Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-22 00:45 GMT
Live Updates - Page 3
2020-10-22 09:47 GMT

Amaravati updates: ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...

అమరావతి

*తెలంగాణ రాష్ట్ర తొలి హోమ్ శాఖామంత్రి, జీవితాంతం కార్మిక లోకానికి అండగా నిలిచి సేవలందించిన నాయిని నర్సింహారెడ్డిగారి మరణం విచారకరం.

*కార్మిక లోకానికి తీరని లోటు.

*వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, నాయిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

2020-10-22 09:42 GMT

Raghu Rama Krishna: కేంద్ర హోం మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు!

జాతీయం

రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎంపి

-నాకు రాష్ట్రప్రభుత్వం నుండి రక్షణ కావాలని కోరిన వెంటనే స్పందించిన కేంద్ర హోం మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు

-తప్పుడు సలహాలతో గతంలో ఇసుకను దోచుకున్న కొంతమందిలసహాదారులనైనా శిక్షించాలి.

-రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గక ముందే కరోనా కేర్ సెంటర్లను ఎత్తివేసారు. ఉభయగోదావరి జిల్లాలలో కరోనా తీవ్రత, సమస్యలపై సీఎం దృష్టిసారించాలి.

-నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయం కోసం మరొక రాజ్యాంగ సంస్థను ఆశ్రయించడం సిగ్గుచేటు. ఇకనైనా రాజ్యాంగ సంస్థలకు గౌరవం ఇవ్వాలి.

-ఆంధ్రప్రదేశ్ సీఎం న్యాయవ్యవస్థపై బుదజల్లిన విషయంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ తప్పుపట్టారు .

-పనికిమాలిన సలహాదారుల సలహాలు వినడం మానివేసి, ప్రజల సలహాలు సీఎం తీసుకోవాలి.

నమ్మి ఓటు వేసిన ప్రజలను న్యాయం చేయండి. సీఎం కాకముందు ఉన్నట్లుగానే.. ఇప్పుడు కూడా అదే విధంగా సీఎం ఉండాలి.

2020-10-22 09:33 GMT

Amaravati updates: పెట్టుబడి మొత్తాన్ని పరిహారంగా తక్షణమే చెల్లించాలి..

  అమరావతి..

*పవన్ కళ్యాణ్....జనసేన అధినేత

*రైతులు పూర్తిగా నష్టపోయారు... పెట్టుబడి మొత్తాన్ని పరిహారంగా తక్షణమే చెల్లించాలి

*గతేడాది పంట నష్ట పరిహారం కూడా రైతులకు ఇవ్వలేదు

*భారీ వర్షాలు, వరదల మూలంగా నష్టపోయిన రైతులు తమ పంటలను పూర్తిగా నష్టపోవడం దురదృష్టకరం.

*ఖరీఫ్ సీజన్ లో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసా నీటి పాలైంది.

*రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదు.

*నష్టం అంచనాలను రూపొందించే ప్రభుత్వం పరిహారాన్ని అందించడంలో ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.

*గత ఏడాది జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారం ఇప్పటికీ కూడా చెల్లించలేదని రైతాంగం ఆవేదన చెందుతున్నారు.

*ఈసారి పరిహారం ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

*ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.71 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.

*అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోనే పంటలు నష్టపోయి ఉంటాయని క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళిన నాయకులు తెలియచేశారు.

*ప్రధానంగా వరి పంట నీట మునిగి కుళ్లిపోతోంది.

*ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో వరి సాగు చేసినవారి పరిస్థితి దయనీయంగా ఉంది.

*తక్షణమే ఆ పరిహారం చెల్లిస్తే తదుపరి పంటకు రైతులు మానసికంగా సంసిద్ధులు అవుతారు.

*ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ నుంచి వచ్చిన జీవో 19ని ఉపసంహరించుకోవాలి.

*వరద ముంపు బారినపడ్డ ప్రతి కుటుంబాన్ని ఆదుకొని... ఉపాధికి దూరమైన కాలానికి పరిహారం ఇవ్వాలి.

