ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి:
- ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- వైఎస్ఆర్ చేయూతతో పేదరికానికి శాశ్వతంగా చెక్.
- 45ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750
- మొత్తం నాలుగేళ్లపాటు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకే డబ్బు.
- జీవనోపాధి కోసం చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకోవడానికి చేయూత.
కడప :
పులివెందుల మండలంలోని కనంపల్లె తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను పట్టుకున్న పొలీసులు...
ఒకరి అరెస్ట్... 2.20 లక్షల విలువైన గుట్కా, పది మద్యం సీసాలు స్వాధీనం...
విశాఖ తీరానికి అమ్మోనీయం నైట్రేట్ నౌక
- అప్రమత్తమైన నౌకశ్రయ వర్గాలు..
- రష్యా నుండి 25 వేల టన్నుల అమోనీయం నైట్రేట్ లోడుతో రాత్రి విశాఖ చేరుకున్న నౌక...
- బీరూట్ ప్రమాదం దృష్ట్యా అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తున్న పోర్టు..
రాజమండ్రి వద్ద పరవళ్ళు తొక్కుతున్న వరద గోదావరి
తూర్పుగోదావరి -రాజమండ్రి
- గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ లో 175 గేట్లు ఎత్తివుంచిన అధికారులు
- బ్యారేజ్ నుంచి 4లక్షల 10వేల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల
- దిగువన పొంగుతున్న కోనసీమలోని వశిష్ట,వైనతేయ, గౌతమీ గోదావరి ఉపనదులు
- అప్రమత్తమైన అధికార యంత్రాంగం '
- పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం వద్ద మరింతగా పెరుగుతున్న వరద
- పోలవరం ముంఫు మండలం దేవీపట్నం లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని అధికారుల హెచ్చరికలు
- ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 9.40 అడుగుల నీటిమట్టం
- భద్రాచలం వద్ద 32 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం
- పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం వద్ద 24.750 మీటర్ల వరద నీటిమట్టం
- డొంకరాయి ప్రాజెక్టు నుంచి 34వేల 500 క్యూసెక్కుల వరదనీరును గోదావరిలోకి విడుదల
- ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకు పెరగనున్న వరద ప్రవాహం
స్వర్ణప్యాలెస్ ఘటనలో నివేదికలు సిద్ధం
విజయవాడ
- ఈరోజు అధికారులకు ఫోరెన్సిక్, వైద్య, రెవెన్యూ, ఫైర్ నివేదికలు
- రమేష్ హాస్పిటల్, స్వర్ణప్యాలెస్ యాజమాన్యాల కోసం కొనసాగుతున్న గాలింపులు
- కోవిడ్ నెగెటివ్ వచ్చిన తరువాత కూడా ఎందుకు డిచ్ఛార్జ్ చేయలేదనే అనుమానాలు
- ప్రభుత్వం ప్రైవేటు క్వారంటైన్ అంటుంటే, ప్రైవేటు కోవిడ్ కేర్ అనుమతులపై వ్యక్తమవుతున్న అనుమానం
- నివాస భవన నిర్మాణానికి అనుమతులుంటే, హోటల్ ఎలా నిర్మించారనే దిశగా విచారణ
- రిసెప్షన్ వద్ద ఘటన సమయానికి ఎవరూ లేరా అనే ప్రశ్నకు పొంతన లేని సమాధానాలు