-ఈ కేసు ద్వారా బ్లాక్మయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది...

-ఈ కేసును సీబీఐ తో విచారణ జరిపించాలి.

-యువతికి ప్రాణ హాని ఉంది కనుక భద్రత కల్పించాలి.

-టీవీ యాంకర్ ప్రదీప్ కు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు.

2020-08-31 08:31 GMT

Warangal Rural updates: వినాయకునికి పూజలు నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..

వరంగల్ రూరల్ జిల్లా :

-పర్వతగిరి లో విఘ్నేశ్వరుని మండపంలో వినాయకునికి పూజలు నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

-విఘ్నేశ్వరుని మండపం వద్ద మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి

-మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:

-మన ఆచార సంప్రదాయాలు ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత చెంది వున్నాయి

-సర్వమత హితం మన సహితం సమాజహితం

-మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి కాబట్టే మనల్ని ప్రపంచం లో గొప్ప వారిగా గౌరవిస్తారు

-సర్వమతాల సమ్మేళనమే మన భారత దేశం

-అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకునే పండుగలు మన భారతదేశంలో తప్ప ఎక్కడ లేవు..

2020-08-31 08:26 GMT

Warangal Urban updates: మామనూర్ ఎయిర్ పోర్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు..

వరంగల్ అర్బన్ :

-మామనూర్ ఎయిర్ పోర్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు..

-ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఎయిర్ పోర్ట్ అధారిటీ అధికారులు..

2020-08-31 06:06 GMT

Mahabubnagar updates: జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క..

మహబూబ్ నగర్...

-జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క.

-ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్ తో బాధితులకు అందుతున్న వైద్య ఆరా..

Tags:    

Similar News