Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-22 00:45 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 22 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి మ.01-09 వరకు తదుపరి సప్తమి | మూల నక్షత్రం ఉ.07-22 వరకు తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.05-50 నుంచి 07-22 వరకు తిరిగి సా.04-44 నుంచి 06-18 వరకు | అమృత ఘడియలు రా.02-05 నుంచి 04-12 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి 02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-22 15:08 GMT

 తిరుమల...

*ఏడవ రోజు రాత్రి చంద్రప్రభవాహనంపై వెన్న‌ కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీమ‌ల‌య‌ప్పస్వామి వారు

*రేపు ఉదయం స్వర్ణ రథం బదులుగా సర్వభూపాల వాహనం నిర్వహించనున్న టీటీడీ

2020-10-22 14:58 GMT

తూర్పుగోదారి :

నిమ్మకాయల చినరాజప్ప....

--పెద్దాపురం ఎన్టీఆర్ కాలనిలో ఒరిస్సాకు చెందిన మహిళపై వైసీపీ నాయకుడు అత్యాచారాయత్నం కేసులో పోలీసుల తీరుపట్ల మాజీమంత్రి నిమ్మకాయల   చినరాజప్ప ఫైర్....

--నిందితుడు రంగనాధం జీవాను అరెస్టు చెయ్యకుండా కేసును రాజీ చేసేందుకు పోలీసులు సహకరిస్తున్నారు..

--జీవాపై కేసు నమోదైనప్బటికి అధికారిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనేలా పోలీసులు సహకరించారు.

--డీజీపీ మాటలకు చేతలకు చాలా తేడా ఉంది.. కక్షసాధింపు చర్యలపై ఉన్న దృష్టి అత్యాచార నిందితులను అరెస్టు చెయ్యడంలో లేదు..

--ఇప్పటికైనా నిందితుడిని అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలి.. 

2020-10-22 14:47 GMT

  నెల్లూరు :--

అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖ మంత్రి...

*నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ సంస్థలో ప్లాస్మా థెరపీ సెంటర్ ని పరిశీలించిన మంత్రి అనీల్

*కరనా సమయంలో నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చెప్పటింది

*ప్లాస్మా డొనేషన్ లో దేశంలోనే రెండో స్థానంలో నిలవడం సంతోషించదగ్గ విషయం, భవిష్యత్తులో మొదటి స్థానానికి రావాలని కోరుకుంటున్న

2020-10-22 14:43 GMT

#టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్

#తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతి పాత్రమైన పండుగ బతుకమ్మ, దసరా పండుగలు

#దసరా రోజు తమ స్వగ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి ,తల్లిదండ్రులు , పెద్దల ఆశీస్సులు తీసుకొని అత్యంత ప్రేమతో జరుపుకుంటారు.

#తెలుగు క్యాలెండర్ ప్రకారం విజయదశమి రోజు సోమవారం 26 అక్టోబర్ 2020 నాడు జరుపుకోవాల్సినదిగా ఆగమ శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు.

#విజయదశమి సోమవారం బదులు ఆదివారమే జరుపుకునేట్లు ఇప్పటికే సెలవు ప్రకటించి ఉన్నది.

#విజయదశమి సోమవారం జరుపుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు 26 అక్టోబర్ 2020 క్లోజ్డ్ సెలవు దినంగా ప్రకటించినంది.

#తెలంగాణ ప్రభుత్వం కూడా సోమవారం రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విజ్ఞప్తి చేసాము.

# ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సోమవారం సెలవు దినంగా ప్రకటించడం కోసం నిర్ణయం తెలియజేస్తామని హామి ఇచ్చారు.

2020-10-22 14:38 GMT

  ప్రకాశం :

--సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కామెంట్స్..

--రాష్ట్రంలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో భారీ వర్షాలకు రైతులు చాలా పంటలు నష్టపోయారు..

--రైతులు దివాళా తీసే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది..

--గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు సీఎం జగన్ ఏరియల్ సర్వేలు మాత్రమే వెళ్తున్నారు కానీ స్వయంగా వెళ్లి పరిశీలించడం లేదు..

--వరదలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఆదుకోవాలి..

--ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి రావాల్సిన నిధులను అడిగి తెచ్చుకునే పరిస్థితి లేదు..

--పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా 55 వేల కోట్ల రూపాయలు కావాలని కోరితే తూతూమంత్రంగా నిధులు విదిలిస్తున్నారు..

--ఆర్థిక మంత్రి బుగ్గన గత ముఖ్యమంత్రి చంద్రబాబు సరిగ్గా నివేదికలు పంపలేదని చెప్తున్నారు..

--బుగ్గన ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు..

--ఇళ్ల స్థలాలు ఎందుకు పెండింగ్ పెడుతున్నారో అర్ధం కావటం లేదు..

--పేదలకు సరిపడా స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలి..

--మీరేమో భారీ సౌదాల్లో నివాసాలు ఉంటూ పేదలకు మాత్రం 44 గజాల్లో ఇల్లు కట్టుకోమంటున్నారు..

--అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లయ్యింది..

--ఢిల్లీ కంటే పెద్ద నగరాన్ని నిర్మిస్తామన్న ప్రధాని మోదీ దీనిపై స్పందించాలి..

--శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర నాయకులకు అమరావతి పై భాద్యత లేదా..

--సీఎం జగన్ అమరావతిని ధ్వంసం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు..

--ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి..

2020-10-22 14:31 GMT

ప్రకాశం :

*సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్స్..

*భారీ వర్షాల వల్ల నష్టాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా గుర్తించాలి..

