Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-16 01:35 GMT
Live Updates - Page 4
2020-09-16 06:07 GMT

Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న వైజాగ్ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ..

తిరుమల..

-రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ వాటాలపై పార్లమెంటులో పోరాడాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు

-మొత్తం 17 అంశాలపై పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో సూచించారు

-పార్టీ స్టాండ్ ప్రకారం దేశ భద్రత, కరోనా, చైనా వంటి అంశాలపై ప్రస్తావిస్తాం

-పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెడుతున్న కొన్ని బిల్లుల్లో ఇబ్బందులు ఉండటంతో వాటిని ప్రస్తావిస్తాం

-రఘురామకృష్ణంరాజు జగన్ దయతో గెలిచి అవివేకంతో ప్రవర్తిస్తున్నాడు

2020-09-16 06:02 GMT

Guntur District updates: కోడెల వర్ధంతి కి మేము వ్యతిరేకం కాదు..అంబటి రాంబాబు..

గుంటూరు:....

.సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు..

-కోడెల శివప్రసాదరావు వర్ధంతిని అడ్డగిస్తున్నమని మా పై బురద చల్లటం సరికాదు

-వర్ధంతిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడటం అన్యాయం

-కోవిడ్ నిబంధనల ప్రకారం చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు

-రేపు వావిలాల గోపాలకృష్ణ జన్మిందిన వేడుకల్ని మేము భౌతిక దూరం పాటిస్తూ జరుపుతాం

2020-09-16 05:59 GMT

Guntur District updates: నేడు ఏపి అసెంబ్లీ తొలి స్పీకర్ కోడెల ప్రధమ వర్దంతి...

గుంటూరు ః..

-నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో వర్దంతి కార్యక్రమాలు.

-పాల్గోనున్న కోడెల తనయుడు కోడెల శివరాం, పలువురు టిడిపి నేతలు.

2020-09-16 05:57 GMT

Kadapa District updates: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామం వద్ద విషాదం..

కడప :

-గాలేరు నగరి కాలువలోపడి ఇద్దరు ఆత్మహత్య

-మృతులు అనంతపురం జిల్లా,యన్. పి కుంటా మండలం మర్రికొమ్మదిన్నె గ్రామస్థులుగా గుర్తించిన పోలీసులు

-మృతురాలు కవిత(24) గ్రామవాలెంటీర్ గా పనిచేస్తుండగా... ఉపాధి నిమిత్తం కువైట్ లో ఉంటున్న భర్త

-మరొ మృతుడు గ్రామ వి.ఆర్.ఏ గా పనిచేస్తున్న కార్తీక్...ఇటీవల పెళ్లి సంబంధం చూసిన పెద్దలు...

-మృతులు ఇద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటుండగా...ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ అత్మహత్య...

-కేసునమోదు చేసి విచారణ చేపట్టిన పోలీలు..

2020-09-16 05:55 GMT

Amaravati updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.

అమరావతి..

-రాష్ట్రంలో తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకై చర్యలు చేపట్టండి.

-ఇళ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 43 వేల ఎకరాల భూములను సేకరించారు.

-కేవలం 4 వేల ఎకరాల భూములకు సంబంధించి మాత్రమే వివాదాలు తలెత్తాయి.

-మిగిలిన 39 వేల ఎకరాల భూములను తక్షణమే పంపిణీ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు?

-పేదలకు ఇళ్ల స్థలాలకై పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున కేటాయించండి.

-తెలంగాణ రాష్ట్ర తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వండి.

-ఏపీ టిడ్ కో ఆధ్వర్యంలో నిర్మించిన 6 లక్షల గృహాలకు ఇప్పటికైనా తుది మెరుగులు దిద్ది లబ్ధిదారులకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టండి.

2020-09-16 05:51 GMT

Anantapur district updates: వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద రాత్రి విద్యుత్ సబ్ స్టేషన్ లో మంటలు..

అనంతపురం :

-వజ్రకరూరు మండలం రాగులపాడు 8వ పంప్ హౌస్ వద్ద రాత్రి విద్యుత్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగి సంకేతిక సమస్య వల్ల హంద్రీనీవా కు అగిపోయ  పంపింగ్...

-పంపింగ్ అగిపోవడంతో చాయాపురం వద్ద హంద్రీనీవా కాలువ నిండిపోయి బయటకు వృధాగా పోతున్న కృష్ణ జలాలు.

-నీటి ఉదృతంగా ప్రవాహిస్తుడంతో వాహనదారులను అప్రమత్తం చేసిన అధికారులు.

-ఉరవకొండ,హోతూరు, చాయపురం, కొనకొండ్ల, గుంతకల్లు పోవు వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

2020-09-16 05:42 GMT

Rajahmundry updates: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కొత్త రథాన్ని వచ్చే సంక్రాంతికి సిద్ధం చేసేలా కసరత్తు..

తూర్పుగోదావరి - రాజమండ్రి-

-అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌, ప్రత్యేక అధికారి, ఏడీసీ రామచంద్రమోహన్‌ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష

-నూతన రథం నిర్మాణంపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఛైర్మన్ గా సబ్‌ కలెక్టర్‌ కౌశిక్

-2021 ఫిబ్రవరిలో జరిగే స్వామివారి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతికి నూతన రథాన్ని నిర్మించాలని నిర్ణయం

-రథం నిర్మాణానికి వాడే కలప స్వచ్ఛమైన నాణ్యమైన బస్తర్‌ టేకు రావులపాలెం టింబర్‌ డిపోలో గుర్తింపు

-రథానికి అవసరమైన కలపను ఈనెల 19 నుంచి తగిన పరిమాణంలో కోయించే ప్రక్రియ

-నూతన రథం పాత రథం మాదిరిగానే పూర్వవైభవం ఉట్టుపడేలా వుంటుదంటున్న దేవదాయశాఖ అధికారులు..

2020-09-16 02:03 GMT

Srisailam Project Updates: శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద ప్రవాహం

- 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

- ఇన్ ఫ్లో: 1,73,726 క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో: 1,47,500 క్యూసెక్కులు

- స్పిల్ వే:4×10=1,12,300

- A P పవర్ ప్లాంట్:31,137

- పోతిరెడ్డిపాడు:1896

- హంద్రినివా:1688

- కల్వకుర్తి:800

- పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు

- ప్రస్తుతం నీటి మట్టం : 885.00 అడుగులు

- పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

- ప్రస్తుతం: 215.8070 టీఎంసీలు

- కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

2020-09-16 01:57 GMT

Corona positive : 108 ను దగ్ధం చేసిన కోవిడ్ అనుమానితుడు

ప్రకాశం జిల్లా...

- ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ ఎదుట 108 అంబులెన్స్ ని దగ్దం చేసిన కోవిడ్ అనుమానిత రోగి సురేష్.

- ఓ కేసులో ముద్దాయిగా విచారణ కోసం తాలూకా పోలీస్ స్టేషన్ కి తెచ్చిన పోలీసులు.

- పోలీసు స్టేషన్లో పాయిజన్ సేవించడం 108 కాల్ సెంటర్ కి కాల్ చేసిన పోలీసులు.

- 108 వాహనం ఎక్కి వాహనం అద్దాలు పగులగొట్టి వాహనం లో ఉన్న స్పిరిట్ తో వాహనం ను దగ్దం చేసిన రోగి సురేష్..

Tags:    

Similar News