Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-13 01:31 GMT
Live Updates - Page 2
2020-08-13 10:26 GMT

నెల్లూరు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని కామెంట్స్

ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లాలో కరోన నియంత్రణకై అన్ని చర్యలు తీసుకుంటున్నం

జిల్లాలో ఒకదశలో కేసులు అధికంగా ఉన్న అధికారులు కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయగలిగారు

దేశంలో కరోన పరీక్షలు చేయడంలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉండడం గర్వకారణం

ఎక్కువ టెస్టులు చేయడం వలనే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి

రాష్ట్రం వ్యాప్తంగా నెలకు 350కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నాం

కరోన పేషెంట్స్ కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం

ప్లాస్మా తెరఫీ గురించి ప్రజలలో అపోహలు ఉన్నాయి..

ప్లాస్మా దానం చేసినందువల్లఎటువంటి ఇబ్బంది ఉండదు.

ప్లాస్మా దానం చేసే వాళ్ళకి 5,000రూపాయలు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది,

దాతలు స్వచ్చందంగా ప్లాస్మా దానం చేయలని విజ్ఞప్తి

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై నివేదిక అందగానే తగిన కఠిన చర్యలు తిసుకుంటాం.

కరోన మృతదేహాలు తరలింపు విషయంలో బంధువులు ప్రభుత్వంతో సహకరించాలి,

కరోన ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న విప్పత్తు,ఎక్కడో ఒకచోట చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు... వాటిల్ని కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాం

ఆళ్ళ నాని

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...

2020-08-13 10:25 GMT

అమరావతి...


పెన్మత్స సురేష్ బాబు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ...


బొత్స కామెంట్స్:


సాంబశివరావు వారసులు సురేష్ బాబు తో ఎమ్యెల్సీ గా నామినేషన్ ను సిఎం‌జగన్ వేయించారు.


సాంబశివరావు విజయనగరం నుంచి జగన్ వెంట మొట్టమొదట వచ్చారు.


ఆయన వారసుడుగా సురేష్ బాబు పార్టీకి విధేయుడుగా‌ వున్నారు.


సురేష్ బాబు...


మొదట ఓదార్పు యాత్రకు జగన్ వచ్చినప్పటి నుండి ఆయన వెంట వున్నాం.


పార్టీకి విధేయుడిగా వుంటా...చెడ్డపేరు‌ తీసుకరాను.


అమరావతి....


మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ ఆన్ అమరావతి...


ఏఎంఆర్డిఏ రివ్యూ సిఎం జగన్ చేశారు.


అమరావతి ప్రాంతం ఈ రాష్ట్రంలో అంతర్భాగం.


ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని దృష్టి లో పెట్టుకొని రైతులకు రిటన్ ప్లాట్లు ఇచ్చి ఆభివృద్ధి చేస్తాం.


చంద్రబాబు లాగా‌చెప్పం.


చంద్రబాబు ప్రతిపక్ష బాధ్యత విస్మరించారు.


సిఆర్డిఏ చట్టం రద్దును, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించాకే శంఖు స్థాపన చేయాలనుకున్నాం.


ప్రతిపక్షాలు కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నాయి.


శంకుస్థాపన కు ప్రధానమంత్రి ని, దేశంలోని పెద్దలను అందరినీ పిలుస్తాం.


శుభకార్యాలు అందరికీ చెప్పి చేయడం హిందూ సాంప్రదాయం.


అమరావతి నిర్మాణం లో వున్న


భవనాలు అన్నీ పూర్తి చేస్తాం.


వాటిని ఏం‌ చేయాలి ఎందుకు ఉపయోగించాలి అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.


రైతు లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ చెబుతున్నాం.


అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.


లేనిపోని అనుమానాలు పెట్టికోవద్దు.


ప్రతిపక్షం మాటలు నమ్మ వద్దు.


2020-08-13 07:39 GMT

అమరావతి:

సుచిరిత హోం మినిష్టర్

- ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ వైస్సార్ చేయూత కార్యక్రమం ప్రారంభించారు..

- 23 లక్షల మంది మహిళకు వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ది చేకూరింది..

- వైఎస్సార్ చేయూత పథకంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

- ఆముల్, రిలియన్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్దికంగా స్థిరపడ వచ్చు

- వైస్సార్ చేయూత పథకంపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం తగదు..

- మహిళను మోసం చేసిన ఘనత చంద్రబాబుది..

- డ్వాక్రా రుణాలు పూరీగా మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళను మోసం చేశారు..

- అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంల్లో జగన్మోహన్ రెడ్డి మూడవ స్థానం సాధించడం రాష్ట్రానికి గౌరవ ప్రదంగా భావిస్తున్నాము..

- ఇచ్చిన హామీల్లో దాదాపు అన్నింటిని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు.

- పాదయాత్ర ద్వారా మహిళల కష్టాలను జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెలుసుకున్నరు..

