Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-31 00:46 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 31 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం త్రయోదశి (ఉ. 8-35 వరకు) తదుపరి చతుర్దశి. శ్రవణ నక్షత్రం (మ. 3-53 వరకు) తదుపరి ధనిష్ఠ, అమృత ఘడియలు (ఉ. 6-57 వరకు) వర్జ్యం (రా. 8-02 నుంచి 9-42 వరకు) దుర్ముహూర్తం (మ. 12-25 నుంచి 1-15 వరకు తిరిగి మ.2-54 నుంచి 3-44 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-13

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-31 14:52 GMT

జానారెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత: 

రాజకీయ కురు వృద్ధులు, ఆర్థిక వేత్త కాంగ్రెస్ పార్టీ లో దాదాపు 5 దశాబ్దాలుగా క్రియాశీల నాయకులుగా పనిచేసిన మాజీ రాష్ట్రపతి మరణం దేశానికి తీరని.లోటు.

ట్రబుల్ షూటర్ గా పేరు  గాంచిన ప్రణబ్ ముఖర్జీ నాకు అత్యంత సన్నిహితుడు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలకమైన సలహాలు ఇచ్చి సహకరించారు.

13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు పని చేస్తున్న సమయంలో నే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవిర్భవించింది.

నాకు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతికి నా ప్రగడ సానుభూతి ని తెలుపుతున్నాను.

తెలంగాణ ప్రజలు వారికి రుణపడి ఉంటారు.

దేశంలో అనేక కీలక సమస్యలను పరిష్కరించడంలో ప్రణబ్.ముఖర్జీ క్రియాశీల పాత్ర పోషించారు..

అంత గొప్ప మేధావి, ప్రపంచం గుర్తించదగిన నాయకులు కరోనో భారిన పడి మృతి చెందడం అత్యంత బాధాకరం..

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

2020-08-31 14:47 GMT

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల సంతాపం తెలిపిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్

2020-08-31 14:45 GMT

రేవంత్ రెడ్డి.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్: 

మాజీ రాష్ట్రపతి, భారతరత్న, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటు.

భారత రాజకీయాలలో ఐదు దశాబ్దాల సుదీర్ఘ కాలం సేవలందించిన ముఖర్జీ తనదైన ముద్రవేశారు.

ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన సేవలు గర్వించదగ్గవి.

లోక్ సభ పక్ష నేతగా, రాజ్యసభ పక్ష నేతగా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ గా వివిధ హోదాలలో ఆయన సేవలందించారు.

ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.

ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

2020-08-31 14:38 GMT

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సిపిఐ నాయకులు సంతాపం..

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు....

దాదాపు 5 దశాబ్దాలుగా ఆయనతో నాకు పరిచయం ఉన్నది. ఆయన ప్రారంభించిన నిరక్షరాస్యత నిర్మూలన కమిటీ లో నేను కూడా సభ్యుడిగా ఉండే వాడిని....

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మంత్రివర్గంలో విభిన్న పోర్ట్ పోలియోలతో ఆయన అత్యంత సమర్ధవంతంగా పని చేశారు...

రాష్ట్రపతిగా ఆయన బాధ్యత నుండి విరమించిన తర్వాత రాసిన పుస్తకాల ఆవిష్కరణ సభకు నన్ను కూడా ఆహ్వానించారు....

సెక్యులర్ భావాల పట్ల నిబద్ధత, చివరివరకూ జాతి సమైక్యత కోసం ఆయన గొప్ప కృషి చేశారు..

ఆయనకు శ్రద్ధాంజలి అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సురవరం సుధాకర్ రెడ్డి తెలియజేశారు...

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి , సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజిత్ పాషా, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ గారలు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పట్ల సంతాపాన్ని తెలియజేశారు....

ప్రణబ్ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడు అని, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కోసం కృషి చేశారని, లౌకిక వ్యవస్థను కాపాడటంలో గర్వకారణమైన పాత్ర నిర్వహించారని కొనియాడారు...

వారికి సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

2020-08-31 14:36 GMT

భారత మాజీ రాష్ట్రపతి 'భారతరత్న' ప్రణబ్ ముఖర్జీ మృతి నాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది- ఎర్రబెల్లి దయాకర్ రావురాష్ట్ర మంత్రి*

నేను ఎంపీగా ఉన్న కాలంలో వారు భారత విదేశాంగ శాఖ మంత్రి గా ఉన్నారు

దేశానికి ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవలు మరువలేనివి.

ప్రణబ్ ముఖర్జీ గారికి తెలంగాణతో విడదీయరాని అనుబంధం ఉంది

భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు రాజముద్ర వేసిన వ్యక్తిగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు

ప్రణబ్ ముఖర్జీ గారు సామాన్యుని నుండి రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి

ప్రణబ్ ముఖర్జీ గారు దేశానికి చేసిన సేవలు మరువలేనివి

వారి మరణం యావత్తు దేశానికి తీరనిలోటు

ప్రణబ్ ముఖర్జీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలుపుతున్నాను


2020-08-31 14:30 GMT

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్రమంత్రి

భారత రాజకీయాల్లో భీష్మాచార్యులు ప్రణబ్ ముఖర్జీ గారు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నియమించిన కమిటీకి నేతృత్వం వహించిన ప్రణబ్ ముఖర్జీ గారు,

రాష్ట్రపతి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ..

తెలంగాణ సమాజం వారిని ఎప్పటికీ గుర్తుకు పెట్టుకుంటుంది

ప్రణబ్ ముఖర్జీ గారి మరణంపట్ల ప్రగాఢ సంతాపం.

2020-08-31 14:24 GMT

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

ఆయన మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు.

తెలంగాణ సమాజం ప్రణబ్ ముఖర్జీని ఎప్పటికీ గుర్తుఉంచుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి యూ పి ఏ ప్రభుత్వం వేసిన కమిటీకి ప్రణబ్ ముఖర్జీ యే చైర్మన్ అని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం బిల్లు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి గా ఉన్నప్పుడే ఉభయ సభల్లో ఆమోదం పొందిందని ఆయన అన్నారు. అటువంటి మహానేత మరణంతో ఏర్పడ్డ లోటు పూడ్చలేనిదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

2020-08-31 14:20 GMT

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల సంతాపం ప్రకటించిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

2020-08-31 14:19 GMT

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి ఎంపీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన 

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

వారి మరణం దేశాన్నికి తీరని లోటు

తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలకపాత్ర పోషించారు

హైకమాండ్ ను ఒప్పించి తెలంగాణ ప్రకటన వచ్చే విధంగా చేశారు

2020-08-31 14:16 GMT

తెలంగాణా సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది

రాష్ట్ర ఏర్పాటు కమిటీకి ప్రణబ్ ముఖర్జీ చైర్మన్

రాష్ట్రపతి హోదలోనే తెలంగాణ బిల్లు ఆమోదం

Tags:    

Similar News