Kurnool district updates: ఆళ్లగడ్డ నియోజకవర్గం చింతకొమ్మదిన్నె గ్రామం లో విషాదం..
కర్నూలు జిల్లా..
-గత రాత్రి మ్యాంగో కంపెనీకి చెందిన బిస్కెట్ తిని అస్వస్థకు గురయ్యిన ముగ్గురు చిన్నారులు...
-ఆళ్లగడ్డ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే హుస్సేన్ భాష (6) మృతి...
-మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం..మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు...
Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజీ ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుంది..పేర్నినాని..
అమరావతి..
మంత్రి పేర్నినాని..
-పులిచింతల నుండి 3.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాబోతుంది..
-తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసాం..
-ముంపు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాం..
-వరద పై ఎప్పటికప్పుడు అధికారులతో సమిక్షిస్తున్నాం..
Vizianagaram updates: పార్వతీపురం మండలం గుమ్మడి వద్ద రోడ్డు ప్రమాదం..
విజయనగరం...
-రెండు లారీలు డీకొని నిలిపోయిన వాహనాలు.
-గత అర్ధరాత్రి నుండి లారీలను తీసేందుకు ప్రయత్నిస్తున్నా బయటకు రాని పరిస్థితి..
-ఆంధ్ర, ఒరిస్సా సారిహద్దు కావడం లతో రెండు రాష్ట్రాలకు రాకపోకలు అంతరాయం
-పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.
Krishna District updates: యుఎస్ లో తెలుగు యువతి దుర్మరణం...
కృష్ణా జిల్లా..
-ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ లో జారి పడి మృతి..
-కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కు చెందిన పోలవరపు కమల.
-గుడ్లవల్లేరురులో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లిన యువతి..
-శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద సెల్ఫీ దిగుతూ వాటర్ ఫాల్స్ లో పడి మృతి..
-మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నం..
Srisailam Weather updates: శ్రీశైలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం..
కర్నూలు జిల్లా..
-శ్రీశైల స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు
-వర్షానికి తడుస్తనే స్వామి అమ్మవారిని దర్శించేందుకు వెళ్తున్న మల్లన్న భక్తులు
-శ్రీశైలం మండలంలో జలమయమైన కాలనీ రోడ్లు, బయట కనిపించని జనాలు
Vijayawada updates: జక్కంపూడి కాలనీలో విషాదం..
విజయవాడ..
-తిరుపతమ్మ అనే మహిళ ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య..
-వివాహమై ఏడేళ్లు గడిచిన తల్లిని కాలేకపోతున్నానునే మనస్థాపం..
-ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య..
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
Vijayawada updates: అప్పుల బాధ తాళలేక కిడ్నీలను అమ్ముకుని... వాటిని తీర్చేద్దామనుకున్నారు..
విజయవాడ..
-ఆన్‌లైన్ ద్వారా ఒక్కో కిడ్నీకి రూ.2కోట్లు ఇస్తామని నమ్మబలికారు నేరగాళ్లు...
-వివిధ ఖర్చుల పేరిట వీరి వద్దే 16.61 లక్షలకుపైగా దండుకున్నారు
-మరో 5 లక్షలు కావాలని అడగడటంతో బ్యాంకును సంప్రదించారు బాధితులు
-తాము మోసపోయామని గ్రహించి బాధితులు భార్గవి, ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు
-కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు
Srisailam updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..
కర్నూలు జిల్లా..
-5 క్రస్ట్ గేట్లను 10 అడుగజలమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు
-ఇన్ ఫ్లో: 1,22,217 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో: 2,07,600 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు
-ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టిఎంసీలు
-ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 215.3263 టీఎంసీలు
-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
East Godavari updates: నేడు ఈ సెట్ పరీక్ష..
తూర్పుగోదావరి :
-ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్ లో పరీక్ష..
-హాజరుకానున్న 3 వేల 535 మంది విద్యార్ధులు.. కాకినాడ రాజమండ్రి, అమలాపురం, సూరంపాలెంలో 4 సెంటర్లు ఏర్పాటు..
-విద్యార్ధి శానిటైజర్, మాస్క్, చేతికి గ్లౌజులు ఉంటేనే పరీక్షకు అనుమతి..
Kurnool Weather updates: జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో కొనసాగుతున్న వర్షం..
కర్నూల్..
-నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం...
-కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం,మరికొన్ని ప్రాంతాలలో చిరుజల్లు లతో కూడిన వర్షం
-లోతట్టు ప్రాంతాలు జలమయము..పొంగి పొర్లుతున్న వాగులు,వంకలు....ఉదృతంగా ప్రవహిస్తున్న కుందు నది
-కుందు పరివాహక ప్రాంతాలు జలమయము... నిట మునిగిన వందల ఎకరాల పంటలు
-పాలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం...తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేవాలయాల దర్షణాలకు వచ్చిన భక్తులు
-అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు,జలమయం అయిన ప్రాంతాలలో పర్యటించిన అధికారులు