Rajahmundry updates: ఏలేశ్వరం లోని ఏలేరు జలాశయానికి 4వేల క్యూసెక్కులకు తగ్గిన వరద ఇన్ఫ్లో..

తూర్పుగోదావరి -రాజమండ్రి..

-ప్రస్తుతం గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న 8వేల క్యూసెక్కులు 6వేలకు కుదింపు

-నాల్గవ రోజు ముంపులోనే కొనసాగుతున్న కిర్లంపూడి,జగ్గంపేట, ప్రత్తిపాడు , గొల్లప్రోలు, పిఠాపురం యు.కొత్తపల్లి మండలాల్లో పలు గ్రామాల వరిపొలాలు

-కిర్లంపూడిలో రాజుపాలెం, ముక్కొల్లు, వీరవరం, ఎస్.తిమ్మాపురం గ్రామాల్లో ఏలేరు ప్రధాన కాల్వకు గండ్లు

-పిఠాపురంలో మాధవరం, రాపర్తి, వీరరాఘవపురంలో గొర్రికండి కాల్వకు గండ్లు

-భారీవర్షాలు,వరదల వల్ల జిల్లాలో 25 మండలాల్లో 130 గ్రామాలపై ముంపు ప్రభావం

-7వేల719 హెక్టార్లలో వరి, 192 హెక్టార్లలో ప్రత్తి, ఇతర అరటి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం కలిగించిందని అంచనా

-నాల్గవ రోజు జిల్లాలో పడుతున్న వర్షాలు...

-అన్నవరం పంపా రిజర్వాయరు నుంచి 900 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

Update: 2020-09-16 06:13 GMT

Linked news