విజయవాడవిద్యాశాఖామంత్రి, ఆదిమూలపు... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ

విద్యాశాఖామంత్రి, ఆదిమూలపు సురేష్

ఆర్జెయూకెటీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ అడ్మిషన్లు చేస్తున్నాం

మార్కుల ఆధారంగా ఈ అడ్మిషన్లు జరగాలి

ఈసారి కోవిడ్ నేపథ్యంలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడానికి నిర్ణయించారు

ఎన్ జీ రంగా యూనివర్సిటి, వైఎస్ఆర్ యూనివర్సిటీ లో డిప్లొమా కోర్సులు చదవాలనుకున్న వారు కూడా ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయచ్చు

రెండు గంటల నిడివితో వంద మార్కులకు నిర్వహిస్తాం

ఓఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తాం

ఓసీ అభ్యర్ధులు 300, బీసీ అభ్యర్ధులు 200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు100 ఫీజు ఉంటుంది

22-10-2020 న ప్రవేశ ప్రకటన వెలువడుతుంది

ఫీజు చెల్లింపులు 28 అక్టోబర్ నుంచీ 10 నవంబర్ వరకూ

పెనాల్టీ 1000 తో 15 నవంబరు వరకూ ఫీజు చెల్లింపు అవకాశం

హాల్ టికెట్లు 22 నవంబరు నుంచీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు

పరీక్ష 28 నవంబర్ నాడు ఉంటుంది, కీ అదే రోజు వెలువడుతుంది

సమాధానాల మీద అనుమానం ఉంటే 30 నవంబరు వరకూ స్పందించవచ్చు

1 డిసెంబరుకు ఫైనల్ కీ వెలువరిస్తాం

నెగెటివ్ మార్కులు ఉండవు

ఫలితాలు 5 డిసెంబరు నాడు వెలువరిస్తాం

ప్రతీ వంద మందికి మండలానికి ఒక పరీక్షా కేంద్రం

హైదరాబాదు, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, అదిలాబాద్ లలో తెలంగాణలో పది సెంటర్లు

పదవ తరగతి స్ధాయిలో గణితం, సైన్స్ లలో సిలబస్ ఉంటుంది

Update: 2020-10-22 05:33 GMT

Linked news