*హైదరాబాద్ వరదల్లో కూడా ఓట్ల రాజకీయాలు చేయటం శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా ఉంది..

*కోవిడ్ పై ప్రధాని మోదీ రోజుకో మాట చెప్తూ ప్రజల్ని ఏమారుస్తున్నారు..

*కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించడం లేదు..

*వలస కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎటువంటి సాయం అందటం లేదు..

*కోవిడ్ సమయంలో ట్యాక్సులు రద్దు చేయటం వల్ల కార్పొరేట్ సెక్టార్ ఒక్కటే బాగుపడింది..

*కేంద్రం కేవలం అంబానీలు, ఆధానీల కోసమే పనిచేస్తుంది..

*ట్రంప్, మోదీ ఇద్దరి నాటకాలు చూస్తుంటే ప్రపంచ ఉత్తమ కళాకారులుగా మించి పోతున్నారు..

*వ్యవసాయం మీద కేంద్రం తీసుకు వచ్చిన బిల్లులు రైతులకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి..

*విద్యుత్ ను ప్రయివేటికరించటం వల్ల పబ్లిక్ సెక్టార్ పూర్తిగా దెబ్బతింటుంది..

*రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ మొత్తాన్ని కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారు..

*కేంద్రం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకువచ్చే బిల్లులను జగన్ వ్యతిరేకించడం లేదు..

*కేంద్రం అడక్కుండానే పార్లమెంటులో వారు ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతునిస్తున్నారు..

*దేశంలో మత రాజకీయల బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుంది..

*రాజ్యాంగానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదకరంగా మారబోతున్నారు..

2020-10-22 13:10 GMT

  విజయవాడ

--ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

--నిందితుల దగ్గర 3 కోట్లు విలువ చేసే టర్కీ కరెన్సీ స్వాధీనం

--విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలో టర్కీ కరెన్సీ కలిగి ఉన్న ఐదుగురు వ్యక్తులని అదుపు లోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు...

--ముఠా సభ్యుల నుండి సుమారు రూ 3 కోట్లు ఖరీదు చేసే టర్కీ కరెన్సీ స్వాధీనం

--ముఠాకి చెందిన ఇన్నోవా కారు, ఓలా ధ్విచక్రవాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం..

2020-10-22 13:07 GMT

విజయవాడ

//పాలకమండలి సభ్యులు, MLA పార్థసారథి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పన.

//పార్థసారథి, టీటీడీ బోర్డ్ మెంబర్

//నవరాత్రుల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించము.

//అమ్మవారిని దర్శించుకోవడం చాలా సొంతోషంగా ఉంది.

//అమ్మవారి దీవెన, వేంకటేశ్వర స్వామి అసిస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి.

//అమ్మవారు, వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి.

//ఇంకా మెరుగైన పాలన సీఎం జగన్ ప్రజలకు అందించాలి అని కోరుకున్నాము.

//ఈ కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నాము.

2020-10-22 12:38 GMT

విజయవాడ

-చెప్పిన 48 గంటల్లోనే చెక్కు పంపిన సీఎం జగన్

-సీఎం జగన్ ఉదారతకు కృతజ్ఞతలు తెలిపిన దివ్య తలిదండ్రులు జోసెఫ్, కుసుమ

-ప్రభుత్వం తరఫున పదిలక్షల చెక్కు అందజేసిన దేవినేని అవినాష్

-విజయవాడ తూర్పు నియొజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, దేవినేని అవినాష్

-సీఎం జగన్ దివ్య తేజస్విని తలిదండ్రులకు భరోసా ఇచ్చారు

-సీఎం జగన్ ప్రకటించిన పదిలక్షల చెక్కు దివ్య తలిదండ్రులకు అందజేసాం

-చక్కగా చదువుకునే దివ్య జీవితం నాశనం చేసిన నాగేంద్రకు కఠిన శిక్ష పడుతుంది

-ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున అండగా ఉంటాం

-దివ్య తండ్రి, జోసెఫ్

-సీఎం జగన్ చేసిన సహాయం మరువలేనిది

-మా బాధను విని మాకు సీఎం జగన్, హోంమంత్రి సుచరిత మాకు ధైర్యాన్నిచ్చారు

-ఆరోజు నుంచీ ఈరోజు వరకూ అందరూ మాకు అండగా ఉన్నారు

2020-10-22 12:24 GMT

  అమరావతి...

* మంత్రి బొత్స సత్యనారాయణ

* అమరావతి శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాలు అయిందని పాదయాత్ర చేశారు

* ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఏడు నెలలు అయ్యింది

* చంద్రబాబు కరకట్ట రోడ్డు కూడా వేసుకోలేక పోయారు

* సచివాలయ భావనలకు స్క్వేర్ ఫీట్ కు పది వేలు కర్చు చేసి తాత్కాలికం అన్నారు

* చంద్రబాబు ఆవేదన అంత తన బినామీలు, బందువులు, చుట్టలా కోసమే

* ఇన్సైడర్ ట్రేడింగ్ వల్ల ఉపయోగం లేకుండా పోయింది అని చంద్రబాబు ఆవేదన

* చంద్రబాబు అమరావతి కనీసం 50 శాతం పూర్తి చేసినా బాగుండేది కేవలం 5 శాతం మాత్రమే పూర్తి చేశారు

* జగన్ మళ్లీ సీఎం కావాలని అందరూ కోరుతుంటే... ఇదే మాకు ఆఖరి చాన్స్ అని చంద్రబాబు అంటున్నారు

* అమరావతి పోరాటం అసలు ఎక్కడ జరిగింది?

Tags:    

Similar News