Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-26 02:11 GMT
Live Updates - Page 5
2020-10-26 06:28 GMT

అమరావతి.....

మంత్రి అనిల్ కుమార్

పోలవరం కు కర్చు చేసిన 2200 కోట్లు ఇవ్వాలని కోరితే ఆర్థిక శాఖ కొత్త అంశం లేవనెత్తింది

పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు

కొన్ని సంవత్సరాలు పాటు జరిగే ప్రాజెక్ట్ నిర్మాణానికి అనేక సార్లు అంచనాలు పెరుగుతాయి

2014 నుండి 2016 వరకు కేవలం 265 కోట్ల రూపాయల పని మాత్రమే చేశారు

స్పెషల్ ప్యాకేజ్ లో బాగంగా పోలవరం తీసుకొచ్చినట్టు టిడిపి ఊదర కొట్టింది

2014 వరకు ఉన్న ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తాను అని కేంద్రం చెప్పింది

పోలవరం మేమే తీసుకుని పని చేస్తాం అని చంద్రబాబు ప్రభుత్వం కోరింది

2017 మార్చిలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం లో అప్పగించాలని నిర్ణయించారు

అప్పుడే మేము 2014 తర్వత లెక్కల ప్రకారం నిధులు ఇవ్వము అని మెలిక పెట్టారు

ఆరోజు కేంద్ర క్యాబినెట్ లో టిడిపి నాయకులు ఉన్నారు

2010 ప్రకారమే భూ సేకరణ ప్యాకేజ్ చెల్లిస్తాం అని చెప్పారు

2014 అంచనాలు ఆమోదించి మాకు ఆ డబ్బులు ఇచ్చేయండి అని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు

అంతా ఒప్పుకుని 2018 తర్వాత చంద్రబాబు రచ్చ చేయడం మొదలుపెట్టారు

తాను చేసిన తప్పులకు చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కున్నారు

తప్పులు అన్ని టిడిపి చేస్తే మేము క్షమాపణలు చెప్పాలా?

పోలవరం కోసం 72 సార్లు వెళ్ళను అని చెపుతున్న చంద్రబాబు... నిర్వాసితుల కి కోసం వెళ్ళారా?

కమిషన్ల కోసం త్వరగా పూర్తి చేయాలని పరిగెత్తారు చంద్రబాబు

కనీసం టీడీపీకి చెందిన కేంద్ర క్యాబినెట్ సభ్యులు దానిని వ్యతిరేకించారా?

టిడిపి లాగా మేము రాష్ట్రానికి వెన్నుపోటు పొడవలేము

ఎవరూ, ఎవరికి క్షమాపణ చెప్పాలో ప్రజలకు అర్థమైంది

పాత అంచనాలతో నిర్మాణం చేపట్టడానికి మేము సిద్దంగా లేము...

పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంది

మేము దానికోసమే పోరాటం చేస్తాం

2020-10-26 06:27 GMT

రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్

దేశాభివృద్ధి, రక్షణ కోసం కేంద్రంలో బీజేపీ ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లును వైసీపీ ఎంపీ లు మద్దతు తెలిపారు...

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వంపై కోపం లేదు...ఇష్యూ బేస్డ్ ఫైటింగ్ మాత్రం ఉంటుంది..

ఏపీ కి రావాల్సిన అభివృద్ధి నిధులు, లోటు బడ్జెట్ నిధులు ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకంటే మెరుగ్గానే ఏపీకి నిధులు ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలి

ఇరు ప్రభుత్వాలు సామరస్యంగా సాగుతుండగా కొందరు నాయకులు నోరు జారుతున్న కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయి..

ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు అద్దాల మేడలో ఉన్నట్టే...

కేంద్రంతో సంబంధాలు బాగుంటే రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుంది...

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ చేస్తే సమస్యలేదు..రాష్ట్ర పాలన వికేంద్రీకరణ చేస్తే అన్ని ప్రాంతాల ప్రజలు హర్షిస్తారు

ఇది కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆచరణలో ఉంది

ఇపుడు జరుగుతున్నది వికేంద్రీకరణ కాదు....మూడు భాగాలుగా విభజించిన కారణంగానే సమస్య మొదలైంది...

ఇది కోర్టులో ఉన్న సమస్య..పరిష్కారానికి చాలా సమయం పడుతుంది

మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసే అవకాశాలు చాలా వున్నాయి....అలాగైతేనే కలకాలం కలసి ఉంటాం...

రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్, విశాఖలో వింటర్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది..

ఇపుడున్న పరిస్థితుల్లో సమ్మర్ క్యాపిటల్, వింటర్ కాపిటల్ ఏర్పాటు మంచి పరిష్కారం..

దేశంలో సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ ఆనవాయితీ ఉంది...

సామరస్య పరిష్కారం చూపితే అన్ని ప్రాంతాల ప్రజలు జగన్ కు జేజేలు చెప్పే అవకాశం ఉంది..

