రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ దేశాభివృద్ధి, రక్షణ... ... Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్

దేశాభివృద్ధి, రక్షణ కోసం కేంద్రంలో బీజేపీ ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లును వైసీపీ ఎంపీ లు మద్దతు తెలిపారు...

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వంపై కోపం లేదు...ఇష్యూ బేస్డ్ ఫైటింగ్ మాత్రం ఉంటుంది..

ఏపీ కి రావాల్సిన అభివృద్ధి నిధులు, లోటు బడ్జెట్ నిధులు ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకంటే మెరుగ్గానే ఏపీకి నిధులు ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలి

ఇరు ప్రభుత్వాలు సామరస్యంగా సాగుతుండగా కొందరు నాయకులు నోరు జారుతున్న కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయి..

ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు అద్దాల మేడలో ఉన్నట్టే...

కేంద్రంతో సంబంధాలు బాగుంటే రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుంది...

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ చేస్తే సమస్యలేదు..రాష్ట్ర పాలన వికేంద్రీకరణ చేస్తే అన్ని ప్రాంతాల ప్రజలు హర్షిస్తారు

ఇది కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆచరణలో ఉంది

ఇపుడు జరుగుతున్నది వికేంద్రీకరణ కాదు....మూడు భాగాలుగా విభజించిన కారణంగానే సమస్య మొదలైంది...

ఇది కోర్టులో ఉన్న సమస్య..పరిష్కారానికి చాలా సమయం పడుతుంది

మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసే అవకాశాలు చాలా వున్నాయి....అలాగైతేనే కలకాలం కలసి ఉంటాం...

రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్, విశాఖలో వింటర్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది..

ఇపుడున్న పరిస్థితుల్లో సమ్మర్ క్యాపిటల్, వింటర్ కాపిటల్ ఏర్పాటు మంచి పరిష్కారం..

దేశంలో సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ ఆనవాయితీ ఉంది...

సామరస్య పరిష్కారం చూపితే అన్ని ప్రాంతాల ప్రజలు జగన్ కు జేజేలు చెప్పే అవకాశం ఉంది..

కేసీఆర్ గారు జగన్ గారిని ఆహ్వానించి భోజనం పెట్టి సన్మానింఛామని, అయినా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు విషయంలో ముందుకువెళ్తున్నారని అంటున్నారు...జగన్ గారు కూడా కేసి ఆర్ ను ఆహ్వానించి మూడు పూటలా విందు ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ గురించి అర్థమయ్యేలా చెప్పాలి..

తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని కేసీఆర్ కు వివరించాలి

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించడంలో సీఎం జగన్ ఏమాత్రం వెనకడుగు వేయరాదు..

తెలంగాణ నీటిని తోడేస్తే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది...

తెలంగాణ వాటా నీటిని కోరుకోవడం లేదు..రెండు రాష్ట్రాల రైతులు నష్టపోకూడదు...

తెలంగాణ నేతలకు ఏపీ వాళ్ళతో అవసరం ఉంటుంది...తెలంగాణ లో ఏపీ ప్రజల ఓట్లు ఎక్కువగా ఉన్నందున వారికి ఏపీ మద్దతు అవసరం ఉంది...ఏపీ లో తెలంగాణ నేతలకు ఓట్లు లేవు..తెలంగాణ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదు..

కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు కర్నూలులోనే ఏర్పాటు చేయాలి....

కోవిడ్ ప్రభావం రెండేళ్ల పాటు ఉంటుందని గతంలోనే చెప్పాను....పోతులూరి బ్రహ్మంహారి కాలజ్ఞానం కూడా గుర్తు చేసాను. ప్రపంచంలో 2/3 శాతం మందిపై ప్రభావం ఉంటుందని లాక్ డౌన్ కు ముందు చెప్పాను....కావాలంటే మీడియా క్లిప్పింగులు చూసుకోండి..ఇపుడు అలాగే జరిగింది. కరోన నుంచి తప్పించుకోవడం కష్టం...ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి...

Update: 2020-10-26 06:27 GMT

Linked news