CPI Ramakrishna: భారీ వర్షాలకు రైతులు చాలా పంటలు నష్టపోయారు...
ప్రకాశం :
--సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కామెంట్స్..
--రాష్ట్రంలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో భారీ వర్షాలకు రైతులు చాలా పంటలు నష్టపోయారు..
--రైతులు దివాళా తీసే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది..
--గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు సీఎం జగన్ ఏరియల్ సర్వేలు మాత్రమే వెళ్తున్నారు కానీ స్వయంగా వెళ్లి పరిశీలించడం లేదు..
--వరదలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఆదుకోవాలి..
--ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి రావాల్సిన నిధులను అడిగి తెచ్చుకునే పరిస్థితి లేదు..
--పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా 55 వేల కోట్ల రూపాయలు కావాలని కోరితే తూతూమంత్రంగా నిధులు విదిలిస్తున్నారు..
--ఆర్థిక మంత్రి బుగ్గన గత ముఖ్యమంత్రి చంద్రబాబు సరిగ్గా నివేదికలు పంపలేదని చెప్తున్నారు..
--బుగ్గన ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు..
--ఇళ్ల స్థలాలు ఎందుకు పెండింగ్ పెడుతున్నారో అర్ధం కావటం లేదు..
--పేదలకు సరిపడా స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలి..
--మీరేమో భారీ సౌదాల్లో నివాసాలు ఉంటూ పేదలకు మాత్రం 44 గజాల్లో ఇల్లు కట్టుకోమంటున్నారు..
--అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లయ్యింది..
--ఢిల్లీ కంటే పెద్ద నగరాన్ని నిర్మిస్తామన్న ప్రధాని మోదీ దీనిపై స్పందించాలి..
--శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర నాయకులకు అమరావతి పై భాద్యత లేదా..
--సీఎం జగన్ అమరావతిని ధ్వంసం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు..
--ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి..