Amaravati updates: పెట్టుబడి మొత్తాన్ని పరిహారంగా తక్షణమే చెల్లించాలి..
అమరావతి..
*పవన్ కళ్యాణ్....జనసేన అధినేత
*రైతులు పూర్తిగా నష్టపోయారు... పెట్టుబడి మొత్తాన్ని పరిహారంగా తక్షణమే చెల్లించాలి
*గతేడాది పంట నష్ట పరిహారం కూడా రైతులకు ఇవ్వలేదు
*భారీ వర్షాలు, వరదల మూలంగా నష్టపోయిన రైతులు తమ పంటలను పూర్తిగా నష్టపోవడం దురదృష్టకరం.
*ఖరీఫ్ సీజన్ లో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసా నీటి పాలైంది.
*రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదు.
*నష్టం అంచనాలను రూపొందించే ప్రభుత్వం పరిహారాన్ని అందించడంలో ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
*గత ఏడాది జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారం ఇప్పటికీ కూడా చెల్లించలేదని రైతాంగం ఆవేదన చెందుతున్నారు.
*ఈసారి పరిహారం ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
*ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.71 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.
*అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోనే పంటలు నష్టపోయి ఉంటాయని క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళిన నాయకులు తెలియచేశారు.
*ప్రధానంగా వరి పంట నీట మునిగి కుళ్లిపోతోంది.
*ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో వరి సాగు చేసినవారి పరిస్థితి దయనీయంగా ఉంది.
*తక్షణమే ఆ పరిహారం చెల్లిస్తే తదుపరి పంటకు రైతులు మానసికంగా సంసిద్ధులు అవుతారు.
*ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ నుంచి వచ్చిన జీవో 19ని ఉపసంహరించుకోవాలి.
*వరద ముంపు బారినపడ్డ ప్రతి కుటుంబాన్ని ఆదుకొని... ఉపాధికి దూరమైన కాలానికి పరిహారం ఇవ్వాలి.