Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-26 02:11 GMT
Live Updates - Page 6
2020-10-26 02:34 GMT

CM Jagan news: ఎస్సీ,ఎస్టీ ఇండస్ట్రియల్ పాలసీ ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్

- ఈరోజు ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయం లో ఎస్సీ,ఎస్టీ ఇండస్ట్రియల్ పాలసీ ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్

- కడప స్టీల్ ప్లాంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్న సీఎం

- కడప జిల్లా కొప్పర్తి లో తలపెట్టిన ఎలక్ట్రానిక్ మాన్యు ఫాక్చరింగ్ క్లస్టర్ పై ఉన్నతాధికారులతో సమావేశం కానున్న సీఎం

- మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, కీలక నేతలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి

- పొలవలం ప్రాజెక్టు, స్థానిక ఎన్నికల తో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం జగన్

2020-10-26 02:30 GMT

Dasara at Devaragattu: దేవరగట్టులో ఉత్కంఠ

 - కరోనా నేపథ్యంలో కర్రల సమరాని కి అనుమతి ఇవ్వని పోలీసులు...

- నిర్వాహణ గ్రామాల నుండి కేవలం శాస్త్ర సంప్రదాయ పద్ధతిలో పూజలు జరుపుకునేందుకు కొద్దిమందికి మాత్రమే పాసులతో కూడినటువంటి అనుమతి

- ఇతర ప్రాంతాల నుండి దేవరగట్టు వైపు రాకుండా అన్ని మార్గాలలో చెక్ పోస్టులు ఏర్పాటు

- ఆలూరు, హోలగుందా, చిప్పగిరి, హాలహర్వి మండలాలలో 144 సెక్షన్ అమలు

- నియోజకవర్గంలో భారీగా పోలీసుల మోహరింపు

2020-10-26 02:28 GMT

Divya death case: దివ్య హత్య కేసులో పురోగతి

- ఈరోజు నిందితుడు నాగేంద్ర ను అరెస్టు చేయనున్న పోలీసులు

- అనంతరం కోర్టులో ఛార్జిషీటు

- 45 మందిని విచారించిన పోలీసులు

- ఫోరెన్సిక్, పోస్టుమార్టుం రిపోర్టులు కీలకం

- సూసైడ్ కాదు అని తేల్చిన రిపోర్టులు

2020-10-26 02:20 GMT

Nara Lokesh tour in krishna district : కృష్ణా,పశ్చిమగోదావరి జిల్లాల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన నేడు!

కృష్ణా జిల్లాలో...

కైకలూరు నియోజకవర్గం

1) ఆళ్ళపాడు గ్రామం, కైకలూరు మండలం

పశ్చిమగోదావరి జిల్లాలో...

ఉండి నియోజకవర్గం

1) ఐ. భీమవరం గ్రామం, ఆకివీడు మండలం

2) ఆకివీడు గ్రామం, ఆకివీడు మండలం

3) సిద్దాపురం గ్రామం, ఆకివీడు మండలం

తణుకు నియోజకవర్గం

1) ఎస్సీ కాలనీ, ఈడురు గ్రామం, అత్తిలి మండలం

2) ఎస్సీ కాలనీ, వరిగేడు గ్రామం, తణుకు మండలం

3) బిసీ కాలనీ, దువ్వ గ్రామం, తణుకు మండలం

వరదలతో నీట మునిగి దెబ్బతిన్న ఇళ్లు,పంట పొలాలను పరిశీలించి,రైతుల్ని,ప్రజల్ని పరామర్శించనున్న నారా లోకేష్

2020-10-26 02:17 GMT

Srisailam Project Updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

- 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

- ఇన్ ఫ్లో :1,18,050 క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో : 1,23,605 క్యూసెక్కులు

- పూర్తి స్థాయి నీటి మట్టం: 885.00 అడుగులు

- ప్రస్తుతం : 884.90 అడుగులు

- పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

- ప్రస్తుతం: 215.3263 టీఎంసీలు

- కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

- తెలంగాణ ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి

2020-10-26 02:15 GMT

Tirumala Updates: తిరుమల సమాచారం

* నిన్న శ్రీవారిని దర్శించుకున్న 16,043 మంది భక్తులు

* తలనీలాలు సమర్పించిన 5,405 మంది భక్తులు

* నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.24 కొట్లు

తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ ప్రారంభం

* వివిధ కారణాలతో రెండు మాసాలకు పైగా ఆగిన ఉచిత దర్శనాన్ని పునరుద్దరించిన టిటిడి

* ఒకరోజు ముందుగా, ముందుగా వచ్చిన వారికి ముందుగా టిక్కెట్టు పద్దతిన రోజుకు 3వేల టిక్కెట్లు పంపిణీ

* తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో కౌంటర్

* టిటిడి ప్రకటనపై ముందస్తుగా సమాచారం లేకపోవడంతో రేపటి దర్శనానికి స్పందన కరువు

* ఉదయం నుంచి ఖాళీగానే టిక్కెట్లు జారీ కౌంటర్

Tags:    

Similar News