Amaravati updates: కోవిడ్ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైకోర్టు లో దాఖలైన పీటేషన్ పై విచారణ..
అమరావతి..
-అపిల్ వేసిన గుంటూరు వాసి సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు
-పిటిషన్ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం
-అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు. ప్రభుత్వ కౌంటర్ కు వాయిదా అడిగిన అదనపు అడ్వకేట్ జనరల్.
Vijayawada Swarna Palace: స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ..
విజయవాడ..
-అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
-తదుపరి చర్యలు నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని పక్కన పెట్టిన సుప్రీంకోర్టు
-రమేశ్ ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్‍పై కస్టోడియల్ విచారణ చేయవద్దన్న సుప్రీంకోర్టు
-హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు
-ప్రమాద దర్యాప్తును నిలిపివేయాలనడం సరికాదన్న సుప్రీంకోర్టు
-విచారణను ముగించిన జస్టిస్ నారిమన్ ధర్మాసనం
Srisailam Project Updates: శ్రీశైల జలాశయానికి గంట గంట కు కొనసాగుతున్న వరద ప్రవాహం..
కర్నూలు జిల్లా.. శ్రీశైలం..
-ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుండి 1,06,316 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 47,421 క్యూసెక్కులు హుంద్రి నుండి 9,780 క్యూసెక్కులు వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరిక
-8 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,24,203 క్యూసెక్కుల వరద నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు
-టోటల్ ఇన్ ఫ్లో 1,63,517 క్యూసెక్కులు
-అవుట్ ఫ్లో 2,74,023 క్యూసెక్కులు
-ప్రస్తుత నీటి మట్టం 884.900 అడుగులు
-పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు
-ఆంద్రప్రదేశ్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 7 జనరేటర్ల ద్వారా ముమ్మరంగా విద్యుదుత్పత్తి
-పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసిలు
-ప్రస్తుత నీటి నిల్వ 215.3263 టిఎంసిలు.
National updates: ముఖ్యమంత్రితో జరిగే పార్లమెంట్ సభ్యులు సమావేశానికి నన్ను మొదట ఆహ్వానించి తరువాత రావద్దన్నారు..రఘురామకృష్ణంరాజు..
జాతీయం..
-రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎంపి..
-రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో చర్చించేందుకు అన్ని పార్టీల ఎంపీలు పిలవాలని నేను ముఖ్యమంత్రికి గతంలో సూచించా.
-వారే వద్దు అన్నాక వెళ్లి అవమాన పడడం నాకిష్టం లేదు.
-వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి నన్ను పిలువలేదు అన్న విషయం స్పీకర్కి లేఖ ద్వారా తెలియజేశాను.
-పార్టీ ఎంపీల సమావేశానికి నన్ను రావొద్దు అన్నారు కాబట్టి నన్ను బహిష్కరించినట్లు గానే భావిస్తున్నాను.
-అమరావతి లోనే రాజధాని ఉంటుందని అన్నందువల్లనే మా పార్టీకి అంత భారీ మెజారిటీ వచ్చింది.
-ప్రజలకు ఇచ్చిన మాటకు మీరే వ్యతిరేకంగా వెళ్లారు కాబట్టి మీరే రాజీనామా చేయాల్సి ఉంటుంది.
-మాటతప్పింది మీరే కాబట్టి నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.
Vijayawada updates: చిల్లకల్లు ఏస్ ఐ దుర్గారావు కరోనా తో మృతి..
కృష్ణాజిల్లా..
-ఈ నెల 6 వ తారీకు కరోనా పాజిటివ్ తో విజయవాడ టైమ్స్ ఆసుపత్రి లో చికిత్స
-ఈ రోజు ఉదయం 10 గంటలకు మృతి
-నెల రోజుల క్రితం విజయవాడ నుండి వచ్చి చిల్లకల్లు ఏస్ ఐ గా విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడిన అల్లు దుర్గారావు
-విధులలోకి చేరిన వారం రోజులలోనే కరోనా పాజిటివ్ కి గురైన ఏ స్సై
Kurnool updates: భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు AITUC ధర్నా..
కర్నూలు..
-భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు AITUC ధర్నా..
-ప్రభుత్వం ఆదుకోవడం లో విఫలయం అయిందని దిష్టి బొమ్మ దగ్ధం చేస్తుండగా అడ్డుకున్న పోలీసులు...
-బలవంతంగా సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేసిన AITUC నాయకులు..
Amaravati updates: వీడియో కాన్ఫరెన్స్ కు రఘురామకృష్ణరాజు ను దూరం పెట్టిన సిఎం జగన్!
అమరావతి...
-పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సీఎం
-మొదటగా సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని రఘురామకృష్ణారాజు కి ఏపీ భవన్ అధికారుల ఆహ్వానం
-కొద్దిసేపటికే కాన్ఫరెన్స్ కి రావొద్దని రఘురామకృష్ణారాజు కి చెప్పిన ఏపీ భవన్ అధికారులు.
-సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రఘురామకృష్ణారాజు ను ఎంపీల వీడియో కాన్ఫరెన్స్ కి రావద్దని చెప్పినట్లు సమాచారం.
Guntur Weather updates: సత్తెనపల్లి వెన్నదేవి వద్ద జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణం...
గుంటూరు జిల్లా..
-సతైనపల్లి లో భారీ వర్షం...
-తాత్కాలికంగా వేసిన రోడ్డు వరధప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన రహాదారి
-దీంతో రాకపోకలు నిలిచి పోయాయి....
Kurnool Weather updates: బనగానపల్లె నియోజకవర్గం లో విస్తారంగా కురుస్తున్న వర్షం ...
కర్నూలు జిల్లా......
-పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
-జలదిగ్బంధంలో పలు గ్రామాలు
-లింగాలను చుట్టుముట్టిన వరద నీరు ...వల్లం పాడు , చిన్న కొప్పెర్ల , పెద్ద కొప్పెర్ల గ్రామాల మధ్య ఉదృతంగా ప్రవహిస్తున్న కప్పల వాగు ,నల్లవాగు , కైప వాగులు
-కుందూనది లో పెరిగిన వరద ఉధృతి
-లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలు....
Guntur District updates: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం...
గుంటూరు....
-దాచేపల్లి నాగులేరు బిడ్జి పోంగి ప్రవహిస్తుంది....
-బిడ్జి పైనుంచి ప్రవహిస్తున్న వరధ నీరు...
-జాతీయ హైవే స్థబించిపోయింది..గుంటూరు నుంచి హైదరాబాద్ రాకపోకలు నిలిచిపోయాయి....
-దాచేపల్లి ఇళ్లలో ప్రవహిస్తున్న వరధ నీరు....
-ఇళ్లలో మోకాలు లోతు నీళ్లు.....