Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 16 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చతుర్దశి రా.7-03వరకు తదుపరి అమావాస్య | మఘ నక్షత్రం మ.12-07వరకు తదుపరి పుబ్బ | అమృత ఘడియలు: ఉ.9-47 నుంచి 11-20 వరకు తిరిగి తె.4-52 నుంచి | వర్జ్యం: రా.7-43 నుంచి 9-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-31 నుంచి 12-20 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-01
ఈరోజు తాజా వార్తలు
- తిరుపతి పార్లమెంటు సభ్యుడు శ్రీ బల్లి దుర్గాప్రసాద్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ బాధ్యులు(రీజనల్ ఇన్‌చార్జ్), శ్రీ వైవి.సుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు.
- సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీ దుర్గాప్రసాద్ మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. నెల్లూరు జిల్లా ప్రజలకు ఆయన నిత్యం అందుబాటులో ఉండేవారని చెప్పారు.
- 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన శ్రీ దుర్గాప్రసాద్ నియోజకవర్గంలోని ప్రజాసమస్యల పట్ల వెనువెంటనే స్పందించేవారని నివాళులు అర్పించారు.
- ఆయన మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
అమరావతి..
-సాగునీటి ప్రాజెక్టులపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష
-ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయండి
-వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టండి
-చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నింపాలి
-సజావుగా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు
-ఎక్కడా రైతులను ఇబ్బంది పెట్టేలా చర్యలు వద్దు
-వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి
అమరావతి..
పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
• 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటే ముఖ్యమంత్రి ధ్యేయం, మంత్రిగా నాకు సార్థకత
• స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యమైన టెక్ మహీంద్ర ఫౌండేషన్, బయోకాన్ అకాడమీ, స్నైడర్ ఎలక్ట్రిక్
• ఎపిఎస్‌ఎస్‌డిసితో టెక్ మహీంద్ర, బయోకాన్, స్నైడర్ కంపెనీల ఎంవోయూ
• మంత్రి సమక్షంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు సంస్థల ప్రతినిధుల సంతకాలు
• నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులకు మంత్రి అభినందనలు
• విశాఖలో టెక్ మహీంద్ర ఆధ్వర్యంలో లాజిస్టిక్ రంగంలో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'
• నెల్లూరులో స్నైడర్ భాగస్వామ్యంతో ఎలక్ట్రికల్ విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
• స్కిల్ కాలేజీల్లో లైఫ్ సైన్సెస్ డొమైన్ లో నాలెడ్జ్ పార్టనర్ గా బయోకాన్ అకాడమి
జాతీయం..
సురేష్ , వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ..
-న్యాయం తప్పకుండా గెలుస్తుందని మా నమ్మకం
-సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాటం చేస్తా ము
-పెద్దవారికి ఒక రకంగా, చిన్న వారికి మరో రకంగా న్యాయం జరగడం అనేది సరైంది కాదు
-సొంత నియోజకవర్గానికి వెళ్తే తంతారని భయంతో ఢిల్లీలో రఘురామకృష్ణ ఉంటున్నాడు
-మిథున్ రెడ్డి పైన అవాకులు చెవాకులు పేళుతున్నాడు
-రఘురామకృష్ణంరాజు చవట దద్దమ్మ లాగా మాట్లాడుతున్నాడు
-ఆయన గజ్జి కుక్క కంటే హీనంగా మాట్లాడుతున్నాడు
-త్వరలోనే రాజకీయాల నుంచి ఆయన కనుమరుగు కాక తప్పదు
-రఘురామకృష్ణరాజు కు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు
-మోసగాడు, చీటర్ కు ఓటు పెడితే నీకు 545 ఓట్లు పడతాయి
-త్వరలోనే రాజు పై అనర్హత వేటు తప్పదు
-చీప్ క్యారెక్టర్ కాబట్టి బీజేపీ వాళ్ళు నిన్ను బీజేపీలో చేర్చు కోవడం లేదు
జాతీయం..
-ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలకు రూ 423 కోట్ల బకాయిలున్న కేంద్రం..
-2018-19 కి రూ 183.25 కోట్లు,2019-20కి గాను రూ 239.95 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉందన్న కేంద్రం
-త్వరగా ఏపీకి బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సిఫార్సు చేసినట్లు తెలిపిన మంత్రి
-ఏపీతో పాటు మిగతా అన్ని రాష్ట్రాలకు బకాయి నిధులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి
-బకాయిల చెల్లింపుపై మార్చి 21, ఏప్రిల్ 16న ఆర్ధిక శాఖకు లేఖ రాసినట్టు వెల్లడి
శ్రీకాకుళం జిల్లా..
-దీంతో జిల్లాలో 34,215 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య..
-ఈరోజు కరోనా నుంచి కోలుకుని 813 మంది డిశ్చార్..
-ప్రస్తుతం జిల్లాలో 6,107 ఆక్టీవ్ కేసులు..
విశాఖ జిల్లా..
-ఎంపీల ప్రశ్నలకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం:
-భద్రతా పరమైన ఖర్చు (సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్‌పెండిచర్) స్కీమ్ పరిధిలో విశాఖ జిల్లా ఉంది
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పథకం కింద 2019-20లో రూ. 37.23 కోట్లు ఇచ్చాం
-గత ఐదేళ్లలో 95.47 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చాం
-నక్సలైట్ల లొంగుబాట్లను ప్రోత్సహించే పథకాలు అమలు చేస్తున్నాం
-లొంగిపోయనవారు వ్యాపారాలు చేసుకునేందుకు శిక్షణ - ఆ సమయంలో నెలకు రూ. 6,000 స్టైపండ్ ఇస్తున్నాం
గుంటూరు....
-మృతిచెందిన వ్యక్తులపేర్లుతో పించను మంజూరు చేసిన సోషల్‌వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి...
-మృతుల పేర్లుతో పించను సొమ్మును ఉద్యోగి కాజేశాస్తునట్లు ఆధారాలతో పట్టుకున్న స్థానిక వైసిపి నాయకుల...
-ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్థానిక నాయకులు... ఆధారాలతో జిల్లా అధికారులు తో నివేదిక ఇచ్చిన మండల అధికారులు.......
తిరుమల-తిరుపతి:
-ఆలయ నిర్మాణంకు 5 ఏకరాల స్థలం కేటాయించాలని యూపి ప్రభుత్వాన్ని కోరిన టిటిడి
-ఎసి గదులు ధరలు పెంచే యోచబలో టిటిడి త్వరలోనే అమలుకు సన్నాహాలు
-వెయ్యి రూపాయల ఎసి గదులు ధరలను 1500 కి పెంచాలని నిర్ణయం
-భక్తులు సౌకర్యార్ధం 120 ఎసి గదులును అడ్వాన్స్ రిజర్వేషన్ విధానం లో కేటాయించాలని నిర్ణయం
-పాత ధరలకే టిటిడి డైరీ, క్యాలెండర్ లు విక్రయించాలని టిటిడి నిర్ణయం
-నూతన ఏడాదికి 15 లక్షల శ్రీవారి క్యాలండర్లు,10 లక్షల డైరిలను విక్రయించనున్న టీటీడీ...
-క్యాలండర్, డైరిల ధరలను పెంచాలని ప్రతిపాదించిన పర్చేస్ కమిటి....
కడప :
-వారి వద్ద నుండి పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు .....
-పులివెందుల మండలం నామాలగుండు వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా ఒక ఆటోలో గంజాయి లభించింది ....
-ఇద్దరు నిందితుల అరెస్టు ....ఒకరు పరారీ .....