అమరావతి.....మంత్రి అనిల్ కుమార్పోలవరం కు కర్చు... ... Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి.....
మంత్రి అనిల్ కుమార్
పోలవరం కు కర్చు చేసిన 2200 కోట్లు ఇవ్వాలని కోరితే ఆర్థిక శాఖ కొత్త అంశం లేవనెత్తింది
పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు
కొన్ని సంవత్సరాలు పాటు జరిగే ప్రాజెక్ట్ నిర్మాణానికి అనేక సార్లు అంచనాలు పెరుగుతాయి
2014 నుండి 2016 వరకు కేవలం 265 కోట్ల రూపాయల పని మాత్రమే చేశారు
స్పెషల్ ప్యాకేజ్ లో బాగంగా పోలవరం తీసుకొచ్చినట్టు టిడిపి ఊదర కొట్టింది
2014 వరకు ఉన్న ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తాను అని కేంద్రం చెప్పింది
పోలవరం మేమే తీసుకుని పని చేస్తాం అని చంద్రబాబు ప్రభుత్వం కోరింది
2017 మార్చిలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం లో అప్పగించాలని నిర్ణయించారు
అప్పుడే మేము 2014 తర్వత లెక్కల ప్రకారం నిధులు ఇవ్వము అని మెలిక పెట్టారు
ఆరోజు కేంద్ర క్యాబినెట్ లో టిడిపి నాయకులు ఉన్నారు
2010 ప్రకారమే భూ సేకరణ ప్యాకేజ్ చెల్లిస్తాం అని చెప్పారు
2014 అంచనాలు ఆమోదించి మాకు ఆ డబ్బులు ఇచ్చేయండి అని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు
అంతా ఒప్పుకుని 2018 తర్వాత చంద్రబాబు రచ్చ చేయడం మొదలుపెట్టారు
తాను చేసిన తప్పులకు చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కున్నారు
తప్పులు అన్ని టిడిపి చేస్తే మేము క్షమాపణలు చెప్పాలా?
పోలవరం కోసం 72 సార్లు వెళ్ళను అని చెపుతున్న చంద్రబాబు... నిర్వాసితుల కి కోసం వెళ్ళారా?
కమిషన్ల కోసం త్వరగా పూర్తి చేయాలని పరిగెత్తారు చంద్రబాబు
కనీసం టీడీపీకి చెందిన కేంద్ర క్యాబినెట్ సభ్యులు దానిని వ్యతిరేకించారా?
టిడిపి లాగా మేము రాష్ట్రానికి వెన్నుపోటు పొడవలేము
ఎవరూ, ఎవరికి క్షమాపణ చెప్పాలో ప్రజలకు అర్థమైంది
పాత అంచనాలతో నిర్మాణం చేపట్టడానికి మేము సిద్దంగా లేము...
పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంది
మేము దానికోసమే పోరాటం చేస్తాం