కేసీఆర్ గారు జగన్ గారిని ఆహ్వానించి భోజనం పెట్టి సన్మానింఛామని, అయినా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు విషయంలో ముందుకువెళ్తున్నారని అంటున్నారు...జగన్ గారు కూడా కేసి ఆర్ ను ఆహ్వానించి మూడు పూటలా విందు ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ గురించి అర్థమయ్యేలా చెప్పాలి..

తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని కేసీఆర్ కు వివరించాలి

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించడంలో సీఎం జగన్ ఏమాత్రం వెనకడుగు వేయరాదు..

తెలంగాణ నీటిని తోడేస్తే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది...

తెలంగాణ వాటా నీటిని కోరుకోవడం లేదు..రెండు రాష్ట్రాల రైతులు నష్టపోకూడదు...

తెలంగాణ నేతలకు ఏపీ వాళ్ళతో అవసరం ఉంటుంది...తెలంగాణ లో ఏపీ ప్రజల ఓట్లు ఎక్కువగా ఉన్నందున వారికి ఏపీ మద్దతు అవసరం ఉంది...ఏపీ లో తెలంగాణ నేతలకు ఓట్లు లేవు..తెలంగాణ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదు..

కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు కర్నూలులోనే ఏర్పాటు చేయాలి....

కోవిడ్ ప్రభావం రెండేళ్ల పాటు ఉంటుందని గతంలోనే చెప్పాను....పోతులూరి బ్రహ్మంహారి కాలజ్ఞానం కూడా గుర్తు చేసాను. ప్రపంచంలో 2/3 శాతం మందిపై ప్రభావం ఉంటుందని లాక్ డౌన్ కు ముందు చెప్పాను....కావాలంటే మీడియా క్లిప్పింగులు చూసుకోండి..ఇపుడు అలాగే జరిగింది. కరోన నుంచి తప్పించుకోవడం కష్టం...ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి...

2020-10-26 06:27 GMT

కడప :

కడప కలెక్టరేట్ లో వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమం...

వికలాంగులు, దివ్యంగులకు వినికిడి యంత్రాలు, ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన ఇంచార్జ్ మంత్రి ఆదిములపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి...

జిల్లా వ్యాప్తంగా దాదాపు 659 మంది దివ్యంగులకు పరికరాల పంపిణీ..

పాల్గొన్న చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాధ్ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహ రెడ్డి

2020-10-26 06:26 GMT

విజయవాడ

సోము వీర్రాజు బిజెపి ఎపి అధ్యక్షులు

అమరావతి విషయంలో టిడిపి, వైసిపి కంటే స్పష్టమైన వైఖరితో ఉంది

రెండేళ్లలో ఇక్కడే సొంత పార్టీ కార్యాలయం ప్రారంభిస్తాం

అమరావతిలో తొమ్మిది వేల ఎకరాలను‌ చంద్రబాబు అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయలేదు

ఎయిమ్స్ ను తక్కువ ఖర్చుతో కేంద్రం నిర్మాణం చేసి చూపించింది

ఆనాటి, నేటి‌ ప్రభుత్వాలు కనీసం రోడ్ కు స్థలం ఇవ్వలేదు

రాజధాని‌ విషయంలో టిడిపి, వైసిపి లే ప్రజలను మోసం చేశాయి

హైకోర్టు రాయలసీమ లో ఉండాలని బిజెపి విధానానికి కట్టుబడి ఉంది

చంద్రబాబు రాజధానికి కేంద్రం కేటాయించిన నిధుల లెక్కలు చెప్పాలి

జగన్ ప్రభుత్వం గొప్పలు‌ చెప్పుకోవడం తప్ప..‌ చేతల్లో చూపించడం లేదు

గత ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టు లను వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది

గడ్కరీ.. స్వయంగా చంద్రబాబు ను విశాఖ పిలిపించి నిధుల పై‌ చర్చించారు

అన్ని పార్టీ ల జాతకాలు‌ చెప్పే లగడపాటి రాజగోపాల్.. రెండేళ్ళ ఎంపిగా దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం చేయలేక పోయారు

కేశినేని నాని‌ ఒక. లేఖ ఇవ్వగానే గడ్కరీ స్పందించి ఫ్లైఓవర్లకు నిధులు ఇచ్చి పూర్తి చేశారు

టిటిడి నుంచి డిపాజిట్ సొమ్మలు తీయవద్దంటూ ప్రభుత్వానికి లేఖ రాశాం..

వరదల పై పరిశీలించి.. సాయం‌ చేయాలని లేఖ రాస్తే కేంద్రం వెంటనే స్పందించింది

మాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. రాష్ట్ర అభివృద్ధి కే మా ప్రాధాన్యత

టిడిపి, వైసిపి ప్రభుత్వం లో అవినీతి జరిగింది

సెంటు స్థలం పేరుతో .. పట్టాల పంపిణీ అంటూ.. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచేశారు

దీని పై చంద్రబాబు ఎందుకు స్పందించరు.. ప్రభుత్వాన్ని నిలదీయరా

అంటే.. అప్పుడు వాళ్లు..‌ ఇప్పుడు వీళ్లు అవినీతి లో భాగస్వామ్యులే

టిడిపి, వైసిపి కుటుంబ పార్టీ లు అనేది వాస్తవం

నీరు..‌చెట్టు పేరుతో కోటి మొక్కలు పెంచేస్తామని ప్రగల్భాలు

ఇందులో కూడా‌ వేల కోట్ల అవినీతి జరిగిందనేది‌ వాస్తవం

21కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టు ల పై అధ్యయనం చేసి.. వైసిపి ప్రభుత్వం లో ఎమ్మెల్యే ల అవినీతి ని బయట పెడతాం

పోలవరం విషయంలో వైసిపి అనవసర రాద్దాంతం‌ చేస్తుంది

మాకు టిడిపి, వైసిపి అయినా రెండూ మాకు ప్రతిపక్ష పార్టీలే

మా పార్టీ కి ఒక‌విధానం ఉంది.. ఆ విధానం బట్టే చానల్స్ డిబేట్లకి పంపిస్తాం

ప్రజా సమస్య ల పై బిజెపి, జనసేన లు కలిసి త్వరలో ప్రజా ఉద్యమం చేపడతాం

2020-10-26 06:26 GMT

గుంటూరు...

జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి కామెంట్స్ ...

విజయవాడ దివ్య తేజశ్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు జిజిహెచ్ లో చికిత్స పొంతున్నాడు.

నాగేంద్రబాబు ఆరోగ్యం మెరుగు పడుతుంది.

మొదట హాస్పిటల్ లో చేరినప్పుడు కత్తి పోట్లతో ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.

పన్నెండు రోజుల నుండి జిజిహెచ్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆపరేషన్ చేసిన సమయంలో కుట్లు తీశారు.

నాగేంద్రబాబు కోలుకుంటున్నాడు.

రెండు రోజుల తర్వాత నాగేంద్రబాబు డిశ్చార్జి పై వైద్యులు నిర్ణయం తీసుకుంటారు.

2020-10-26 06:25 GMT

అమరావతి

చిత్తూరు టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ నాయకుల గృహ నిర్భంధాలను ఖండించిన చంద్రబాబు

హంద్రీ-నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామకుప్పం నుంచి టీడీపీ మహాపాదయాత్ర అడ్డుకోవడం అప్రజాస్వామికం.

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న టీడీపీపై అణచివేత చర్యలను ఖండిస్తున్నాను.

టీడీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం.

అలాంటిది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను గర్హిస్తున్నాం.

తక్షణమే టీడీపీ నాయకులపై గృహనిర్బంధం ఎత్తివేయాలి. అక్రమ కేసులను తొలగించాలి.

రైతాంగ వ్యతిరేక చర్యలకు వైసీపీ స్వస్తి చెప్పాలి. కుప్పం రైతుల సాగునీటి సమస్యలు, తాగునీటి ఎద్దడి తక్షణమే పరిష్కరించాలి.

హంద్రీ-నీవా ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.

*నారా చంద్రబాబు నాయుడు,

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు*

2020-10-26 06:24 GMT

కృష్ణాజిల్లా

కైకలూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటన

పందిరిపల్లి గూడెం నుండి లంక గ్రామాల వరద బాధితులను పరామర్శించేందుకు బోటులో బయలుదేరిన నారా లోకేష్

వడ్లకూటితిప్ప, పందిరిపల్లి గూడెం, గుమ్మాలపాడు, శృంగవరపాడు గ్రామాలను పరిశీలించి, రైతులు, ప్రజల్ని పరామర్శించనున్న నారా లోకేష్

2020-10-26 06:24 GMT

అమరావతి

రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.

అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం తగదు.

314 రోజులుగా అమరావతి ఉద్యమం నిర్విరామంగా సాగుతున్నది.

అమరావతికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు మంగళగిరి ప్రాంతం నుంచి కృష్ణాయపాలెం వస్తున్న దళితుల్ని స్థానిక దళితులు అడ్డుకున్నారు.

కానీ పోలీసులు రాజకీయ కోణంలో ఇతర సామాజిక వర్గాలపై కేసులు నమోదు చేయడం అన్యాయం.

అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని కోరుతున్నాం.

👆రామకృష్ణ.

2020-10-26 06:23 GMT

అమరావతి.....

విజయసాయిరెడ్డి..... వైసీపీ ఎంపీ

పాలనాధికారం ఉంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి.

పచ్చ పార్టీ ఫిలాసఫీ మాంత్రం దీనికి భిన్నం.

దోపిడీలు, ఆక్రమణలు, తవ్వకాలకు పవర్ తప్పనిసరి అని అనుకుంటుంది.

అందుకే అన్నిరకాల మాఫియాలను ప్రోత్సహించింది.

పుట్ట పగులుతుంటే తట్టుకోలేక పోతోంది.

2020-10-26 02:38 GMT

Cricket Betting: ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా పై కేసు

👉క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై రెండో పట్టణ సీఐ ఆది ప్రసాద్ దాడి..

👉ఆరుగురు పై కేసు నమోదు.

👉ఒక ఒక సోనీ ఈ ఎల్ ఈ డి టీవీ , రెండు సెల్ఫోన్లు 1020 నగదు స్వాధీనం.

Tags:    

Similar News