National updates:ఓబిసి క్రిమిలేయర్ పెంపుపై రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్న..
జాతీయం..
-ఓబిసి క్రిమిలేయర్ను 12 లక్షలకు పెంచే ప్రతిపాదన ఉందా అని ప్రశ్నించిన ఎంపీ
-క్రిమిలేయర్ సవరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందన్న మంత్రి కృష్ణ పాల్ గుర్జర్
High Court Of Andhra Pradesh: తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మంకి బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్..
అమరావతి (హైకోర్టు)..
-నాలుగు రోజుల క్రితం నాన్ బెయిలబుల్ కేస్ పెట్టిన గుడివాడ పోలీసులు.
-మంత్రి కొడాలి నాని పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఒక వ్యక్తి పిర్యాదుతో నాన్ బెయిలబుల్ కేస్ పెట్టిన పోలీసులు.
-నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలిసిన అవసరం ఏంటి అని పోలీసులను ప్రశించిన హైకోర్ట్
-నాదెండ్ల బ్రహ్మంని అరెస్ట్ చేయకుండా కేసు విచారణ చేసుకోవచ్చని పోలీసులకు సూచించిన హైకోర్ట్.
Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
అమరావతి..
-డాక్టరుగా పేదలకు సేవచేయడంతో పాటు, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్సచేసి శాంతిని, అభివృద్ధిని అందించి, ఆరోగ్యకర సమాజానికి బాటలు వేసిన పొలిటికల్ డాక్టర్ కీర్తిశేషులు కోడెల శివప్రసాదరావుగారు.
-అవినీతిపరుల కక్షలు, కుట్రల కారణంగా ఆయన మనకు దూరమై ఏడాది గడిచింది.
-మూడున్నర దశాబ్దాల రాజకీయజీవితంలో ఎన్‌టీఆర్, చంద్రబాబుగార్ల మంత్రి వర్గాల్లో పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరుపొందారు.
-నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతిగా తన వ్యక్తిత్వంతో ఆ పదవికే వన్నె తెచ్చారు.
-కోడెలగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు..
Vijayawada updates: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన బీజెపీ ఏపీ ఛీఫ్ సోము వీర్రాజు..
విజయవాడ..
-మరో అరగంట సేపు గవర్నర్ తో దేవాలయాలు, హిందువులపై దాడులు అంశంపై ఇరువురి మధ్య చర్చ..
-హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న సోము వీర్రాజు..
Vijayawada updates: రధానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు కార్పెట్ ని తెరిచి చూసే సమయంలో సింహాలు కనిపించలేదు..వెల్లంపల్లి శ్రీనివాసరావు..
విజయవాడ..
వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవాదాయ శాఖా మంత్రి..
-వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించలేదు..
-గత ప్రభుత్వం హయాంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుంది
-ఘటనపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తాం
-సెక్యూరిటీ ఏజెన్సీ కి దేవాలయం భద్రతా అప్పగించాం..
-సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతాలోపం అని తేలితే దానిపై చర్యలు తీసుకుంటాం
-ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయి
-అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నాం..
Srisailam project updates: శ్రీశైల జలాశయానికి గంట గంట కు కొనసాగుతున్న వరద ప్రవాహం..
కర్నూలు జిల్లా శ్రీశైలం
-ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుండి 1,59,307 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 24,816 క్యూసెక్కులు హంద్రీ నుండి 250 క్యూసెక్కులు వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరిక
-8 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,24,600 క్యూసెక్కుల వరద నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు
-టోటల్ ఇన్ ఫ్లో 1,84,373 క్యూసెక్కులు
-అవుట్ ఫ్లో 2,54,088 క్యూసెక్కులు
-ప్రస్తుత నీటి మట్టం 885.000 అడుగులు
-పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు
-ఆంద్రప్రదేశ్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 7 జనరేటర్ల ద్వారా ముమ్మరంగా విద్యుదుత్పత్తి
-పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసిలు
-ప్రస్తుత నీటి నిల్వ 215.8070 టిఎంసిలు.
Visakha updates:-పరపవిత్రమైన క్షేత్రం శ్రీ కాళహస్తి క్షేత్రం..శ్రీనివాసనంద సరస్వతి..
విశాఖ..
-ఏపి సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి కామెంట్స్..