2020-10-22 07:52 GMT

అమరావతి

గ్రూప్ -1 పరీక్షల పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు..

నవంబర్ 2న జరిగే మెయిన్ ఎగ్జామ్ వాయిదా వేయాలని ఆదేశం..

ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో తప్పులు వచ్చాయని హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు..

ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీ ని సవరించి తాజాగా జాబితా విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం..

ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో 51 తప్పులు వచ్చాయన్న అభ్యర్థులు..

ఇరవై ఐదు తప్పులు మాత్రమే వచ్చాయని పేర్కొన్న ఏపీపిఎస్సీ..

2020-10-22 07:52 GMT

అమరావతి

గ్రూప్ వన్ పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశం

నవంబరులో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించిన హైకోర్టు

గ్రూప్ వన్ పరీక్షలపై అభ్యంతరాల పై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు

గతంలోనే తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

నేడు తీర్పు వెల్లడించిన హైకోర్టు

గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలో దొల్లిన తప్పులను సరిచేస్తూ నూతన జాబితా వెల్లడించాలని కోర్టు ఆదేశం

2020-10-22 07:52 GMT

అమరావతి....

పోతిన మహేష్.....జనసేన అధికార ప్రతినిధి

కొండ చరియలు విరిగి పడిన ఘటనపై సీఎం గారు అధికారుల నిర్లక్ష్యంపై ఎందుకు స్పందించలేదు

వారిపై ఎందుకు చర్యలు తీసుకో లేదు

కొండ చరియలు విరిగి పడిన ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు అధికారుల నిర్లక్ష్యం ముందుచూపు సమన్వయం లేకపోవడమే.

దసరా ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరం నిర్వహణ ఖర్చులను విడుదల చేయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమ్మవారి ఆలయ అభివృద్ధికి 70 కోట్లు ఇస్తానని ప్రకటన జారీ చేయించడంనమ్మశక్యంగా లేదు.

అమ్మవారి పేరు ఉన్న 70 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ లనే ముఖ్యమంత్రి గారు ఆలయ అభివృద్ధికి ప్రకటించారు

అంతేగాని రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి కాదు.

ప్రాణ నష్టం జరిగితే గానీ ముఖ్యమంత్రి గారు స్పందించి చర్యలు తీసుకొరా.

అమ్మ దయతో భక్తులకు మీడియా మిత్రులకు పెద్ద ప్రమాదం తప్పింది.

2020-10-22 07:51 GMT

అమరావతి

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం.

గిరిజన సంక్షేమశాఖకు రూ.50.31 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.

2017 నుంచి బెస్ట్ ఏవైలబుల్ స్కూల్స్ కు బకాయిలు.

ప్రస్తుత విద్యా సంవత్సరం వరకూ బకాయిలు క్లియర్ చేసిన ప్రభుత్వం.

2020-10-22 07:50 GMT

అనంతపురం: పల్లె రఘునాథరెడ్డి, మాజీ మంత్రి, బికె పార్థసారథి కామెంట్స్:

రాష్ట్రంలో వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రస్రసాదం వదలి రావడం లేదు.

ఇంత అసమర్థ ప్రభుత్వం ను ఇప్పటి వరకు చూడలేదు.

రైతులపై ప్రేమ తోనే లోకేష్ రేపు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.

2020-10-22 07:50 GMT

అమరావతి

రాష్ట్ర వ్యాప్తంగా భూ సమగ్ర సర్వేపై క్యాంపు కార్యాలయం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష.

హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్,రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు.

2020-10-22 06:32 GMT

ప.గో.ఏలూరు శనివారపుపేటలో మాన బడి నాడు -నేడు కింద నూతనంగా నిర్మించిన మండల పరిషత్ స్కూల్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం, మంత్రి ఆళ్ల నాని,

పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి,జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు, రాజు, DEO రేణుక,మరియు జిల్లా అధికారులు..

Tags:    

Similar News