- మహిళకు సున్నా వడ్డీ పథకం అమలు చేశారు..

- డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లించనున్నారు..

- ఇచ్చిన మాట నబెట్టుకున్న గొప్ప సీఎం జగన్మోహన్ రెడ్డి..

- ప్రతి మహిళను లక్షలాది కారిని చేసిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి దక్కుతుంది..

- మహిళకు పావలా వడ్డీకే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రుణం ఇచ్చారు..

- అమ్మఒడి, చేయుత ద్వారా మహిళకు ఎంతో మేలు జరుగుతుంది..

- మహిళ పక్షపాత సీఎం జగన్మోహన్ రెడ్డి..

- నామినేషన్ పదవులు పనుల్లో 50 శాతం అవకాశం మహిళకు సీఎం కల్పించారు..

- మహిళలు ఆర్దికంగా స్థిరపడ్డడంకోసం సీఎం అనేక నిర్ణయాలు తీసుకున్నారు..

- 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు..

- మహిళకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు..

- భావిస్తున్నారు..

- ఉనికి కోల్పోతామే భయంతో టీడీపీ నేతలు వైస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారు..

- టీడీపీ మహిళకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు..

- పై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం తక్షణం

- దళితుల దాడి చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్నాము..

- టీడీపీ కుల రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది

2020-08-13 07:36 GMT

ఏ ఎం ఆర్‌ డి ఏ పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష..

అమరావతి:

- ఏ ఎం ఆర్‌ డి ఏ పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

- పాల్గొన్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ,సీఎస్‌ నీలం సాహ్ని,

- ఏఎంఆర్‌డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు.

2020-08-13 07:34 GMT

తెలుగుదేశం తరపున సీతానగరం శిరోముండనం బాధితుడు ప్రసాద్ రూ . 2 లక్షలు ఆర్ధిక సహాయం

తూర్పుగోదావరి:

రాజమండ్రి: తెలుగుదేశం తరపున సీతానగరం శిరోముండనం బాధితుడు ప్రసాద్ రూ . 2 లక్షలు ఆర్ధిక సహాయం

- టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పంపిన రెండు లక్షల చెక్కును బాధితుడు ప్రసాద్ కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, తెలుగుయువత ఆదిరెడ్డి వాసు, టిడిపి దళిత నేత కాశి నవీన్ ప్రసాద్ కు న్యాయం చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది శిరోముండనం కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, తెలుగుయువత నాయకులు ఆదిరెడ్డి వాసు

2020-08-13 07:08 GMT

అమరావతి:

- వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్‌ పెన్మత్స సూర్యనారాయణ రాజు(సురేష్‌ బాబు)కు క్యాంపు కార్యాలయంలో బీ ఫారమ్‌ అందజేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

- పాల్గొన్న మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, వైయస్సార్సీపీ విజయనగరం జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు.

2020-08-13 06:39 GMT

తూర్పుగోదావరి:

- మామిడికుదురు మం.

- పాశర్లపూడి సెంటర్ వద్ద జాతీయ రహదారి పై త్రాచు పాము హల్చల్

- సుమారు గంట పాటు ట్రాఫిక్ అంతరాయం.

- భయభ్రాంతులకు గురైన స్థానికులు

- పామును కొట్టి చంపిన స్థానికులు..

- ఊపిరిపీల్చుకున్న గ్రామస్తులు.

2020-08-13 06:38 GMT

నెల్లూరు జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలు సమీక్షించనున్న మంత్రులు..

నెల్లూరు:

- నెల్లూరు డిస్టిక్ ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి , రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , జిల్లా కలెక్టర్ చక్రధర బాబు తదితరులు.

- నెల్లూరు జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలు సమీక్షించనున్న మంత్రులు.

- మరికొద్దిసేపట్లో జిల్లాలోని కరోనా బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న మంత్రి ఆళ్ల నాని.

2020-08-13 06:38 GMT

విజయవాడ:

- స్వర్ణప్యాలెస్ యాజమాన్యానికి చెందిన అన్ని భవనాలను పరిశీలిస్తున్న ఫైర్ అధికారులు

- ఏలూరు రోడ్డులోని స్వర్ణ కాంప్లెక్స్ లోని ఫైర్ భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఆర్ఎఫ్ఓ

- స్వర్ణప్యాలెస్ ఘటనతో మొత్తం అన్ని భవనాల అనుమతులు పరిశీలిస్తున్న అధికారులు

2020-08-13 06:31 GMT

ప్రకాశం జిల్లా:

- తాళ్ళూరు మండలం బొద్దికూరపాడు గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న సమయంలో ఫిడ్స్ వచ్చి సత్తెనపల్లి కి చెందిన షేక్ కాశిం(40)అనే వ్యక్తి మృతి.

Tags:    

Similar News