-ఇక్కడ నంది విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారు?
-ఈ ఘటనకు పాల్పడింది ఎవరు?
-తాజాగా ఇంద్రకీలాద్రి కనక దర్గా అమ్మవారి రధం వెండి విగ్రహాలు మాయం అయ్యాయి.
-దీనిపై కూడా సీబీఐ విచారణ జరిపించాలి.
-దేవాలయాల్లో సి సి కెమెరా ఏమి అయ్యాయి?
-ఇన్ని ఘటనలు జరుగుతున్నా,సీఎం, దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు స్పందించరు?
-దేవాలయాల భద్రత పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
-దేవాలయాలపై కుట్ర జరుగుతోంది.
-రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్న దేవాదాయ శాఖ మంత్రికి సిగ్గు లేదు.. వెంటనే రాజీనామా చేయాలి.
-ఈ ప్రభుత్వం మైనార్టీల కోసమే ఉందా?
-జగన్ సర్కార్ లో హిందువులు లేరా? ఉంటే ఎందుకు మాట్లాడడం లేదు?
-ఇన్ని ఘటనలు జరుగుతున్నా, జగన్ ఎందుకు మాట్లాడారు?
Vijayawada updates: ఈ రోజు కార్ వార్త అనే కార్యక్రమంలో అమ్మవారి ఆలయంలో ఉన్న రథానికి అధిక ప్రాధాన్యత ఉంది..సోము వీర్రాజు..
విజయవాడ:-
సోము వీర్రాజు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు:-
-ఉత్సవాల్లో భాగంగా ఈ రథాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.
-ఈ రథం ఖరీదు 15 లక్షలు.
-ప్రస్తుతం రథంలో సింహాలు ఒకటే ఉంది.
-రథానికి ఉన్న ఒక సింహం బొమ్మ బ్రేక్ చేసిన విధంగా ఉంది.
-ఇది ఆలయానికి సంబంధించిన సిబ్బంది నిర్లక్ష్యం.
-ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనే చోట్ల జరుగుతున్నాయి.
-హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం ఇప్పటికయినా చర్యలు తీసుకోవాలి.
-ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి భాద్యుల పై వెంటనే చర్యలు తీసుకోవాలి అని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై నిన్న వివాదం కారణం అయ్యిన వెండి రథం సందర్శించనున్న పలువురు రాజకీయ నాయకులు..
విజయవాడ..
-బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ యంయాల్సి బుద్ధ వెంకన్న వెండి రథాన్ని పరిశీలించనున్నారు
-ఈవో పొంతన లేని మాటలకు రాజకీయ నాయకుల సందర్శనతో క్లారిటీ వచ్చే అవకాశం
Rajahmundry updates: ఏలేశ్వరం లోని ఏలేరు జలాశయానికి 4వేల క్యూసెక్కులకు తగ్గిన వరద ఇన్ఫ్లో..
తూర్పుగోదావరి -రాజమండ్రి..
-ప్రస్తుతం గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న 8వేల క్యూసెక్కులు 6వేలకు కుదింపు
-నాల్గవ రోజు ముంపులోనే కొనసాగుతున్న కిర్లంపూడి,జగ్గంపేట, ప్రత్తిపాడు , గొల్లప్రోలు, పిఠాపురం యు.కొత్తపల్లి మండలాల్లో పలు గ్రామాల వరిపొలాలు
-కిర్లంపూడిలో రాజుపాలెం, ముక్కొల్లు, వీరవరం, ఎస్.తిమ్మాపురం గ్రామాల్లో ఏలేరు ప్రధాన కాల్వకు గండ్లు
-పిఠాపురంలో మాధవరం, రాపర్తి, వీరరాఘవపురంలో గొర్రికండి కాల్వకు గండ్లు
-భారీవర్షాలు,వరదల వల్ల జిల్లాలో 25 మండలాల్లో 130 గ్రామాలపై ముంపు ప్రభావం
-7వేల719 హెక్టార్లలో వరి, 192 హెక్టార్లలో ప్రత్తి, ఇతర అరటి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం కలిగించిందని అంచనా
-నాల్గవ రోజు జిల్లాలో పడుతున్న వర్షాలు...
-అన్నవరం పంపా రిజర్వాయరు నుంచి 900 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల