Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-22 00:45 GMT
Live Updates - Page 4
2020-10-22 06:32 GMT

అమరావతి

మాజీ మంత్రి నాయిని నర్శింహారెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి,  నాయిని కుటుంబసభ్యులకు తన సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి

2020-10-22 05:34 GMT

విజయవాడ

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

కొల్లు రవీంద్ర

ఐదేళ్ల క్రితం ఇదే రోజున రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాజధానిపై అయోమయం నెలకొంది

అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారు

రాజధానిని ఇక్కడే కొనసాగించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకున్నా

దుర్గగుడిలో సరైన సదుపాయాలు కల్పించడం లేదని భక్తులు చెబుతున్నారు

పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే నిన్న కొండచరియలు విరిగిపడ్డాయి

ఘటనకు అధికారులు బాధ్యత వహించాలి

భవిష్యత్తులో ఇంద్రకీలాద్రిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేలా పాలకులు చర్యలు తీసుకోవాలి

పాలకులకు మంచి బుద్దిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నా

2020-10-22 05:33 GMT

విజయవాడ

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

మంత్రి జయరాం

ఆలయంలో కోవిడ్ నిబంధనలు, ఏర్పాట్లు బావున్నాయి

కోవిడ్ త్వరగా పోవాలని అమ్మవారిని కోరుకున్నాను

రైతులకు పంటలు మంచిగా పండలని కోరుకున్నాను

గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి.

2020-10-22 05:33 GMT

విజయవాడ

విద్యాశాఖామంత్రి, ఆదిమూలపు సురేష్

ఆర్జెయూకెటీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ అడ్మిషన్లు చేస్తున్నాం

మార్కుల ఆధారంగా ఈ అడ్మిషన్లు జరగాలి

ఈసారి కోవిడ్ నేపథ్యంలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడానికి నిర్ణయించారు

ఎన్ జీ రంగా యూనివర్సిటి, వైఎస్ఆర్ యూనివర్సిటీ లో డిప్లొమా కోర్సులు చదవాలనుకున్న వారు కూడా ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయచ్చు

రెండు గంటల నిడివితో వంద మార్కులకు నిర్వహిస్తాం

ఓఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తాం

ఓసీ అభ్యర్ధులు 300, బీసీ అభ్యర్ధులు 200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు100 ఫీజు ఉంటుంది

22-10-2020 న ప్రవేశ ప్రకటన వెలువడుతుంది

ఫీజు చెల్లింపులు 28 అక్టోబర్ నుంచీ 10 నవంబర్ వరకూ

పెనాల్టీ 1000 తో 15 నవంబరు వరకూ ఫీజు చెల్లింపు అవకాశం

హాల్ టికెట్లు 22 నవంబరు నుంచీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు

పరీక్ష 28 నవంబర్ నాడు ఉంటుంది, కీ అదే రోజు వెలువడుతుంది

సమాధానాల మీద అనుమానం ఉంటే 30 నవంబరు వరకూ స్పందించవచ్చు

1 డిసెంబరుకు ఫైనల్ కీ వెలువరిస్తాం

నెగెటివ్ మార్కులు ఉండవు

ఫలితాలు 5 డిసెంబరు నాడు వెలువరిస్తాం

ప్రతీ వంద మందికి మండలానికి ఒక పరీక్షా కేంద్రం

హైదరాబాదు, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, అదిలాబాద్ లలో తెలంగాణలో పది సెంటర్లు

పదవ తరగతి స్ధాయిలో గణితం, సైన్స్ లలో సిలబస్ ఉంటుంది

2020-10-22 05:32 GMT

అమరావతి...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

కార్మిక నేతను కొలిపోయాం

నాయిని నర్సింహారెడ్డి మరణం కార్మిక లోకానికి తీరని లోటు .

నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభుతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రదిస్తున్న.

2020-10-22 05:32 GMT

అనంతపురం : గుత్తి మండలం లో లో భారీ వర్షం.. వర్షం ధాటికి ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు.

గుత్తి మండలం రాజాపురం గ్రామం వద్ద 66వ జాతీయ రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగులో చిక్కుకున్న గ్యాస్ పైప్ లైన్ కంటైనర్ వాహనము. వాహన డ్రైవర్ను సురక్షితంగా తాడు సహాయంతో రక్షించిన స్థానికులు.

2020-10-22 05:31 GMT

అమరావతి

నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

కార్మిక నాయకునిగా సుదీర్ఘకాలం రాజకీయ జీవితం గడిపిన నేత నాయిని.

ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాల్లో కలిసి వచ్చేవారు.

తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి హోంమంత్రిగా పనిచేసిన నరసింహారెడ్డి మరణం బాధాకరం.

నాయని నరసింహారెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.

- రామకృష్ణ

2020-10-22 02:31 GMT

Srisailam Dasara: శ్రీశైలంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు

- శ్రీశైలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా మహోత్సవాలు

- ఆరవ రోజైన నేడు అమ్మవారికి కాత్యాయని అలంకారం స్వామిఅమ్మవార్లకు హంసవాహనసేవ

- ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,

- అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు

- స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు రుద్రహోమము చండీహోమములు

2020-10-22 02:23 GMT

Tirumala Updates: తిరుమల సమాచారం

- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 17,574 మంది భక్తులు

- తలనీలాలు సమర్పించిన 6,579 మంది భక్తులు

- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.95.50 లక్షలు

శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

- శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా ఏడవ రోజుకు చేరుకున్న బ్రహ్మోత్సవాలు

- ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనం,

- రాత్రి 7 గంటల‌కు చంద్రప్రభ వాహనం

2020-10-22 01:51 GMT

Weather Updates: కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం


- బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం...

- 24 గంటల్లో వాయుగుండం గా మారే అవకాశం...

- పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరం మీదకు పయనిస్తున్న వాయుగుండం..

- బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం, ద్రోణి..

- వీటి ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర లో వర్షాలు...

- మిగిలిన ప్రాంతాలలో అక్కడ అక్కడ వర్షాలు...

- తీరం వెంబడి గంట కు 45-55 కీ మీ వేగం తో గాలులు.

- మత్స్యకారుల కు కొనసాగుతున్న హెచ్చరికలు

Tags:    

Similar News