Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-13 01:31 GMT
Live Updates - Page 3
2020-08-13 06:30 GMT

విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహాం వద్ద కార్మిక సంఘాలు ఆందోళన

విశాఖ:

- పరిశ్రమల్లో ప్రమాదాలను నిలువరించి, కార్మికుల ప్రాణాలను రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహాం వద్ద కార్మిక సంఘాలు ఆందోళన

-పరిశ్రమల్లో నిత్యం తనిఖీలు చేపట్టి, భద్రతా ప్రమాణాలు కఠినంగా అమలు చేయాలంటూ డిమాండ్

2020-08-13 06:29 GMT

కరోనా విస్తరిస్తున్న నేపద్యంలో తుని పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ ..

తూర్పుగోదావరి : 

తుని: కరోనా విస్తరిస్తున్న నేపద్యంలో తుని పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ ..

- కూరగాయలు, మెడికల్ షాపులు ఒకపూట మినహా అన్ని దుకాణాలు పూర్తిస్థాయిలో మూసివేత...

2020-08-13 05:35 GMT

స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధం అవుతున్న ఇందిరాగాంధీ స్టేడియం

విజయవాడ:

- ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న 74వ స్వాతంత్య్ర దినోత్సవ రిహర్షల్స్ లో పాల్గొన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

- పోలీసు, భద్రతా,రిజార్వ్ బలగాలు నుంచి గౌరవ వందనం స్వీకరణ

- కరోనా నేపధ్యంలో ముఖాలు కు మాస్క్ లు, హెడ్ మాస్క్ లు చేతికి గ్లౌజెస్ ధరించి రిహర్షల్స్

- 74 వ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధం అవుతున్న ఇందిరాగాంధీ స్టేడియం

- వర్షంలోను రిహార్సల్స్ చేస్తున్న భద్రతా బలగాలు,పోలీసులు

- వర్షం వల్ల నీరు ఉన్న ప్రాంతాల్లో బ్లాక్ గ్రావెల్ తో స్టేడియం గ్రౌండ్ లో నింపుతున్న విజయవాడ కార్పొరేషన్ అధికారులు

- ఇండిపెండెన్స్ కు సిద్ధం అవుతున్న ప్రత్యేక శకటాలు

- త్రివర్ణ పతాకాలుతో ముస్తాబు అవుతున్న ఇందిరాగాంధీ స్టేడియం

2020-08-13 05:32 GMT

జన్మదిన వేడుకల పేరిట అడంబ‌రాలు వ‌ద్దు..

విజ‌య‌వాడ‌:

- జన్మదిన వేడుకల పేరిట అడంబ‌రాలు వ‌ద్దు

- కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయండి.

- దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు.

- క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది

- జన్మదిన వేడుకల పేరిట అడంబ‌రాలకు దూరంగా ఉండాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు,

- అభిమానుల‌కు పిలుపునిచ్చిన మంత్రి వెలంప‌ల్లి.

2020-08-13 05:25 GMT

దేవిపట్నం మండలాన్ని మళ్ళీ ముంచెత్తనున్న వరద..

తూర్పుగోదావరి: 

రాజమండ్రి: దేవిపట్నం మండలాన్ని మళ్ళీ ముంచెత్తనున్న వరద. ప్రమాదం

- గోదావరి వరద పరవళ్ళుతో జలదిగ్భంధంలో చిక్కుకోనున్న 18 గిరిజన గ్రామాలు

- పోశమ్మగండి వద్ద పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వద్ద పోటెత్తి ప్రవహిస్తున్న వరద గోదావరి

- దేవిపట్నం - తొయ్యేరు ప్రధాన రహదారిపై గోదావరి వరద నీరు..

- పొంగుతున్న దండంగి వాగు..

- పోశమ్మగండి, పూడిపల్లి, దేవిపట్నం, తొయ్యేరు, అగ్రహారం, మూలపాడు, మంటూరు, పెనీకీలపాడు, కచ్చులూరు, తున్నూరు, కొండమొదలు వంటి గ్రామాలకు తెగిపోతున్న రాకపోకలు

2020-08-13 04:13 GMT

బంగాళాఖాతంలో అల్పపీడనం..

విశాఖ:

- బంగాళాఖాతంలో అల్పపీడనం..

- కోస్తా కు బారీ వర్ష సూచన..

- మత్స్యకారుల కు కొనసాగుతున్న హెచ్చరికలు..

- బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణీ, ఉపరితల ఆవర్తనం..

- తీరం వెంబడి గంట కు 45 నుండి 55 కీ మీ వేగం తో గాలులు

- సముద్రం లో 3.5 మీటర్ల ఎత్తులో అలల ఉదృతి...వుండే అవకాశం..

2020-08-13 04:11 GMT

కరోనా తీవ్రత నేపధ్యంలో జిల్లాలో సిరో సర్వైలెన్స్ సర్వే పూర్తి

తూర్పుగోదావరి:

రాజమండ్రి: కరోనా తీవ్రత నేపధ్యంలో జిల్లాలో సిరో సర్వైలెన్స్ సర్వే పూర్తి

- 3757 మంది నుంచి రక్తనమూనాలు సేకరణ

- వీటిలో హైరిస్క్ కరోనా సేవలలో నిమగ్నమైన 757 మంది నుంచి రక్తనమూనాలు

- రక్త నమూనాలు ఇచ్చిన వారిలో జిల్లా కలెక్టరు మురళీధర్ రెడ్డి, జేసీలు రాజకుమారి, కీర్తి, ఎస్పీ నయిం ఆస్మీ, శిక్షణ కలెక్టరు అపరాజిత సింగ్

2020-08-13 04:10 GMT

తుంగభద్ర కు నిలకడగా కొనసాగుతున్న ప్రవాహం..

అనంతపురం: 

- డ్యాం ఇన్ ఫ్లో: 38823 క్యూసెక్కులు.

- ఔట్ ఫ్లో: 9031 క్యూసెక్కులు.

- డ్యాం లో నీటి నిల్వ: 88.380

- పూర్తి స్థాయి నీటి మట్టం: 100.850

- డ్యాం లో నీటి మట్టం: 1629.62 అడుగులు.

- పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు.

2020-08-13 04:09 GMT

కరోనా కేసులలో ఏపీలోనే తూర్పుగోదావరి తొలిస్థానం

తూర్పుగోదావరి: 

రాజమండ్రి: కరోనా కేసులలో ఏపీలోనే తూర్పుగోదావరి తొలిస్థానం

- 35వేల 642 కి చేరిన పాజిటీవ్ కేసులు

- వీరిలో 20వేల 120 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు

- యాక్టీవ్ పాజిటీవ్ కేసులు 15వేల 284 మంది

- జిల్లాలో 238 కి చేరిన కరోనా మరణాలు

2020-08-13 04:08 GMT

హైకోర్టు లో మరో రెండు పిటిషన్లు దాఖలు..

అమరావతి:

- హైకోర్టు లో మరో రెండు పిటిషన్లు దాఖలు..

- వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు..

- కొత్తగా తీసుకొచ్చిన రెండు చట్టాలు చట్టవిరుద్దం అంటూ పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్..

- ఇప్పటికే మూడు రాజధానుల కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మరి కొందరు రైతులు..

Tags:    

Similar News